pizza
Krish interview (Telugu) about Gautamiputra Satakarni
రాజ‌మౌళి రెండు స‌ల‌హాలిచ్చారు - క్రిష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 January 2017
Hyderaba
d

గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుం, కంచె అంటూ వైవిద్య‌మైన చిత్రాల‌తో ముందుకు వెళ్తున్నారు క్రిష్‌. నంద‌మూరి బాల‌కృష్ణ 100వ చిత్రంగా తెలుగువారికి ఉగాది పండుగ‌ను ప‌రిచ‌యం చేసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి క‌థ‌ను ఈ ద‌ఫా తెర‌కెక్కించారు. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా క్రిష్ సోమ‌వారం ఉద‌యం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* అస‌లు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అనే పేరు పెట్టాల‌ని ఎందుకు అనిపించింది?
- చిన్న‌ప్పుడు ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీని చూసిన‌ప్పుడు ఆ యూనివ‌ర్శిటీకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని నాలో సంశ‌యం ఉండేది. ఆ త‌ర్వాత అమ‌రావ‌తీ ట్రిప్ వెళ్లిన‌ప్పుడు కూడా అదే డౌటే. ఇలా నా చిన్న‌త‌నం నుంచే ఉండేది. అది పెరిగి పెద్ద‌దై ఇంత‌దాకా వ‌చ్చింది.

* ఈ స్క్రిప్ట్ ను బాల‌కృష్ణ‌ను ఉద్దేశించే రాసుకున్నారా?
- స్క్రిప్ట్ రాసిన‌ప్పుడే ఆ స‌బ్జెక్ట్ డిమాండ్ చేసిన క‌థానాయ‌కుడు ఆయ‌నే. ఆయ‌న్ని ఇంత‌కు ముందు భైర‌వ‌ద్వీపంలో చూశాం. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాధీశుడిగా ఎంత బాగా చేశార‌నీ. అందుకే ఆయ‌నకి ఈ స్క్రిప్ట్ ప‌క్కాగా స‌రిపోతుంద‌నుకున్నాం. క‌థ విన్నంత సేపూ ఆయ‌న కూడా అలాంటి ఉద్వేగానికే గుర‌య్యారు.

* గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అని పెట్ట‌డానికి కార‌ణం ఏంటండీ?
- తెలుగు పండితులు సిద్ధ స‌మాస‌మ‌ని, సాధ్య స‌మాస‌మ‌ని చాలా చెప్పారు. కానీ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు రాసిన ఆంధ్ర ప్ర‌శ‌స్తిలో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అనే ఉంది. దాన్ని బ‌ట్టే పెట్టాం.

* ఇంత త్వ‌ర‌గా తీయ‌డానికి ఎలా సాధ్య‌మైంది?
- తెలిసో తెలియ‌క‌నో ముందు డెడ్‌లైన్ పెట్టేసుకున్నాను. ఆ డెడ్‌లైన్‌కి త‌గ్గ‌ట్టు ప‌నిచేశాను. ఎక్కువ‌గా లైవ్‌లో చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. ఈ స‌ల‌హా నాకు రాజ‌మౌళిగారు ఇచ్చారు. అలాగే నిద్ర పోకుండా, పోనివ్వ‌కుండా ప‌నిచేశాను.\

* బ‌డ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని త‌గ్గించుకున్న ఖ‌ర్చులు ఉన్నాయా?
- చాలా ఉన్నాయండీ. శివ‌రాజ్‌కుమార్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన పాత్ర‌కోసం ఓ పాట తీయాల‌నుకున్నాం. అది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అందుకే వ‌దులుకున్నాం.

* శివ‌రాజ్‌కుమార్‌ను ఎందుకు తీసుకోవాల‌నిపించింది?
- ఆయ‌న్ని తీసుకోవాల‌న్న‌ది ఆ కేర‌క్ట‌ర్ డిమాండ్ చేసిన విష‌యం. ఆ కేర‌క్ట‌ర్‌ని బ‌ట్టే మేం ఆయ‌న్ని సెల‌క్ట్ చేశాం. అంతేగానీ కావాల‌ని ఏదో సెన్సేష‌న్ కోసం కాదు.

* త‌ల్లి పాత్ర‌కు హేమ‌మాలిని ఒప్పుకున్నారా?
- అస‌లు ఆమె న‌న్ను క‌ల‌వ‌డానికి కూడా ముందు అంగీక‌రించ‌లేదు. కానీ ఎలాగోలా స‌మ‌యాన్ని తీసుకుని వెళ్లి క‌థ‌ను చెప్పాను. దానికి ఆవిడ స్ఫూర్తి పొంది ర‌మ్మ‌న్నారు.

* మ‌న ద‌గ్గ‌ర క‌థే లేదు. స‌రైన విష‌యాలు లేవు. మ‌రి ఎలా ఈ క‌థ‌ను రాసుకున్నారు?
- త‌మిళంలో శాత‌క‌ర్ణి గురించిన వివ‌రాలున్నాయి. అలాగే మెకంజీ రాసిన కైఫీయ‌తుల్లో ఉన్నాయి. విదేశాల్లో ఉన్నాయి. మ‌హ‌రాష్ట్ర గెజెట్‌లో ఉన్నాయి. ఇలా ప‌లు చోట్ల దొరికిన విష‌యాల‌ను తీసుకుని సినిమాటిక్ లిబ‌ర్టీస్‌ను తీసుకుని చేశాం.

Krish interview gallery

* బాహుబ‌లితో పోల్చి చూస్తారనే భ‌యం లేదా?
- అస‌లు లేదండీ. ఎందుకంటే అది ఫాంట‌సీ ఫిల్మ్. ఇది హిస్టారిక‌ల్‌. అక్క‌డ నీటి కొండ మీద‌కు ఎక్క‌డాన్ని చూపించ‌వ‌చ్చు. కానీ ఇక్క‌డ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది చ‌రిత్ర‌. అందుకే నేను ఎక్కువ‌గా యానిమేష‌న్ జోలికి వెళ్లలేదు. ఎక్కువ‌గా నేను ఈ సినిమాను లైవ్‌గానే తీసే ప్ర‌య‌త్నం చేశాను. అందుకే త‌క్కువ రోజుల్లో పూర్తి చేయ‌గ‌లిగాను.

* బాల‌కృష్ణ 100వ సినిమా అనే టెన్ష‌న్ ఉందా?
- నాకు అలాంటిదేమీ లేదండీ. మంచి సినిమా చేస్తున్నామ‌నే భావ‌న ఉంది. తెలుగువారికి న‌చ్చేలా చెప్పాలనే ఫీలింగ్ ఉంది. ఇది తెలుగువారి క‌థ‌. దాన్ని నేను అర్థ‌వంతంగా చెప్పాల‌నే అనుకున్నాను.

* వరుస‌గా ఇదే నిర్మాత‌ల‌తో చేయడానికి కార‌ణ‌మేంటి?
- నా క‌థ‌ల‌ను వాళ్లు త‌ప్ప ఇంకెవ‌రూ తీయ‌రండీ (న‌వ్వుతూ)

* ఈ సినిమాను ఇతర భాష‌ల్లో తీసే ఉద్దేశం ఉందా?
- లేదండీ. స‌బ్‌టైటిల్స్ తో విడుద‌ల చేస్తే చాలు. అంద‌రికీ అర్థ‌మ‌య్యే క‌థ ఇది.

* ఇంత హెక్టిక్‌గా ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకున్నారు..
- జీవితం క‌డు `ర‌మ్య‌` ం. నా భార్య పేరు ర‌మ్య అండీ. అంత‌క‌న్నా ఏమీ అడ‌క్కండి.(న‌వ్వుతూ)

* బాల‌కృష్ణ‌గారితో ప‌నిచేయాలంటే భ‌య‌ప‌డ్డారా?
- లేదండీ. ఆయ‌న చాలా ఉత్సాహ‌వంతుడు. హైప‌ర్ యాక్టివ్ ప‌ర్స‌న్. ఆయ‌న గుర్రాన్ని స్వారీ చేసే విధానం చూసి మోరాకోలో గుర్రాల‌కు శిక్ష‌ణ ఇచ్చే వ్యక్తి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఇంత బాగా న‌డిపేవారిని ఇప్ప‌టిదాకా చూడ‌లేద‌ని అన్నారు. డూప్‌లతో చేయించ‌డానికి, రోప్ వ‌ర్క్ కు కూడా ఆయ‌న అస‌లు ఒప్పుకోలేదు. అంత వ‌ర్క్ ఓరియంటెడ్ ప‌ర్స‌న్ ఆయ‌న‌.

* ఈ సినిమాకు సీక్వెల్‌గా వాసిష్టీ పుత్ర పులోమావి ఉంటుందా?
- ఉండ‌వ‌చ్చు. ప‌రిస్థితులు అనుకూలిస్తే.

* పండుగకు రెండు పెద్ద సినిమాలు విడుద‌ల కావ‌డం ఎలా ఉంది?
- మ‌న చిన్న‌త‌నంలో నాలుగైదు సినిమాల‌ను ఒకేసారి చూసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంట‌ప్పుడు రెండు సినిమాల‌ను చూడ‌టం పెద్ద ఇది కాదు. అయినా మా సినిమా ముహూర్తం స‌మ‌యంలో చిరంజీవిగారు వ‌చ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మ బాస్ శుభాకాంక్ష‌లు చెప్పిన సినిమా బాగా ఆడాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకోవాలి. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాకు వ‌చ్చి అభినంద‌న‌లు చెప్పిన చిరంజీవిగారి సినిమా బాగా ఆడాల‌ని నంద‌మూరి అభిమానులూ కోరుకోవాలి. అప్పుడు హెల్దీ అట్మాస్పియ‌ర్ ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved