pizza
Kumar Nagendra interview about Tuntari
ఆద్యంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా `తుంట‌రి` - కుమార్ నాగేంద్ర‌
You are at idlebrain.com > news today >
Follow Us

07 March 2016
Hyderaba
d

`గుండెల్లో గోదారి`, `జోరు` సినిమాల ద‌ర్శ‌కుడు కుమార్ నాగేంద్ర‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మూడో సినిమా `తుంట‌రి`. నారా రోహిత్ హీరోగా న‌టించారు. త‌మిళ చిత్రం `మాన్‌క‌రాటే`కు రీమేక్ ఇది. ఈ సినిమా గురించి కుమార్ నాగేంద్ర సోమ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

* మీ గురించి చెప్పండి?
- ఖ‌డ్గం నుంచి రాఖీ వ‌ర‌కు కృష్ణ‌వంశీగారి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో చేశానండీ. సినిమా త‌ప్ప ఇంకేమీ ప‌ట్ట‌ని వ్య‌క్తిని నేను. నా తొలి సినిమా `గుండెల్లో గోదారి`. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్ప‌మ‌ని ల‌క్ష్మీ మంచుగారు ప్రోత్స‌హించారు. మా చాగ‌ల్లు వారు జోరు సినిమాను తీశారు. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశా. ఆ త‌ర్వాత నేను తెర‌కెక్కించిన మూడో సినిమా `తుంటరి`.

* మాన్ క‌రాటేను రీమేక్ చేయాల‌ని ఎందుకు అనిపించింది?
- నాకు ప్రియ‌ద‌ర్శ‌న్ కైండ్ ఆఫ్ కామెడీ ఇష్టం. ఓసారి చెన్నైలో మాన్ క‌రాటేను చూశాను. బాగా న‌చ్చింది. అక్క‌డ 55 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. మురుగ‌దాస్ క‌థ అందిస్తే, ఆయ‌న అసోసియేట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ఆ సినిమా రైట్స్ తీసుకుని కృష్ణ చైత‌న్య‌కు చెప్పాను. నారా రోహిత్‌కు కూడా ఈ క‌థ న‌చ్చింద‌ని కృష్ణ చైత‌న్య చెప్పడంతో వెళ్లి క‌లిశాను.

* స్క్రిప్ట్ లో చేంజ‌స్ చేశారా?
- ల‌వ్ ఏత్తుంగ (ప్రేమ డోస్‌) పెంచండి అని మురుగ‌దాస్‌గారే స్వ‌యంగా చెప్పారు, సో ఇక్క‌డ ల‌వ్ డోస్ పెంచాం. క్లైమాక్స్ నిడివిని త‌గ్గించాం. త‌మిళంలో ఈ సినిమా రెండున్న‌ర గంట‌లుంటుంది. తెలుగులో మాత్రం రెండుగంట‌లా రెండు నిమిషాలు మాత్ర‌మే ఉంటుంది.

* ఫాంట‌సీ సినిమానా?
- కాస్త ఫాంట‌సీ అంశాలు కూడా ఉంటాయండి. ఓ పేప‌ర్ చుట్టూ క‌థ తిరుగుతుంది. నారా రోహిత్ బాక్స‌ర్‌గా క‌నిపిస్తారు.

Kumar Nagendra interview gallery

* రీమేక్ బావుందా? స్ట్రెయిట్ సినిమాలు చేయ‌డం బావుందా?
- నాకు స్ట్రెయిటే ఇష్ట‌మండీ. రీమేక్ సినిమా అంటే ఆఫీసు బాయి నుంచి అంద‌రికీ నేను తీయ‌బోయే సీన్ తెలిసి ఉంటుంది. కాబ‌ట్టి పెద్ద‌గా కిక్ అనిపించ‌దు.

* త‌మిళ హీరోకి ఉన్న ఇమేజ్ వేరు. నారా రోహిత్ ఇమేజ్ వేరు. మ‌రి తెలుగులోకి ఎలా అడాప్ట్ చేశారు?
- ఈ సినిమాలో క‌థ కీల‌కం. క‌థ‌ను తెలుగుకు త‌గ్గ‌ట్టు ఉండేలా చూసుకున్నాం.

* జోరు సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణాలు మీరేం చెప్తారు?
- ఆ సినిమా విష‌యంలో నాపై బ‌డ్జెట్ ప్రెజ‌ర్ ఉంది. భారీ కాస్టింగ్‌ను తీసుకున్నాను. అనుకున్న బ‌డ్జెట్‌లో పూర్తి చేయాల‌నే ప్రెజ‌ర్‌తో అలా తీశానేమోన‌ని అనిపించింది.

* మీ మీద ఏ ద‌ర్శ‌కుల ప్రభావం ఉంటుంది?
- ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్టైల్‌లో ఉంటుంది. కాబ‌ట్టి ప‌ర్టిక్యుల‌ర్‌గా ఎవ‌రి ప్ర‌భావ‌మూ ఉండ‌దు. కానీ తెలుగు సినిమాను ఇంకో లెవల్‌కి తీసుకెళ్లే సినిమాల‌ను చేయాల‌ని ఉంది.

* మీ తదుప‌రి సినిమాలేంటి?
- ఇంకా ఏమీ అనుకోలేదండీ. ప్ర‌స్తుతం దృష్టి మొత్తం ఈ సినిమా మీదే ఉంది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved