pizza
Lavanya Tripathi interview (Telugu) about Vunnadi Okate Zindagi
అలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య తీర‌ద‌ని అనుకుంటున్నాను - లావ‌ణ్య త్రిపాఠి

You are at idlebrain.com > news today >
Follow Us

22 October 2017
Hyderabad

 

రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరోయిన్స్‌లో ఒక‌రైన

లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ ...``నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాంటి క్యారెక్ట‌ర్‌ను `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` చిత్రంలో పోషించాను. అంద‌మైన‌, అమాయ‌కంగా క‌న‌ప‌డే పాత్ర‌. ఓ లక్ష్యంతో సాగే పాత్ర‌. నా పాత్ర పేరు మ్యాగీ. ల‌క్ష్యం అందుకోవ‌డం కోసం చిన్న చిన్న త‌ప్పులు కూడా చేసే రోల్‌లో క‌న‌ప‌డ‌తాను. ఇందులో ప్రేమ‌, స్నేహం అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక ల‌వ్‌స్టోరీ విష‌యానికి వ‌స్తే..ఈ జ‌న‌రేష‌న్ ల‌వ్‌స్టోరీ. ఇప్ప‌టి య‌వ‌తీ యువ‌కుల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? వారి జ‌ర్నీ ఎలా సాగుతుంద‌నేదే క‌థ‌. అనుపమ పాత్ర‌కు, నా పాత్ర‌కు స‌మాన ప్రాధాన్య‌త ఉంటుంది. అయితే నాకు, అనుమ‌ప‌మ‌కు మ‌ధ్య కాంబినేష‌న్ సీన్స్ ఉంటాయా? లేవా? అని తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. రెండు పాత్ర‌ల మ‌ధ్య కాంపిటీష‌న్ ఉండాలి..ఉంటుంద‌ని నేను భావించ‌ను. ఎందుకంటే, ఓ సినిమా మేకింగ్ అంటే టీం ఎఫ‌ర్ట్‌. అంతే కాకుండా నాకు అనుప‌మ అంటే చాలా ఇష్టం. ఆమె న‌టించిన `అఆ` సినిమా చూసి ఆమెకు పెద్ద ఫ్యాన్‌గా మారాను. సాధార‌ణంగా హీరోయిన్స్‌కు డేట్స్ అడ్జ‌స్ట్‌మెంట్ స‌మ‌స్య‌లున్న‌ప్పుడు అన్నీ సినిమాల్లో న‌టించ‌లేరు. కొన్ని సినిమాల్లో నుండి త‌ప్పుకుంటూ ఉంటారు. అలాంటి అనుభ‌వం నాకు ఎదురైంది. అలా మ‌రో హీరోయిన్ స్థానంలో నేను ఈ సినిమా చేస్తున్నాను. అయితే రీప్లేస్‌మెంట్‌కు గ‌ల కార‌ణాలేంట‌నేది నాకు తెలియ‌దు. అయితే ఇలాంటి మంచి పాత్ర వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్దు. అందివ‌చ్చిన ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించాల‌నేదే ఈ సినిమా. ఇప్పుడు హాలీవుడ్‌లో `మీ టూ` అని మ‌హిళ‌లు త‌మ‌కు లైంగిక స‌మ‌స్య‌లు ఎదురైయ్యాయ‌ని చెబుతున్నారు. కానీ అస‌లేం జ‌రిగింద‌నేది నాకు తెలియ‌డం లేదు కానీ..అలా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని నేను అనుకోవ‌డం లేదు. నేను రామ్‌కు పెద్ద ఫ్యాన్‌ని. చాలా మంచి ప‌ర్స‌న్‌. చాలా మంచి యాక్ట‌ర్‌. సామాజిక సేవ కార్య‌క్ర‌మాలు చేస్తుంటాను. కానీ అవి చెప్పుకోవ‌డం నాకు ఇష్టం లేదు. అయితే ఓ బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని అనుకుంటున్నాను.గీతాఆర్ట్స్ నా స్వంత బ్యాన‌ర్‌లాంటిది. డేట్స్ స‌మ‌స్య కార‌ణంగానే ఆ బ్యాన‌ర్‌లో ప్ర‌స్తుతం సినిమా చేయ‌లేకపోయాను త‌ప్ప మ‌రే కార‌ణాలేం లేవు`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved