pizza
Madhura Sreedhar interview about Oka Manasu
ఈ ఏడాది చివర్లో డైరెక్షన్ చేస్తాను – మధురశ్రీధర్ రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

27 June 2016
Hyderaba
d

మెగాస్టార్‌ చిరంజీవి నట వారసులుగా హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే తొలిసారి మెగా వారసురాలిగామెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక'ఒక మనసుచిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. నాగశౌర్యనిహారిక జంటగా టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రామరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం'ఒక మనసు'. జూన్‌ 24న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన మధురశ్రీధర్ రెడ్డి సినిమా గురించి సంగతులను తెలియజేశారు...

గట్స్‌ తో సినిమా చేశాను...
-ఇలాంటి యాంటీ క్లైమాక్స్ ఉన్న సినిమాలు చేయాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు యాంటీ క్లైమాక్స్ న‌చ్చ‌ద‌ని అంటారుకానీ యాంటీ క్లైమాక్స్ ఉన్న త‌మిళ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అంటే ప్రేక్ష‌కులు సిద్ధంగానే ఉన్నారు. మ‌న నిర్మాత‌లే ధైర్యం చేయ‌డం లేదు. అందుక‌నే నిర్మాత‌గా యాంటి క్లైమాక్స్‌ తో సినిమా చేస్తే బావుంటుంద‌నిప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని భావించి గ‌ట్స్‌ తో ఒక‌మ‌న‌సు సినిమా చేశాను.

మెగాఫ్యామిలీకి న‌చ్చింది...
- నిహారిక హీరోయిన్‌గా  అన‌గానే మెగాఫ్యామిలీ నుండి వ‌స్తున్న అమ్మాయి కాబట్టి ఆమెను చ‌క్క‌గా చూపించాల‌నుకున్నాం. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల‌ను నిరాశ ప‌ర‌చకూడ‌ద‌ని అనుకున్నాం. సినిమాను ప్యూర్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కించాం. చివ‌రి అర‌గంట సినిమా మెగాఫ్యామిలీకి బాగా న‌చ్చింది.

పోల్చడం తప్పు కాదుగా...
- మ‌నం ఎప్పుడూ ఏ ప‌నిచేసినా బాగా చేయాల‌నుకుంటాం. మ‌న కంటే బాగా చేసిన వారిని బీట్ చేయాల‌నుకుంటాం. త‌ప్పు లేదు. ఈ సినిమా క‌థ విన్న‌ప్పుడు మ‌రో చ‌రిత్ర‌గీతాంజ‌లి సినిమాలు గుర్తుకు వ‌చ్చాయి. అలాంటి సినిమా చేసే ప్ర‌య‌త్నం చేశామ‌ని చెప్పాం. అలా ఆ స్థాయిలో పోల్చుకోవ‌డం త‌ప్పుకాదు.

మిక్స్‌ డ్ రెస్పాన్స్‌...
- సినిమా కొంద‌రికి న‌చ్చితే మ‌రికొందరు స్లోగా ఉంద‌ని అన్నారు. మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాను అంద‌రం బాగా ప్రేమిండంతో సినిమాలో త‌ప్పులు తెలియ‌లేదు. కానీ ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక ప‌స్టాఫ్‌లో 14 నిమిషాల పాటు ట్రిమ్ చేశాం. అది కాకుండా సినిమా విడుద‌ల‌కు ముందు మూడు రోజుల వ‌ర‌కు సినిమా వ‌ర్క్ జ‌రుగుతూనే ఉంది. ఫైన‌ల కాపీ రాలేదు. వ‌చ్చిన త‌ర్వాత ఓవ‌ర్‌సీస్‌కు పంప‌డం ఇలా మా ప‌నుల‌తో స‌రిపోయింది. దాంతో సినిమా ఇప్ప‌టికీ మేం చూసుకోలేదు. 

స‌మ‌స్య గురించి చెప్పామంతే...
- మ‌న‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి కుల రాజకీయాలున్నాయి. మేం ఎక్క‌డా స‌పోర్ట్ చేసినట్లు చూప‌లేదు. స‌మ‌స్య‌ను ఎత్తిచూపామంతే.

ఇద్ద‌రూ ఒదిగిపోయారు...
-నాగ‌శౌర్య‌నిహారిక‌లు సూర్య‌సంధ్య పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. తెర‌పై వీరి కాంబినేష‌న్ చ‌క్క‌గా అనిపించింది.

.డైరెక్ష‌న్ చేస్తాను... నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌...
-బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ప‌లితంతో కాస్తా భ‌య‌ప‌డ్డ మాట వాస్త‌వ‌మే. త‌ర్వాత నిర్మాత‌గా బిజీ అయ్యాను. న‌న్ను ఎగ్జ‌యిట్ చేసే పాయింట్స్ రాలేదు. దాంతో ద‌ర్శ‌క‌త్వం చేయ‌లేదు. విక్కి డోన‌ర్‌ను రీమేక్ చేయాల‌నుకున్నాను. సాధార‌ణంగా నార్మ‌ల్ సినిమాల్లో త‌ప్పులు చేస్తేనే విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటిది స‌క్సెస్ అయిన చిత్రాన్ని రీమేక్ చేసిన ప్పుడు విమ‌ర్శ ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. దాంతో భ‌య‌ప‌డి చేయ‌లేదు. అలాగే  శ్రీశాంత్ హీరోగా బెట్టింగ్‌పై ఓ సినిమా చేద్దామ‌నుకున్నాను. అయితే క్లైమాక్స్ నేను రియ‌ల్‌గా ఉండాలంటేశ్రీశాంత్ సినిమాటిక్‌గా ఉండాల‌ని అన్నారు. దాంతో ఆ విష‌యంలో సినిమా ఆగిపోయింది. అయితే ఈ ఏడాది చివ‌ర‌లో నా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాను.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved