pizza
Malavika Nair interview (Telugu) about Vijetha
ప‌క్కింటి అమ్మాయిగా మెప్పిస్తాను - మాళ‌వికా నాయ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

7 July 2018
Hyderabad

కళ్యాణ్‌ దేవ్‌ కథానాయకుడిగా రాకేష్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్ర‌పాటి నిర్మాణ సార‌థ్యంలో వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందుతోన్న‌ చిత్రం 'విజేత'. రజని కొర్రపాటి నిర్మాత. ఈ సినిమా జూలై 12న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ సినిమా గురించి చెప్పిన విశేషాలు..

పాత్ర గురించి......
- ప‌క్కింటి అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. ఓ ఆఫీస్‌లో ప‌నిచేసుకుంటూ ఆత్మ విశ్వాసంతో ఉండే మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి పాత్ర నాది. అయితే హీరో క్యారెక్ట‌ర్ నాకు భిన్నంగా ఉంటుంది. త‌నకు కెరీర్ అంటే పెద్ద సీరియ‌స్‌నెస్ ఉండ‌దు. ఉద్యోగం ఉండ‌దు. ఖాళీగా ఉంటాడు. నేను ఇంత‌కు ముందు చేసిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రాల‌కు, దీనికి తేడా ఉంది. క్యారెక్ట‌ర్స్ విష‌యంలో చూసీగానే ఉంటున్నాను. నా వ‌ల్ల సినిమాకు ప్ల‌స్ కావాల‌నేదే నా ఆలోచ‌న‌.

అందుకే ఒప్పుకున్నాను...
-`మ‌హాన‌టి`లో న‌టించ‌డానికి కార‌ణం.. సావిత్రిగారి బ‌యోపిక్‌లో ఓ భాగం కావ‌డాన్ని ఇష్ట‌ప‌డ్డాను. అలాగే ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌గారితో ఇంత‌కు ముందు ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రానికి ప‌నిచేశాను.

interview gallery



క‌ల్యాణ్ దేవ్ గురించి...
- చాలా సింపుల్‌గా ఉంటారు. బాగా మాట్లాడుతారు. హార్డ్‌వర్క్ చేస్తారు. చాలా ఫోక‌స్డ్‌గా ప‌నిచేశారు.

క‌థ గురించి..
- ఇది తండ్రి కొడుల మ‌ధ్య వ‌చ్చే సంఘ‌ర్ష‌ణ గురించి చెప్పే చిత్రం. కాబ‌ట్టి అందరూ ఈ సినిమాకు క‌నెక్ట్ అవుతారు.

త‌దుప‌రి చిత్రాలు...
- `టాక్సీవాలా` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఓ త‌మిళ సినిమా చేస్తున్నాను.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved