pizza
Manali Rathod about Fashion Designer s/o Ladies Tailor
వంశీగారి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం అదృష్టం - మ‌నాలి రాథోడ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 May 2017
Hyderabad

?

సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించిన చిత్రం `ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్`. సీనియ‌ర్ వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మాత‌. జూన్ 2న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్స్‌లో ఒక‌రైన మ‌నాలి రాథోడ్ పాత్రికేయుల‌తో మాట్లాడారు..

మ‌నాలి రాథోడ్ మాట్లాడుతూ - ``ఫ్యాష‌న్ డిజైన‌ర్ నేను న‌టించిన నాలుగో చిత్రం అనీషా అంబ్రోస్‌, మాన‌స‌ల‌తో క‌ల‌సి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమాలో అమాయ‌క‌మైన అమ్ములు అనే అమాయ‌క‌మైన అమ్మాయి పాత్ర‌లో న‌టించాను. ఫ్యాష‌న్ డిజైన‌ర్లో ప‌ల్లెటూరు అమ్మాయి త‌ర‌హాలో చీర‌క‌ట్టులోనే క‌న‌ప‌డ‌తాను. వంశీగారు హీరోయిన్స్‌ను చ‌క్క‌గా ప్రెజెంట్ చేస్తారు. సాధార‌ణంగా ఆయ‌న సినిమాల్లో హీరోయిన్స్‌కు న‌ట‌న ప‌రంగా మంచి స్కోప్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా నా పాత్ర‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్ర‌కు వంశీగారు నన్ను సెల‌క్ట్ చేస్తార‌ని అనుకోలేదు. అదృష్ట‌వ‌శాతు నన్ను అమ్ములు పాత్ర‌కు ఎంపిక చేశారు. నా క్యారెక్ట‌ర్ వ‌ల్ల సినిమాలో చాలా ట‌ర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. కంప్లీట్ సినిమాను ఛేంజ్ చేసే క్యారెక్ట‌ర్ చేశాను. ఐదు సాంగ్స్‌లో ఒక పాట ఉంది. ఆ పాట‌లోనే గ్లామర్‌గా క‌న‌ప‌డ‌తాను. సినిమాలో చీర‌క‌ట్టులోనే క‌న‌ప‌డ‌తాను.

Manali Rathod interview gallery

సుమంత్ అశ్విన్ విష‌యానికి వ‌స్తే, మంచి కోస్టార్‌. హార్డ్ వ‌ర్క‌ర్‌. లేడీస్ టైల‌ర్ సినిమాలో లో మ‌చ్చ కాన్సెప్ట్ ఉంటే, సుమంత్‌కు ఈ సినిమాలో మ‌న్మ‌థ రేఖ ఉంటుంది. ఇంత‌కు ముందు నేను చేసిన సినిమాల్లోని పాత్ర‌ల‌కు, ఈసినిమాలో నా పాత్ర‌కు చాలా తేడా ఉంది. ఓ స్టూడెంట్‌లా భావించి సినిమా చేశాను. సెట్స్‌లో వంశీగారు చాలా కూల్‌గా ప‌ని చేసుకుంటూ వెళుతుంటారు. చాలా విష‌యాలు నేర్చుకున్నాను. మ‌ధుర శ్రీధ‌ర్‌గారు మంచి నిర్మాత‌. ఆయ‌న సెట్స్‌లో అంద‌రికీ రెస్పెక్ట్ ఇస్తారు. ఆయ‌న‌తో ఉంటే పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. అంద‌రికీ ఏం కావాలో దాన్ని స‌మ‌కూర్చారు. నెక్స్‌ట్ హౌరా బ్రిడ్జ్‌లో న‌టించాను. ఓ సాంగ్ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌య్యింది`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved