pizza
ఇప్పటి యువతరం యాట్యిట్యూడ్ ను తెలియజేసే చిత్రం ‘ఓకే బంగారం’
- మణిరత్నం
You are at idlebrain.com > news today >
Follow Us

16 April 2015
Hyderabad

మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన చిత్రం ‘కాదల్ కన్మణి’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మద్రాస్ టాకీస్ తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో ఈ నెల 17న విడుదల చేశారు. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తో ఇంటర్వ్యూ....

మీ సినిమాలు ఎక్కువగా ముంబాయి నేపథ్యంలో తెరకెక్కడానికి రీజన్ ఏంటి?
-ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్ సిటీ, చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. నేను అక్కడ కొంతకాలం చదుకుకున్నాను. మన అధునికతను ప్రతిబింబించే నగరమది. ఓకే బంగారం వంటి సినిమాని ముంబాయి నేపథ్యంలో చెబితే ప్రేక్షకులకు అర్థమవుతుందని అనుకున్నాను.

ఇలాంటి కథను చెప్పాలనుకున్నప్పుడు ఏమైనా రీసెర్చ్ చేశారా?
-మన లైఫ్ లో ప్రతి విషయంలోనూ రీసెర్చ్ జరుగుతుంటుంది. మనకు గమనించే అంశాలే రీసెర్చ్. ఇలాంటి ఎమోషనల్ స్టోరిని చెప్పాలనుకున్నప్పుడు మనం లైఫ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది. ఆ పాత్రను ఫీల్ కావాల్సి ఉంటుంది.

లివింగ్ రిలేషన్ పై సినిమా తీయడం వల్ల ఏ ప్రభావం ఉండదంటారా?
-ఈ సినిమా లివింగ్ రిలేషన్ కి మాత్రమే పరిమితం కాదు. ప్రతి మనిషిలో యాట్యిట్యూడ్ ను తెలియజేస్తుంది. ఇప్పటి యువత ఉన్న ఆలోచనల్లో ఈ విషయంపై ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది.

మమ్ముట్టితో సినిమాలు చేశారు, ఇప్పుడు దుల్కర్ తో సినిమా తీశారు. ఇద్దరి మధ్య గమనించిన తేడా?
-ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. మమ్ముట్టి వంటి తనయుడుగా దుల్కర్ పెరిగినప్పటికీ ఆయన ప్రభావం తనపై పడకుండా దుల్కర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. తనకంటూ తన ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు.

ఈ చిత్రంలో ఏదైనా మేసేజ్ ఉంటుందా?
-ఇప్పటి యువతరం యాట్యిట్యూడ్, ఆలోచనలను తెలియజెప్పే కథ. అలాగే పెద్దవారి మనస్తత్వాలను కూడా ప్రెజెంట్ చేస్తుంది. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సినిమా చూస్తే తెలుస్తుంది.

ఎ.ఆర్.రెహమాన్

మణిరత్నంగారి చిత్రంతోనే మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు..?
-నేను నా ఫ్యామిలీ కోసం ఓ సాంగ్ చేశాను. ఆ సాంగ్ విన్న మణిగారు ఆ సాంగ్ ను నేను వాడుకుంటానని అన్నారు. ఆ పాటను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజానికి మా అబ్బాయితో మ్యూజిక్ అల్బమ్ చేయించాలనుకున్నా అయితే మణిగారి చిత్రం ద్వారా పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది.

మణిరత్నంగారితో రెండు దశాబ్దాలు పనిచేయడం ఎలా కుదిరింది?
-మణిరత్నంగారికి యూనిక్ మ్యూజిక్ ను సెలక్ట్ చేసుకుంటారు. ఆయనకి హిట్స్, ప్లాప్ల్స్ తో సంబంధం లేదు. మంచి సినిమా తీయాలనేదే ఆయన ఆలోచన. ఆదే ఆయన గొప్పతనం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved