pizza
Manchu Manoj interview about Shourya
ఎనిమిది కిలోలు పెరిగాను - మ‌నోజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

03 March 2016
Hyderaba
d

మంచు మ‌నోజ్ న‌టించిన సినిమా శౌర్య‌. శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్కాపురం శివ‌కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రెజీనా నాయిక‌గా న‌టించింది. ఈ సినిమా గురించి మ‌నోజ్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- శౌర్య అనే పాత్ర చేశాను. సాఫ్ట్ లుకింగ్ ప‌ర్స‌నాలిటీ నాది. ఇందులో ఫైట్లు ఉండ‌వు. చాలా కొత్త‌గా క‌నిపిస్తాను. ప్ర‌తి ఒక్క‌రిలో మంచీ చెడు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని చేసిన క‌థ ఇది. థ్రిల్ల‌ర్ జోన‌ర్ ఇది. కామెడీ ఉంటుంది. కానీ నేను చేయ‌ను.

* కాన్సెప్ట్ ఏంటి?
- ప్ర‌తి విష‌యానికీ మూడు కోణాలుంటాయి.ఈ సినిమా కూడా అలాంటిదే. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. ఈ పాత్ర కోసం 8 కిలోలు వెయిట్ పెరిగాను.

* డైర‌క్ట‌ర్ గురించి చెప్పండి?
- ద‌శ‌ర‌థ్‌గారిని మా బ్యాచ్ అంతా గురు అని పిలుస్తాం. శ్రీ సినిమా చేసేట‌ప్పుడు మా ఇద్ద‌రికీ పెళ్ళి కాలేదు. ఇప్పుడు ఇద్ద‌రం జీవితాల్లో సెటిల్ అయ్యాం. శౌర్య పాత్ర నిజంగా ఉంటే అది ద‌శ‌ర‌థ్‌గారిలాగా ఉంటుంది. ఎలాంటి ఎమోష‌న్స్ అయినా లోప‌లే ఉంచుకుని పైకి ఇంకోలా ఉండ‌గ‌ల‌గ‌డం ఈ పాత్ర నైజం. చాలా సెటిల్డ్ గా ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేశాను. ద‌శ‌ర‌థ్‌గారు పాత్ర‌ను చాలా బాగా నెరేట్ చేశారు.

* హైలైట్స్ ఏంటి?
- నేత్ర పాత్రలో రెజీనా చాలా బాగా చేసింది. వేదా చేసిన ట్యూన్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. రీరికార్డింగ్ కూడా బావుంద‌ని అంటారు. మ‌ల్కాపురం శివ‌కుమార్ బాగా తెర‌కెక్కించారు.

Manchu Manoj interview gallery

 

* సినిమా చూసి ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏమ‌న్నారు?
- నాన్న‌గారికి న‌న్ను ఈ త‌ర‌హా పాత్ర‌లో చూడాల‌న్న‌ది ఎప్ప‌టి నుంచో కోరిక‌. ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీల‌య్యారు.

* మీ ఆవిడ మీ సినిమాల ఎంపిక‌లో జోక్యం చేసుకుంటారా?
- లేదండీ. మా ఇద్దరికీ ఐదేళ్ళ ప‌రిచ‌యం. ఇన్నేళ్ళ‌లో ఎప్పుడూ త‌న జోక్యం లేదు. ఇప్పుడూ లేదు.

* స‌న్నాఫ్ పెద‌రాయుడు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది?
- ఆ సినిమా పేరు అది కాదండీ. ఏప్రిల్‌లో మాత్రం ఓ సినిమాను ప్రారంభిస్తాం.

* పెదరాయుడు సినిమా డిజిట‌ల్‌లో విడుద‌ల చేస్తార‌ట క‌దా?
- అవునండీ. అన్న‌య్య‌ ఆ ప‌నులు చూస్తున్నారు.

* మీ ఎటాక్ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది?
- ఈ సినిమా త‌ర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం.

* ఈ మ‌ధ్య కాస్ట్ గురించి మాట్లాడారు ఎందుకు?
- ఎన్నో కుల‌స్తుల వాళ్ళు ప‌నిచేస్తేనే సినిమా అవుతుంది. అలాంట‌ప్పుడు కేస్ట్ ల గురించి మాట్లాడుకోవ‌డం ఎందుకు? అందుకే కేస్ట్ లకు, పైర‌సీకి, డ్ర‌గ్స్ కి దూరంగా ఉండ‌మ‌ని యూత్‌కి చెబుతున్నా. క‌ళాకారులు ఏ కేస్ట్ వారిని ఉద్దేశించి సినిమాలు చేయ‌రు. మాకు అంద‌రూ కావాలి.

* సినిమాల జ‌యాప‌జ‌యాల‌ను గురించి ఆలోచిస్తారా?
- నేను సినిమా కుటుంబంలో పుట్టిపెరిగాను కాబ‌ట్టి నాకు జ‌యాప‌జ‌యాల తాలూకు ప్ర‌భావం అంత‌గా మ‌న‌సుపై ప‌డ‌దు. ఇవ‌న్నీ నేను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూనే ఉన్నాను కాబ‌ట్టి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved