pizza
Merlapaka Gandhi interview about Express Raja
You are at idlebrain.com > news today >
Follow Us

10 January 2016
Hyderabad

 

కంటెంట్ మీద న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ముందుకొస్తున్నారు.

- మేర్ల‌పాక గాంధీ

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. ఆ సినిమాతో విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన తాజా సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. శ‌ర్వానంద్ హీరోగా రూపొందిన సినిమా ఇది. ఈ నెల 14న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మేర్లపాక గాంధీ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..
* ఎక్స్ ప్రెస్ రాజా టైటిల్ గురించి చెప్పండి?
- ఎక్స్ ప్రెస్ రాజా సౌండ్ బావుంద‌ని పెట్టాం. ఈ టైటిల్ కూడా క్యాచీగా ఉంది. సినిమాలో హీరో పాత్ర కూడా అలాగే ఉంటుంది. వెరీ స్పీడ్ చిత్ర‌మిది. హీరో ఐడియాస్‌గానీ, త‌ను వ‌ర్క్ చేసే విధానంగానీ స్పీడ్‌గా ఉంటుంది. రేసీగా ఉండ‌టం వ‌ల్ల ఎక్స్ ప్రెస్ రాజా అని పెట్టాల‌నుకున్నాం.
* ఎక్స్ ప్రెస్ రాజా క‌థ ఎలా ఉంటుంది?
- ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో పోసాని పోలీస్ ఆఫీస‌ర్‌. వైజాగ్ మొత్తం మీద ప‌నీ పాటా లేనివాళ్ళ గురించి స‌ర్వే చేస్తే మొద‌టిది హీరో పేరు వ‌స్తుంది. రెండోది ప్ర‌భాస్ శీను పేరు వ‌స్తుంది. అదెట్రా నువ్వు నెంబ‌ర్ వ‌న్ వ‌స్తావు నేను క‌దా రావాల్సింది అని వారిద్ద‌రు కొట్టుకుంటారు పోలీస్ స్టేష‌న్‌లో. స‌ర‌దాగా సాగే సినిమా. ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. ఎవ్రీ 15- 20 మినిట్స్ కి ఓ ట్విస్ట్ వ‌స్తూ ఉంటుంది. పావు గంట‌కి ఓ కొత్త కేర‌క్ట‌ర్ ఎంట‌ర్ అవుతుంటుంది. ఆ పాత్ర‌కీ హీరో పాత్ర‌కీ లింక్ ఉంటూనే ఉంటుంది. అదేంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం.
* సంక్రాంతికి పెద్ద సినిమాల మ‌ధ్య విడుద‌ల చేయ‌డానికి కార‌ణం ఏంటి?
- బేసిగ్గా కంటెంట్ ఉంద‌ని అనుకున్నాం. సంక్రాంతికి అన్నీ సినిమాలు ఆడుతాయి క‌దా. చూద్దాం. నిర్మాత‌లు కాన్పిడెన్ట్ గా ఉన్నారు. రిలీజ్ చేద్దామ‌న్నారు. స‌రేన‌నుకున్నాం.
* సుర‌భిని మీరే సెల‌క్ట్ చేశారా?
- సుర‌భి నా సెల‌క్ష‌న్‌. సినిమాను ప్ర‌భాస్ చూశారు. చ‌ర‌ణ్‌ గారు సాంగ్స్ చూశారు. చాలా ఎంజాయ్ చేశారు.
* ఈ సినిమా హైలైట్స్ ఏంటి?
- బేసిగ్గా ల‌వ్ స్టోరీ. ఫ‌న్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. స‌ప్త‌గిరితో పాటు అంద‌రి పాత్ర‌లూ కొత్త‌గా ఉంటాయి. స‌ప్త‌గిరి, సుప్రీత్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ష‌క‌ల‌క శంక‌ర్ వంటి పాత్ర‌ల‌న్నీ క‌థ‌కు ఎలా ఇంట‌ర్ లింక్డ్ అనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్లు విడిపోవ‌డానికి కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ఏం చేశార‌నేది ఆస‌క్తిక‌రం. వేంటేజ్ పాయింట్ మూవీ ఉంది క‌దా. దాని కైండ్ ఆఫ్ స్క్రీన్‌ప్లేతో ఉంటుంది సినిమా.
* శ‌ర్వానంద్ కోసం క‌థ రాశారా? క‌థ కోసం శ‌ర్వానంద్ ని సంప్ర‌దించారా?
- ఫ‌స్ట్ క‌థ అనుకున్నాం. ఆ త‌ర్వాత ర‌న్ రాజా ర‌న్ చూశా. ఆ సినిమాలో ఎప్పుడూ చూడ‌ని శ‌ర్వానంద్‌గారు క‌నిపించారు. చాలా ఫ్రెష్‌గా క‌నిపించారు. నా పాత్ర‌కు సూట్ అవుతార‌ని అనుకున్నా. వెళ్లి క‌థ చెప్పా. న‌చ్చింద‌న్నారు. సినిమా చేసేశాం.
* వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ ఇష్ట‌మా? ఈ సినిమానా?
- నాకు వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ క‌న్నా ఈ సినిమా చాలా ఇష్టం. మోర్ ఫ‌న్ ఉంటుంది. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌ని చూసుకున్న‌ప్పుడు ఇంకా చేయొచ్చేమో అని అనిపించింది. అదంతా ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాను చేశాను.
* యువీ క్రియేష‌న్స్ గురించి చెప్పండి?
- బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌. యువీ క్రియేష‌న్స్ లో ఎవ‌రు ప‌నిచేసినా వాళ్లు ఈ సంస్థ‌తో ల‌వ్ లో ప‌డిపోతారు. వాళ్లికిది మాతృసంస్థ అయిపోతుందండీ. మ‌న‌ల్ని చూసుకునే విదానంగానీ, వారు సినిమాను ప్రేమించే విధానంగానీ, సినిమా బాగా రావాల‌ని ప‌డే తాప‌త్ర‌యంగానీ ఏదైనా స‌మ్‌థింగ్ చాలా బావుంటుంది. సో నాకు మంచి ఎక్స్ పీరియ‌న్స్ ఈ సంస్థ‌లో చేయ‌డం. నా త‌ర్వాతి సినిమా కూడా యువీ క్రియేష‌న్స్ లోనే చేస్తాను మోస్ట్లీ.
* రెండో సినిమా అనే భ‌యం ఉందా?
- ఉందండీ. అందుకే ఏది చేసినా మంచి సినిమా చేయాలి. హిట్ చేయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమా చేయ‌డానికి రెండేళ్లు ప‌ట్టింది. స్క్రిప్ట్ మీద ఒన్ ఇయ‌ర్ వ‌ర్క్ చేశాను. క‌థ‌ను మూడు నెల‌లో ఫినిష్ చేస్తా.
* శ‌ర్వానంద్ కొత్త‌గా క‌నిపిస్తున్న‌ట్టున్నారు?
- శ‌ర్వానంద్ చాలా మంచి ఆర్టిస్ట్ బేసిగ్గా. ఈ సినిమాలో అత‌ని పాత్రని కొత్త త‌ర‌హాలో ట్రై చేశాం. స‌మ్‌థింగ్ వెరీ క‌మ‌ర్షియ‌ల్‌. ఫైట్సు, పాట‌లు అన్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటాయి. ఎన్ని టేకులు అడిగినా చేసేవాడు. చాలా హ్యాపీగా అనిపించింది. క‌మ‌ర్షియ‌ల్ కైండ్‌లో డైలాగులు అన్నీ ట్రై చేశాం. ఇందులో సుర‌భి పాత్ర పేరు అమూల్య. మోసం అంటే భ‌రించ‌లేని కేర‌క్ట‌ర్‌. కాలేజీ స్టూడెంట్‌. హీరోయిన్‌కి ఫైట్ ఉంటుంది.మోసం చేస్తే చంపేయాల‌నుకునే టైప్‌.
* మీరే కెమెరామేన్ క‌దా. కార్తిక్ గురించి చెప్పండి?
- బేసిగ్గా సినిమా బాగా రావాల‌ని అనుకున్నా. కార్తిక్ కొత్త‌గా చేశాడు. లొకేష‌న్లుగానీ, త‌ను వాడిన లైట్ పేట‌ర్న్ గానీ, బ్యాక్ గ్రౌండ్ పాప‌ర్టీ అన్నీ సూప‌ర్బ్, సినిమాను 52 రోజుల్లో పూర్తి చేశాం. చాలా మంది ఆర్టిస్టుల‌ను పెట్టుకుని చాలా త్వ‌ర‌గా చేశాం. ఊర్వ‌శిగారు విల‌న్‌. ఆవిడ‌లో డిఫ‌రెంట్ ఫ‌న్ షేడ్ ఉంటుంది. ఇందులో స్ఫూఫ్ లేదు. ఇందులో ధ‌న‌ల‌క్ష్మి డ్యాన్స్ ట్రూప్ ఉంటుంది. అందులో ఆర్టిస్టులు నాగేశ్వ‌ర‌రావుగారు, ఎన్టీఆర్‌గారు, చిరంజీవిగారిలాగా చేస్తారు కానీ అంత‌కు మించి ఏవీ లేవు. నెల్లూరు, కావ‌లి, ఒంగోలు ప‌రిస‌రాల్లో జ‌రుగుతుంది సినిమా. నా సినిమాలన్నీ చాలా వ‌ర‌కు ఔట్‌డోర్‌లోనే జ‌రుగుతాయి.
* మీ నాన్న‌గారితో ఎలా ఉంటారు?
- నాన్న‌గారు పెద్ద రైట‌ర్‌. ఆయ‌న నాకు చాలా క‌థ‌లు చెబుతుంటారు. మా నాన్న రొమాంటిక్‌. నేను కొద్దిగా ఎంట‌ర్‌టైన‌ర్‌. న‌న్ను కూడా రొమాంటిగ్గా రాయ‌మంటారు. మా నాన్న రొమాన్స్ చేసిన‌ట్టు నేను చేయ‌లేను
* ఆయ‌న‌కు మీరే అవ‌కాశం ఇవ్వ‌చ్చు క‌దా?
- ఇస్తా. నాన్న వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ ఆడ‌ద‌ని అనుకున్నాడు. చూసిన త‌ర్వాత హ్యాపీగా ఫీల‌య్యాడు. ఈడు తీయ‌గ‌లిగాడు సినిమా అని అనుకున్నాడు. మెల్ల‌గా నా దీన్లోకి వ‌స్తున్నాడు. రొమాన్స్ లేక‌పోతే నాన్న చేయ‌లేడు. ఫ‌స్ట్ సీన్ నుంచే ఆయ‌న‌కు రొమాన్స్ ఉండాలి. నా దార్లోకి వ‌చ్చి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రాస్తే నేనే అవ‌కాశ‌మిస్తా.
* ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎలా ఉంది.
- హ్యాపీ అండీ. కూతురు పుట్టింది పేరు లిపి. ఆగ‌స్టు 15న‌. సుష్మ నా భార్య పేరు. నాతో ఎనిమిది నుంచి చ‌దివింది. బీటెక్‌లో ప్ర‌పోజ్ చేశా. పెళ్లి చేసుకున్నాం.
* నెక్స్ట్ సినిమా ఎవ‌రితో?
- నెక్స్ట్ మూవీ యువీతోనే చేస్తున్నా.
* పెద్ద హీరోల‌తో చేయాల‌ని ఉందా?
- నాకిప్పుడు 27 ఏళ్లే క‌దా. మెల్ల‌గా మంచి క‌థ రాసుకుని పెద్ద హీరోల‌తో, పెద్ద సంస్థ‌ల‌తో ప‌నిచేస్తా.
* హీరోల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ రాస్తారా?
- లేదండీ. నేను ముందు ఓ క‌థ అనుకుని, దానికి ఎవ‌రైతే స‌రిపోతారో, ఆ హీరో ద‌గ్గ‌ర‌కి వెళ్తా. ఒక‌వేళ హీరోని దృష్టిలో పెట్టుకుని క‌థ రాస్తే అది నా క‌థ లాగా అనిపించ‌దు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved