pizza
Mickey J Meyer interview (Telugu) about Mister
మిస్ట‌ర్ ఫుల్ ప్యాకేజ్‌డ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ - మిక్కి జె.మేయ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 April 2017
Hyderabad

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌`.ఏప్రిల్ 13న సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ మిక్కి జె.మేయ‌ర్ పాత్రికేయుల‌తో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు...

ప్యాకేజ్‌డ్ మూవీ...
-శ్రీనువైట్ల‌గారి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన తొలి చిత్రం మిస్ట‌ర్‌. ముకుంద త‌ర్వాత వ‌రుణ్‌తేజ్ హీరోగా చేసిన రెండో సినిమా ఇది. శ్రీనువైట్ల వంటి పెద్ద డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న స్ట‌యిల్లోని ఫుల్ ప్యాకేజ్‌డ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

సినిమాలో పార్ట్ కావ‌డం...
- ముకుంద సినిమాకు నేను మ్యూజిక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌ల్ల‌మ‌లుపు బుజ్జిగారు మిస్ట‌ర్ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రు కావ‌డంతో ఆయ‌న శ్రీనువైట్ల‌గారి మిస్ట‌ర్ గురించి చెప్పి, నువ్వు మ్యూజిక్ చేయాల‌న్నారు. అలా సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ స్టార్ట్ చేశాను.

వ‌రుణ్‌తేజ్ గురించి..
- వ‌రుణ్‌తేజ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. త‌ను హీరో అనేలా ఎక్క‌డా ఉండ‌దు. అంద‌రితో స‌రాదాగా క‌లిసిపోతుంటాడు. వ‌రుణ్ నాకు ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ‌.

Mickey j Meyer interview gallery

అదే కార‌ణం...
- కెరీర్ బిగినింగ్‌లో నేను ఎవ‌రినీ పెద్ద‌గా క‌లిసేవాడిని కాను. అందుకు ముఖ్య కార‌ణం నాకు తెలుగు మీద అప్ప‌ట్లో ప‌ట్టు లేక‌పోవ‌డం. అది కాకుండా నేను పెద్ద‌గా ఎవ‌రినీ క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డను. నాకు ఫిలిం ఇండ‌స్ట్రీ వేరే లోకంలా క‌న‌ప‌డింది. నాకు నేనే చిన్న‌వాడిని అనుకుంటాను. త‌ర్వాత నెమ్మ‌దిగా ఇక్క‌డ అల‌వాటు ప‌డ్డాను. ఇప్పుడు తెలుగు మాట్లాడుతాను.

అందుకే గ్యాప్ వ‌చ్చింది...
- `కొత్త బంగారు లోకం` త‌ర్వాత మా నాన్న‌గారికి ఆరోగ్యం బాగ‌లేక‌పోయింది. ఆ స‌మ‌యంలో నేను ఆయ‌న‌తోనే ఉన్నాను. ఆ స‌మ‌యంలో నేను బాగా డిస్ట్ర‌బ్డ్‌గా ఉన్నాను. ఓ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మంచి మ్యూజిక్ ఇవ్వాలంటే త‌న మాన‌సిక స్థితి బావుండాల‌నుకునే నేను మూడేళ్ళ పాటు ఇండ‌స్ట్రీ దూర‌మ‌య్యాను.

నేను అదే ఆలోచిస్తా...
- ఒక మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నేను నంబ‌ర్ వ‌న్ , సెకండ్ అని చూసుకోను..ఆలోచించ‌ను కూడా.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, ప్రేక్ష‌కుల‌కు నచ్చే మ్యూజిక్ ఇచ్చే మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఉండాల‌నుకుంటాను. కొన్నిసార్లు నా పాట‌లు విన్న కొంద‌రు నా గ‌త చిత్రాల్లో పాట‌లులాగానే ఉన్నాయ‌ని అంటారు. కానీ ఓ సంగీత ద‌ర్శ‌కుడిగా వేరే ట్యూన్ ఇచ్చాన‌ని నాకు తెలుసు. రిథ‌మ్ ఒకేలా ఉండ‌టంతో విన్న‌వారికి ఒకేలా ఉన్న‌ట్లు అనుకుంటారు.

ఫోక్ ఆల్బ‌మ్‌...
- ద‌క్షిణాది సంగీతం నా ర‌క్తంలోనే ఉందేమో. ముందు నుండి నాకు ద‌క్షిణాది సంగీతం అంటేనే ఇష్టం. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంతాల్లోని జాన‌ప‌దాల ఆధారంగా చేసుకుని ఓ ఫోక్ ఆల్బ‌మ్ చేయాల‌నే ఆలోచ‌న ఉంది. అయితే దానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది.

త‌దుప‌రి చిత్రాలు...
- సావిత్ర‌గారి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న `మ‌హాన‌టి` చిత్రానికి సంగీతం అందించ‌బోతున్నాను. ఈ సినిమాలో 1940-50 పీరియ‌డ్‌లో ఉన్న మ్యూజిక్‌ను ఇస్తున్నాను. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో మ‌రో మూవీ చేస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved