pizza
Mishti Chakraborty about Babu Baga Busy
ప్ర‌తి పాత్ర కొత్త‌గానే ఉండాలనుకుంటాను - మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2017
Hyderabad

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం `బాబు బాగా బిజీ`. బాలీవుడ్ హిట్ చిత్రం `హంటర్‌` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ మిస్తీ చక్రవర్తి పాత్రికేయుల‌తో మాట్లాడారు...

మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ - ``హిందీ హంట‌ర్‌లో రాధికా అప్టే చేసిన రోల్‌ను తెలుగులో నేను చేశాను. రాధికా అప్టే వంటి విల‌క్ష‌ణ న‌టి చేసిన పాత్ర కాబ‌ట్టి నేను కూడా ఏదైనా కొత్త‌గా ట్రై చేయ‌వ‌చ్చునని న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. క‌థ ప‌రంగా మార్పులు చేశాం. హిందీలో ఎలా ఉందో అలాగే చేద్దామ‌ని అనుకోలేదు. మేన‌రిజ‌మ్స్ అనేవి ప్ర‌తి న‌టుడిలో కొన్ని ప్ర‌త్యేకంగా ఉంటాయి. అలాంటి మేనరిజ‌మ్‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశాం. క‌థలోని మెయిన్ పాయింట్ ఒక్క‌టిగానే ఉన్నా, డిఫ‌రెంట్ మూవీగా రూపొందించాం. ద‌ర్శ‌కుడు న‌వీన్ మేడారం క‌థ చెప్పేట‌ప్పుడు ముందుగా నా క్యారెక్ట‌ర్‌ను వివ‌రించాడు. విన‌గానే ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన వాటి కంటే కొత్త‌గా ఉంద‌నిపించింది. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు రాధ‌. అవ‌స‌రాల శ్రీనివాస్ ఈ సినిమాలో విభిన్న‌మైన క్యారెక్టర్ చేశాడు. అవ‌స‌రాల‌తోనే ఎక్కువ సీన్స్ చేశాను. సినిమాలో అవ‌స‌రాల చేసిన పాత్ర‌కు, నిజ‌జీవితంలోని పాత్ర‌కు చాలా తేడా ఉంది. త‌ను చాలా మంచి కోస్టోర్‌. సెట్‌లో అంద‌రినీ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. ద‌ర్శ‌కుడికి, న‌టీన‌టుల‌కు మధ్య మంచి కెమిస్ట్రీ ఉండ‌టంతోనే సినిమా అవుట్‌పుట్ బాగా వ‌చ్చింది. చాలా మంచి ప్రొడ‌క్ష‌న్ హౌస్, మంచి ప్రొడ‌క్ష‌న్ హౌస్‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీలో ఒక్కొక్క సినిమా చేశాను. ప్ర‌తి సినిమాలో నా పాత్ర విభిన్నంగానే ఉంది. న‌టిగా ప్ర‌తి పాత్ర కొత్త‌గానే ఉండాల‌నుకుంటాను. ప‌ర్టికుల‌ర్‌గా ఇలాంటి క్యారెక్ట‌ర్‌నే చేయాల‌నేం లేదు. శ‌ర‌భ సినిమా పూర్త‌య్యింది. సినిమా షూటింగ్ పూర్త‌యినా, సీజీ వ‌ర్క్ చాలా పెండింగ్‌లో ఉండ‌టంతో ఆల‌స్యం అవుతుంది`` అన్నారు.

interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved