pizza
Miya George interview (Telugu) about Ungarala Rambabu
`ఉంగ‌రాల రాంబాబు` చిత్రంలో పెర్ఫామెన్స్ రోల్ చేయ‌డం ఆనందంగా ఉంది - మియా జార్జ్
You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2017
Hyderabad

`యమన్` చిత్రం లో హీరో విజయ్ ఆంటోనీ తో జత కట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్. ప్రస్తుతం సునిల్ హీరో గా రూపొందుతున్న ఉంగరాల రాంబాబు చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది... ఈ నెల 15న సినిమా విడుదలకు సింద్దంగా ఉండటం తో మియా జార్జ్ విలేకరుల సమక్షం లో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.. ఆ విశేషాలు మీకోసం....

`ఉంగరాల రాంబాబు` ఎలా ఉండబోతోంది?
ఈ సినిమా బాగొచ్చింది, దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్ర కథ చెప్పిన వెంటనే సినిమా చేయడానికి అంగీకరించాను, ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ కలసిన జోనర్ ఉంగరాల రాంబాబు.

మీ పాత్ర ఎలా ఉండనుంది?
ఈ చిత్రం లో నా పాత్ర పేరు సావిత్రి, చాలా బబ్లీ గా, మాడ్రన్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. సినిమా ద్వితీయార్ధంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాంప్ర‌దాయకంగా సాగుతుంది. చెప్పాలంటే పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో న‌టించ‌డం ఆనందంగా ఉంది.

తెలుగులో సినిమా చేయడం భాషకు సమస్య గా ఆనిపించిందా?
లేదండి... మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా... డైలాగ్ స్క్రిప్ట్ ఒక రోజు ముందుగానే ఇవ్వడం తో ప్రాక్టీస్ చేశాక సులువుగానే అనిపించింది.

interview gallery

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో పని చేయడం ఎలా అనిపోయించింది?
ప్రకాష్ రాజ్ గారు ఈ చిత్రం లో నాకు ఫాదర్ క్యారెక్టర్ చేశారు, కమ్యూనిస్ట్ పాత్రలా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ కు వ్యతిరేకంగా ఉంటుంది.. ఒక లెజెండరీ తో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా...

సునీల్ గారు మంచి డాన్సర్ కదా మీరెలా మేనేజ్ చేశారు?
నిజమేనండి. సునీల్ గారు వెరీ గుడ్ డాన్సర్. నేనేమో క్లాసికల్ డాన్సర్ ను, ఫాస్ట్ బీట్ సాంగ్స్ చేసేటప్పుడు కాస్త కాంపిటేటివ్ గా అనిపించింది. బాను మాస్టర్ డాన్స్ ను చాలా బాగా కంపోజ్ చేశారు.

సునీల్ గారితో మొదటి సినిమాలో పనిచేయడం ఎలా అనిపుంచింది?
సునీల్ గారు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే సరదాగా ఉంటారు, చాలా ఎనర్జిటిక్ పర్సన్, నాకు హెల్త్ డైట్ టిప్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా తెలుగు నేర్పించడం లో చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు నాకు కొంచెం అర్థమవుతుంది కూడా...(నవ్వుతూ)

జిబ్రాన్ అందించిన సంగీతం ఎలా అనిపించింది?
ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి, అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్.. చాలా నచ్చాయి నాకు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
తెలుగులో డిస్కషన్స్ జరుగుతున్నాయు, మలయాళం లో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది అంటూ ముగించారు మియా జార్జ్..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved