pizza
Mohan Krishna Indraganti (Telugu) interview about Sammohanam
విమ‌ర్శ క‌న్‌స్ట్ర‌క్టివ్‌గా ఉండాలి - ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

8 June 2018
Hyderabad

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం `స‌మ్మోహ‌నం`. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కుతోన్న `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఇంట‌ర్వ్యూ విశేషాలు...

అన్ని చ‌క్క‌గా అమ‌రాయి...
-సినిమా చాలా బాగా వ‌చ్చింది. కొద్ది సినిమాల‌కు మాత్ర‌మే అన్ని చ‌క్క‌గా అమ‌రుతాయి. అలా చ‌క్క‌గా అమ‌రిన సినిమా `స‌మ్మోహ‌నం`. నేను సినిమా తీసిన సినిమాల్లో త‌క్కువ అసంతృప్తి ఇచ్చిన సినిమా అని చెప్ప‌వ‌చ్చు. లుక్ ప‌రంగా, విజుల‌వ్‌గా, న‌టీనటుల ప‌రంగా అన్ని బాగా కుదిరాయి. స‌మ్మోహ‌నం ప‌రంగా ర‌క ర‌కాల స‌మ్మోహ‌నాలుంటాయి. అదితిరావు అందంగా క‌న‌ప‌డుతుంది. సుధీర్ ఫ్రెష్ లుక్‌లో క‌న‌ప‌డ‌తారు. నాకు స్పెషల్ మూవీగా భావిస్తున్నాను.

నిజ జీవితం నుండే న‌రేశ్ పాత్రను రాసుకున్నాను....
- న‌రేశ్‌గారు ఇందులో సుధీర్ తండ్రి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. నాకు చాలా ఇష్టమైన పాత్ర‌. నిజ జీవితంలో ఆ పాత్ర ఏదైతో ఉందో.. ఆ పాత్ర లాంటి వ్య‌క్తి గోల్క్‌కొండ హైస్కూల్ స‌మ‌యంలో త‌గిలాడు. అరే ఈ క్యారెక్ట‌ర్‌తో ఓ సినిమ రాస్తే బావుంటుంద‌ని క‌దా! అనిపించి.. క‌థ‌ను మొద‌లెట్టి, దాన్ని ల‌వ్‌స్టోరీగా మలిచాను. న‌రేశ్‌గారే పాత్రే ఈ సినిమాకు సూత్ర‌ధారి. ఈ పాత్ర‌కు సినిమాలంటే పిచ్చి. సినిమా అంటే గొప్ప క‌ళ అనే భావ‌న‌లో ఉంటాడు. అయితే హీరో అందుకు భిన్నంగా ఉంటాడు. చిన్న పిల్ల‌ల ఇల్ల‌స్ట్రేట‌ర్‌గా ఇందులో సుధీర్ క‌న‌ప‌డ‌తాడు. త‌న‌కు సినిమా న‌టులంటే పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. వీరి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌లో అమ్మాయి పాత్ర ఎలా ఎంట‌ర్ అయ్యింద‌నేదే సినిమా. ముందుగా ఈ పాత్ర‌కు న‌రేశ్‌గారు నాకు మైండ్‌లో త‌ట్ట‌లేదు. నేను పాత్ర రాసుకున్న త‌ర్వాత రావు ర‌మేశ్‌గారు, భ‌ర‌ణిగారు అయితే బావుంటుంద‌నుకున్నా.. అయితే. వారికి ఎక్కువ ఇమేజ్ ఉంది. కానీ ఈ మ‌ధ్య పాపుల‌ర్ అవుతున్న క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ చేయాల‌నిపించేంది. ఇద్ద‌రు, ముగ్గురు మిత్రులు కూడా నాకు న‌రేశ్‌గారైతే బావుంటుంద‌ని స‌ల‌హా కూడా ఇచ్చారు. ఆయ‌న న‌టించిన త‌ర్వాత మ‌రొక‌రు చేయ‌క‌పోవ‌డ‌మే బావుంద‌నిపించింది.

సినిమా వాళ్లంటే తృణీక‌ర‌ణ భావ‌న ఉంది....
- సినిమా రంగం అనేది నాకు తిండి పెడుతున్న ఇండ‌స్ట్రీ. అలాంటి ప‌రిశ్ర‌మ గురించి నేను ఎందుకు చెడుగా చూపిస్తాను. ప్ర‌తి రంగంలో మంచి చెడులుంటాయి. ఇక సినిమా రంగంపై ఇందులో స‌ద్విమ‌ర్శ‌లుంటాయి. సినిమా రంగం అంటే చీ చీ అనుకునే హీరో సినిమా రంగం నాకు తెలియ‌కుండానే నాపై ప్ర‌భావం చూపుతుంద‌ని గుర్తిస్తాడు. ఆ జ‌ర్నీయే సినిమా. హీరోయిన్ ఆ గుర్తింపును ఎలా తీసుకొచ్చింద‌నేదే సినిమా.

- సినిమా గురించి తృణీక‌రంగా భావంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నేను ఇప్ప‌టికీ అలాంటి భావాల‌ను ఫేస్ చేస్తున్నాను. `బాగా చ‌దువుకుని ఇలాంటి డ‌ర్టీ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చారు` అని నా రిలేష‌న్సే అంటుంటారు. చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లో నుండి ఓ అమ్మాయి సినిమాల్లోకి వ‌స్తానంటే నోర్ముయ్ అని అంటుంటారు. ఈ భావ‌న ఎక్క‌డి నుండి వ‌చ్చింది. మ‌న‌మే మ‌న రంగం గురించి అలా చెబుతున్నామేమో. సినిమా వాళ్ల‌కు పిల్ల‌నివ్వ‌రు. ఇళ్లు అద్దెకివ్వ‌రు.. షూటింగ్‌ల‌కు ఇళ్లు అద్దెకివ్వ‌రు. ఇలా సినిమా వాళ్లంటే తృణీక‌ర‌ణ భావ‌నుందా? అనే చిన్న ప్ర‌శ్న‌ను ఈ సినిమా ద్వారా లైట్‌గా ట‌చ్ చేస్తున్నాను. అలాగ‌ని సినిమా రంగం గురించి చెడుగా చూపించలేదు. ఎందుకంటే ఇక్క‌డ ఎంతో మంది గొప్ప‌వారున్నారు. ఈ సినిమా చూస్తే సినీ రంగంపై గౌర‌వం పెరుగుతుంది అని నేను చెప్ప‌ను కానీ.. అంద‌రిలో సినిమా రంగంలో కూడా మంచి వారున్నారు అనే ఆలోచ‌న రావాలి. సినీ రంగంపై విమ‌ర్శ‌లు రావ‌డంలో సోష‌ల్ మీడియా పాత్ర కూడా కాస్త ఉంది. విమ‌ర్శ ఉండ‌కూడ‌దు అని నేను అన‌ను. కానీ ఆ విమ‌ర్శ ఎంత క‌న్‌స్ట్ర‌క్టివ్‌గా ఉందో అని ఆలోచించుకోవాలి.

ఎమోష‌న్‌ను ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో చూపాం...
- `శివ‌రంజ‌ని` సినిమా నేను చూడ‌లేదు. కానీ రంగీలా వంటి సినిమాలోశ‌క్తిక‌పూర్ పాత్ర త‌న‌ను స్పీల్‌బ‌ర్గ్‌తో పోటీగా భావించుకుంటూ ఉంటాడు. అలా వెర్రిత‌ల‌లు వేసే పాత్ర‌. కానీ `స‌మ్మోహ‌నం`లో అలా ఉండ‌దు. ఎవ‌రి ప‌నుల్లోవారు బిజీగా ఉంటారు. ఇందులో హీరో, హీరోయిన్ క‌లుసుకునే బ్యాక్‌డ్రాప్ కొత్త‌గా ఉంటుంది. క‌లుసుకున్న త‌ర్వాత స‌మ‌స్య‌ల‌ను ఎలా ప్రొజెక్ట్ చేస్తామ‌నేదే సినిమా. అనుహ్య‌మైన ప‌రిస్థితుల్లోహీరో హీరోయిన్ ఎలా ప్రేమించుకున్నారు? ఎలా విడిపోయారు? మ‌ళ్లీ ఎలా కలుసుకున్నార‌నే దాన్ని ఎంట‌ర్‌టైనింగ్ వేలో చ‌క్క‌గా చెప్పాం.

నార్త్ ఇండియన్ హీరోయిన్ కావాల‌ని ముందుగానే అనుకున్నా..
- హీరోయిన్ విష‌యానికి వ‌స్తే.. మూడు నాలుగు హిట్స్ ఇచ్చిన నార్త్ ఇండియ‌న్ అమ్మాయి అయితే బావుంటుంద‌నిపించింది. త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ వంటి హీరోయిన్స్ ఇమేజ్ చాలా పెద్ద‌ది. వాళ్లు చేసిన ఆడియ‌న్ త‌మ‌న్నాని, కాజ‌ల్‌ని చూస్తారే త‌ప్ప‌.. హీరోని చూడ‌రు. హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ప్పుడు మ‌ణిర‌త్నంగారి చెలియా సినిమా చూశాను. ఈమైతే స‌రిపోతుంద‌నిపించింది. ఆ స‌మ‌యంలో త‌ను భూమి, ప‌ద్మావ‌త్ సినిమాల్లో న‌టిస్తుంది. అయితే నేను త‌న‌కు ఫోన్ చేసి.. `ముందు ఐడియా వినండి. న‌చ్చితే పూర్తి క‌థ ముంబై వ‌చ్చి చెబుతాను` అన్నాను. ముందు ఐడియా విన్న అమ్మాయి. `ముందు మీరు క‌థను ఫోన్‌లో చెప్పేయండి. నాకు ఐడియా న‌చ్చింది. కానీ నేను భూమి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాను` అని అంది. స‌రేన‌ని నేను చెప్పాను. తన‌కు న‌చ్చ‌డంతో డేట్స్ అడ్జ‌స్ట్ చేసి న‌టించింది.

ప్ర‌స్తుతం ట్రెండ్ బావుంది...
- ప్ర‌స్తుతం ఉన్న న‌డుస్తున్న ట్రెండ్ చాలా బావుంది. రామ్‌చ‌ర‌ణ్‌లాంటి హీరో ఓ చెవిటివాడి పాత్ర‌లో న‌టించ‌డం.. మెప్పించ‌డం గొప్ప విష‌యం. తెలుగు సినిమాలో మార్పుకు మంచి ఉదాహ‌ర‌ణ‌. అలాగే మ‌హాన‌టి విష‌యానికి వ‌స్తే మ‌హిళా సినిమా. ఎలాంటి స్టార్ హీరోలు లేరు. ఉన్న ఇద్ద‌రు, ముగ్గురు స్టార్స్ కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ మాత్ర‌మే ఇచ్చారు. అలాంటి సినిమా గొప్ప విజ‌యాన్ని సాధించ‌డం మ‌రో ఉదాహ‌ర‌ణ. అంటే ప్రేక్ష‌కుల కొత్త‌ద‌నం కోసం ఎప్ప‌టి నుండో ఎదురుచూస్తున్నారు. కానీ వారిని చేరుకోవ‌డంలో ఫిలిమ్ మేక‌ర్స్‌దే ఆల‌మ‌స్య‌మైంది.

interview gallery



మ‌న‌కు ఎవ‌రూ రెడ్ కార్పెట్ వేయ‌రు...
- నేను స్టార్ హీరోలంద‌రినీ క‌లుస్తున్నాను. క‌థ‌లు చెబుతున్నాను. అయితే ఒక విష‌య‌మేమంటే మ‌నం హీరోని క‌లుస్తున్న త‌రుణంలో త‌ను ఎలాంటి మూవీ చేయాల‌నుకుంటున్నాడ‌నేది కూడా ముఖ్య‌మే. అది గుర్తించ‌కుండా వారు రిజెక్ట్ చేస్తున్నార‌నుకోవ‌డంలో అర్ధం లేదు. నేను క‌ల‌వ‌గానే నాకు రెడ్ కార్పెట్ వేస్తార‌నుకోకూడ‌దు. అది అన్ని స‌మ‌యాల్లో జ‌ర‌గ‌దు. నేను హీరోను దృష్టిలో పెట్టుకుని క‌థ త‌యారు చేయ‌ను. ఓ క‌థ‌ను త‌యారు చేసుకున్న త‌ర్వాత దానికి ఎవ‌రైతే సూట్ అవుతారు.. అని ఆలోచిస్తాను. వారిని క‌లుస్తాను. ఆ స‌మ‌యంలో వారి స్టేట్ మైండ్ ఎలా ఉంటుంద‌నేది ఇంపార్టెంట్. అంతే త‌ప్ప‌.. వారిని బ్లేమ్ చేయ‌డం త‌ప్పు. అయితే స్టార్స్‌తో సినిమా చేస్తే మ‌జా వేరు. ఎందుకంటే మ‌న‌కు రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది.

మ‌న సినిమాల్లో అదే మిస్ అవుతున్నాం...
- ఆడ‌వాళ్ల‌ను చుల‌క‌న‌గా చూపించ‌కూడ‌నేది సింపుల్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా. ఎందుకంటే ఆడవాళ్ల‌ను గొప్ప‌గా చూపిస్తే ఎక్కువ మంది మ‌హిళ‌లు ఆ సినిమాను చూస్తారు. ఓ మ‌హిళ త‌న కుటుంబాన్ని సినిమాకు తీసుకుని రాగ‌లుగుతుంది. హీరోయిజ‌మ్‌ను ఎలివేట్ చేయాల‌ని.. హీరోయిన్‌ని ద‌ద్ద‌మ్మ‌ను చేయ‌న‌క్క‌ర్లేదు. మ‌నం చేస్తున్న త‌ప్పే అది. హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్ట‌ర్స్ గ్లామ‌ర్‌గా ఉంటాయి. అదే స‌మ‌యంలో ప‌వ‌ర్‌ఫుల్‌గానూ ఉంటాయి. రంగ‌స్థలంలో స‌మంత క్యారెక్ట‌ర్ ఎంత ఎగ్రేసివ్‌గా ఉంటుంది. ఎవ‌రైనా అబ్జ‌క్ట్ చేశారా? అలాగే మ‌హాన‌టిలో కీర్తిసురేశ్‌గారి పాత్ర ఎంత బావుంటుంది. ఆమె పాత్రే కాదు.. ఇత‌ర పాత్ర‌ల‌న్నింటికీ అర్థం ఉంది. సినిమాను మ‌నం స‌రిగ్గా తీయ‌క‌పోతే జ‌నాల‌కు అర్థం కాదు.

సుధీర్ కంటే ముందు...
- సుధీర్‌బాబు పాత్ర‌లో ముందు విజ‌య్ దేవ‌ర‌కొండాని అనుకున్నాను. కానీ అర్జున్‌రెడ్డి విడుద‌లై లార్జ‌ర్‌దేన్ లైఫ్ మూవీలా అత‌నికి త‌యారైంది. అలాగే నాని అనుకుంటే.. నాని ఇప్పుడు స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఎవ‌రైతే స‌రిపోతార‌ని వెతుకుతున్న‌ప్పుడు సుధీర్‌బాబుని.. శ‌మంత‌క‌మ‌ణి చిత్రంలో చూశాను. అందులో త‌న త‌ల్లి గురించి త‌ను మాట్లాడే స‌న్నివేశం ఒక‌టి ఉంటుంది. అది న‌చ్చ‌డంతో త‌న‌ను వెళ్లి క‌లిసి అడిగాను. త‌ను చేయ‌డానికి ఒప్పుకున్నాడు. అదే స‌మ‌యంలో త‌ను వెయిట్ కూడా త‌గ్గడం నాకు ప్ల‌స్ అయ్యింది.

త‌దుప‌రి చిత్రం..
- ఇంకా ఏమీ అనుకోలేదండి.. కాస్త రెస్ట్ తీసుకుని త‌దుప‌రి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. ఎందుంటే 2016 నుండి 2018 వ‌ర‌కు మూడు సినిమాలు(జెంటిల్‌మ‌న్‌, అమీతుమీ. స‌మ్మోహ‌నం) చేసేశాను. ఈ సినిమాల స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉండటం వల్ల గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేసేశాను. నెక్ట్స్ క‌థ త‌యారు చేసుకోవాలంటే నాకు క‌నీసం ఏడాది స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved