pizza
Mythri Movies producers interview (Telugu) about Savyasaachi
వాళ్ల‌తో మేం హ్యాపీ.. మాతో వాళ్లు హ్యాపీ - మైత్రీ మూవీస్ నిర్మాత‌లు
You are at idlebrain.com > news today >
Follow Us

30 October 2018
Hyderabad

మైత్రీ మూవీస్ సంస్థ ఇప్పుడు తెలుగులో ఓ బ్రాండ్. తీసిన సినిమాల‌న్నీ హిట్ కావ‌డం, వ‌రుస‌గా సినిమాల‌కు ప్లాన్ చేస్తుండ‌టంతో, టాలీవుడ్ చూపు ఇప్పుడు మైత్రీ వైపు ఉంది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం స‌వ్య‌సాచి. ఈవారం విడుద‌ల కానున్న సవ్య‌సాచి గురించి మైత్రీ మూవీస్ నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, సీవీ మోహ‌న్‌, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఎప్పుడూ ప్రెస్ ముందుకు రానివారు ఇప్పుడు ప్రెస్ ముందుకు వ‌చ్చారు?
- అలాంటిదేమీ లేదండీ. మాకు అన్నిటిక‌న్నా క‌ష్ట‌మైన ప‌ని ప్రెస్‌తో మాట్లాడ‌ట‌మే. మిగిలిన వ‌న్నీ కూడా సుల‌భంగా చేస్తాం. ఇలా ప్రెస్ ముందుకు రావ‌డం అల‌వాటు లేదంతే.

* మీలో ఎవ‌రు స‌బ్జెక్ట్ ఓకే చేస్తారు?
- ముగ్గురం క‌లిసి వినం. సెప‌రేట్‌గానే వింటాం. అయినా ముగ్గురం క‌లిసి ఓకే చేస్తాం. స్పెష‌ల్‌గా `ఈ క‌థ వ‌ద్దు.. ఇంకోక‌టి చేయండి` అనేది ఇప్ప‌టిదాకా ఏ ద‌ర్శ‌కుడితోనూ రాలేదు. ఇప్ప‌టిదాకా మా ద‌ర్శ‌కులు చెప్పిన మూడు క‌థ‌లు బావున్నాయి.

* వ‌రుస స‌క్సెస్‌లున్నాయి. దీన్నెలా నిల‌బెట్టుకుంటామ‌నే భ‌యాలున్నాయా?
- నిల‌బెట్టుకోవాల‌ని ఉంటుంది.

* చందుమొండేటి ఈ స‌బ్జెక్ట్ ఎప్పుడు చెప్పారు?
- న‌వంబ‌ర్‌లో షూటింగ్ మొద‌లుపెట్టాం. అంత‌కు రెండు నెల‌ల ముందు చెప్పారు. అంటే లాస్ట్ సెప్టెంబ‌ర్‌లో చెప్పారు. ఈ క‌థ‌తో హీరోగారు, చందుగారు ఎప్ప‌టి నుంచో ట్రావెల్ అయ్యారు.

* తొలి మూడు సినిమాలు టాప్ స్టార్స్ తో చేశారు. త‌ర్వాత ఇప్పుడు కాస్త త‌గ్గిన‌ట్టున్నారు?
- ముందు టాప్ స్టార్స్ తోనే చేద్దామ‌నుకున్నాం. త‌ర్వాత మేం మార్కెట్‌ని అబ్జ‌ర్వ్ చేస్తుంటే మిడ్ రేంజ్  మూవీస్ కూడా చాలా బాగా ఆడుతున్నాయి. అందుకే అవి కూడా చేద్దామ‌నుకున్నాం. 2016లో అనుకున్నాం. 2017లో ప్రాసెస్ స్టార్ట్ చేశాం. ఇప్ప‌టికి కుదిరింది.

* మీ ముగ్గురిలో ఎవ‌రికైనా సినిమా నిర్మాణ అనుభ‌వం ఇంత‌కు ముందు ఏమైనా ఉందా?
- అంద‌రికీ ఇంత‌కు ముందు చూసిన అనుభ‌వ‌మే అండీ. ర‌వికి కాస్త ఎక్కువ బెట‌ర్‌. మేం అంద‌రం విజ‌య‌వాడ నుంచే. అక్క‌డ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ సినిమానే. విజ‌య‌వాడ‌లో అంద‌రూ సేమ్ బ్యాచ్‌. పాతికేళ్లుగా ఫ్రెండ్‌షిప్ ఉంది.

* మైత్రీ మూవీస్ చాలా మందికి అడ్వాన్సులు ఇస్తుంటార‌ని..
- అవి జ‌రుగుతూనే ఉంటాయండీ.

* ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారికి, త్రివిక్ర‌మ్‌గారికీ డ‌బ్బులిచ్చార‌నీ?
- వాళ్లు చేస్తారండీ. అది కూడా ఉంది.

* ప‌వ‌న్‌గారు చేస్తార‌నే అనుకుంటున్నారా? ఆయ‌న రాజ‌కీయాల‌తో బిజీ?
- చేస్తారండీ. చేస్తార‌నే అనుకుంటున్నాం.

* సినిమాల‌కే గుడ్ బై చెప్పిన‌ట్టున్నారుగా?
- చేస్తార‌ని మేం ఆశిస్తున్నాం.

* గ‌తంలో మీరు అడ్వాన్సులు వెన‌క్కి తిరిగి తెచ్చుకున్నార‌ని..?
- అలాంటివేమీ లేవండీ.

* త్రివిక్ర‌మ్‌గారితో సినిమా ఎందుకు ఆల‌స్య‌మ‌వుతుంది?
- అలాంటిదేమీ లేదండీ. చేస్తారు.

* హీరోని ఎవ‌రినైనా అనుకున్నారా?
- ఆయ‌న ఎవ‌రిన‌నుకుంటే వాళ్లేనండీ.

* మాధ‌వ‌న్‌గారిని మీరు అప్రోచ్ అయ్యారా?
- మేం క‌లిసి క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చి చేస్తాన‌న్నారు. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు డ‌బ్బింగ్ అయి ఇక్క‌డ బాగా ఆడాయి. దాంతో ఆయ‌న‌కు తెలుగులో ఓ సినిమా చేయాల‌ని అనిపించింది. ఈ క‌థ న‌చ్చి చేశారు.

* ఇందులో మీకు బాగా న‌చ్చిన అంశం ఏంటి?
- ఇందులో ఉన్న సిండ్రోమ్ మాకు ఇంట్ర‌స్టింగ్గా అనిపించింది. ఆ చెయ్యి వేరుగా బిహేవ్ చేయ‌డం అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యం. అంతేగానీ ఒన్లీ యాక్ష‌న్ కాన్సెప్ట్ తో చూడ‌కూడ‌దు. దీన్లో కామెడీ ఉంది. డ్రామా ఉంది. ఫ‌స్ట్ హాఫ్ పూర్తిగా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది.

* హీరో, ద‌ర్శ‌కుల మాట‌ల‌ను బ‌ట్టి... మీ సంస్థ యాడ్ కావ‌డం వ‌ల్ల‌నే బ‌డ్జెట్ భారీగా అయింద‌న్న‌ట్టు అన్నారు... నిజ‌మేనా?
- అలాంటిదేమీ లేదండీ. కంఫ‌ర్ట‌బుల్‌గానే ఉన్నాం. కావాల్సినంతే ఖ‌ర్చుపెట్టాం.

* ముందు స్పెష‌ల్ సాంగ్‌కి త‌మ‌న్నాను అనుకుని, త‌ర్వాత డ్రాప్ అయిన‌ట్టున్నారు?
- అంటే ఎంత ఆలోచించినా, ఆ సాంగ్‌లో త‌మ‌న్నాను పెడితే అంతగా ఫిట్ కాద‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు. దాంతో వెన‌క్కి త‌గ్గాం.

* త‌మ‌న్నా కాకుండా ఇంకెవ‌రినైనా అనుకున్నారా?
- లేదండీ.

* మీ సంస్థ‌లో ఒక‌సారి ప‌నిచేసిన వాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తున్నారు. స్పెష‌ల్ రీజ‌న్స్ ఉన్నాయా?
- మేం వాళ్ల‌తో హ్యాపీ. వాళ్లు మాతో హ్యాపీ అంతే. చందుతోనూ రానున్న ఒక‌టి, రెండు సినిమాల్లో ఏదో ఒక‌టి మా సంస్థ‌లోనే ఉంటుంది.

* మాధ‌వ‌న్‌గారు ఈ రోల్‌కి ఏదైనా స్పెష‌ల్ హోమ్ వ‌ర్క్ చేశారా?
- ఆయ‌న‌కు అలాంటివేమీ అక్క‌ర్లేదండీ. ఆయ‌న ఆన్‌సెట్‌లో ఇంప్రూవైజ్ చేసేవారు.

* బడ్జెట్ ఎంత‌యింది?
- ఇంకా ఆ లెక్క‌లు వేయ‌లేదండీ. కానీ కంఫ‌ర్టబుల్‌గానే ఉన్నాం.

* సాయిధ‌ర‌మ్‌తోనూ, ఆయ‌న త‌మ్ముడితోనూ ఒకేసారి తీస్తున్నారు?
- సాయితో చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఇప్పుడు సెట్ అయింది. వైష్ణ‌వ్‌తో బుచ్చిబాబు అని రంగ‌స్థ‌లం రైట‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ఉంటుంది. సుకుమార్‌గారితో ఎప్ప‌టి నుంచో ఉంది.

* 14 సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్న‌ట్టున్నాయి?

- అన్నిటిలోనూ షూటింగ్లో ఉన్న‌వి ఎన్నండీ? ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్‌. స్టార్ట్ అయితే చిత్ర‌ల‌హ‌రి. ఎనీ టైమ్ రెండు, మూడు క‌న్నా ఎక్కువ సెట్స్ మీద ఉండ‌ట్లేదు క‌దండీ.

* స్పీడ‌ప్ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది?
- షూటింగ్‌లో 2,3 మాత్ర‌మే ఉంటున్న‌ట్టున్నాయి.

* మీలో ఎవ‌రు ఎక్కువ‌గా ప్రొడ‌క్ష‌న్‌ చూసుకుంటారు?
- ర‌విగారు మాత్రం ఎప్పుడూ ఇక్క‌డే ఉంటారు. మిగిలిన ఇద్ద‌రం ఆరు నెల‌లు ఉంటాం. సీఈఓ చెర్రీగారుంటారు. మాకు వండ‌ర్‌ఫుల్ టీమ్ కూడా ఉంది.

* ఓవ‌ర్సీస్‌లో మీరు ఒక‌ప్పుడు బిగ్ ప్లేయ‌ర్స్ ఏమో క‌దా?
- అక్క‌డేం చేయ‌ట్లేదండీ. ఇప్పుడు అక్క‌డ గ్రేట్ ఇండియా వాళ్లు.. మిగిలిన వాళ్లు చేస్తున్నారు. అక్క‌డ చేయాలంటే క‌నీసం రెండు వారాల ముందు అక్క‌డుండాలి. కానీ ఇక్క‌డ ఇన్ని సినిమాలు చేస్తా, అక్క‌డ డిస్ట్రిబ్యూష‌న్ చేస్తుంటే క‌ష్ట‌మ‌వుతోంది.

* సినిమా పోస్ట్ పోన్ అయిన‌ప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఫీల‌య్యారు?
- లేదుగా. ఆ గ్యాప్‌లో వాళ్ల సినిమానే ఇంకోటి వ‌చ్చింది.

* మీ సంస్థ‌లో డిలే సెంట‌మెంట్ ఉందేమో?
- అలాంటిదేమీ లేదండీ. కానీ అలా జ‌రిగిపోయింది.

* సుకుమార్‌గారి సినిమా ఎప్పుడుంటుంది?
- ఏప్రిల్‌, మేలో ఉంటుంది.

* స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ కాకుండా.. మిగిలిన‌వ‌న్నిటిలో దేవిశ్రీ ప్ర‌సాద్ ఉన్న‌ట్టున్నారుగా?
- ఆయ‌న మా సంస్థ‌లో చాలా మంచి హిట్స్ ఇస్తున్నారండీ.

* నానితో నెక్స్ట్ ఏమైనా ఉంటుందా?
- ఉందండీ.

* సంతోష్ శ్రీన్ వాస్ సినిమా ఎప్ప‌టి నుంచి ఉంటుంది?
- న‌వంబ‌ర్ నుంచి ఉంటుంది. తెరిలో చిన్న పార్ట్ ఉంటుంది. మిగిలింది అంతా కొత్త‌గా చేసుకున్నారు.

* ప‌వ‌న్‌గారికోసం సంతోష్ చేసిన స్క్రిప్ట్ నే ర‌వితేజ‌కోసం మార్చిన‌ట్టున్నారుగా?
- ఆయ‌న ప‌ర్మిష‌న్‌తో చేశామండీ.

* డ‌బ్బులు పెట్ట‌డ‌మేనా? లొకేష‌న్ల‌కు కూడా వెళ్తారా?
- ఎవ‌రో ఒక‌రం లొకేష‌న్ల‌లో ఉంటాం.

* థ‌ర్డ్ లేయ‌ర్ కి వెళ్లాల‌నే ఆలోచ‌న ఉందా?
- అంద‌రూ ఫ్రెష‌ర్ల‌తో చేస్తున్నాం. మేం కూడా రూ.89ల‌క్ష‌ల‌తో చేస్తున్నాం. అంద‌రూ కొత్త‌వారే చేస్తున్నారు. రితీష్ అని హైద‌రాబాద్ అత‌ను డైర‌క్ట‌ర్‌. ఇంకో 10 రోజుల్లో షూటింగ్ ఉంటుంది.

* స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి, స్మాల్ సినిమాలు చేయ‌డానికి ఏమైనా తేడా ఉందా?
- దేని బ‌డ్జెట్ దానికి ఉంటుంది. స్టార్ల సినిమాల్లో ఐదారు రోజుల్లో మంచి హిట్‌లో రిక‌వ‌ర్ అయితే, ఇందులో 10 రోజుల్లో అవుతుంది.

* సవ్య‌సాచిని త‌మిళ్‌లో విడుద‌ల చేస్తున్నారా?
- మాధ‌వ‌న్‌గారు అక్క‌డ పెద్ద హీరో కాబ‌ట్టి, అక్క‌డ త‌మిళ్‌లో విడుద‌ల చేయ‌మ‌ని రాసుకున్నాం.

* నెక్స్ట్ ఇయ‌ర్ ఐదు సినిమాలున్నాయా?
- ఈ ఇయ‌ర్ జ‌రిగేవి కూడా నెక్స్ట్ ఇయ‌ర్‌కి వ‌స్తుంటాయి.

* మీ సొంత స్టూడియో... వంటి వాటిని గురించి ఆలోచిస్తున్నారా?
- ప్ర‌స్తుతానికి అలాంటి ఆలోచ‌న‌లు లేవండీ.

* మైత్రీకి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌లో ఓ బ్రాండ్ ఉంది. మిగిలిన సంస్థ‌ల‌తో టై అప్ అవ్వ‌డానికి కార‌ణం ఏంటి?
- క‌లిసి చేద్దామ‌ని అనుకున్నాం. అందుకే చేస్తున్నాం.

* టీవీ రంగంలో రావ‌డానికి అవ‌కాశం ఉందా?
- ఇంకా లేదండీ. గ‌తంలో ఎప్పుడో అమేజాన్ వారు అడిగారు. దాని మీద కూడా మా వాళ్లు ప‌నిచేస్తూ ఉన్నారు.

* ఎన్టీఆర్‌తో మ‌ర‌లా ఎప్పుడుంటుందండీ?
- రాజ‌మౌళిగారి సినిమా అయ్యాక ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved