pizza
Nabha Natesh interview (Telugu) about Nannu Dochukunduvate
`న‌న్ను దోచుకుందువ‌టే`లో న‌టించ‌డం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది - న‌బా న‌టేశ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

17 September 2018
Hyderabad

సుధీర్ బాబు, న‌బా న‌టేశ్ జంట‌గా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం `నన్ను దోచుకుందువటే`. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా న‌బా న‌టేశ్ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ సినిమా గురించిన విశేషాలు తెలిపారు.

తెలుగులో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- `న‌న్ను దోచుకుందువ‌టే` నేను న‌టించిన రెండో సినిమా అయితే .. విడుద‌ల పరంగా చూస్తే ఇదే నా డెబ్యూ మూవీ. నా క‌న్న‌డ మూవీస్‌ చూసిన డైరెక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.నాయుడుగారు క‌థ‌కు నేను స‌రిపోతాన‌ని భావించి న‌న్ను అప్రోచ్ అయ్యారు.

నేప‌థ్యం?
- నేను క‌న్న‌డ అమ్మాయినితెలుగు మాట్లాడటం వ‌చ్చు. అయితే వాక్య నిర్మాణం అంత ప‌క్కాగా ఉండ‌దు. తెలుగు సినిమాల్లో న‌టించడం వ‌ల్ల తెలుగు నేర్చుకున్నాను. నేను బేసిక్‌గా థియేట‌ర్ ఆర్టిస్ట్‌ని. నా డైలాగ్స్ నేనే చెప్పుకోవాలి. కాలేజ్ చదివే రోజుల్లోనే నేను థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కోర్సు చేశాను. చాలా స్టేజ్ షోస్ చేశాను. మూవీస్‌లో రావాల‌నే ఆలోచ‌న‌తోనే థియేట‌ర్స్ కోర్సు నేర్చుకున్నాను. అలాగే మోడ‌లింగ్ కూడా చేశాను. మోడ‌లింగ్ వ‌ల్ల ప్యాష‌న్ గురించి విష‌యాలు తెలుసుకున్నాను. థియేట‌ర్ కోర్సు వ‌ల్ల న‌ట‌న గురించి అవ‌గాహ‌న వ‌చ్చింది. థియేట‌ర్స్‌తో పోల్చితే కెమెరా యాక్టింగ్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

interview gallery



న‌న్ను దోచుకుందువ‌టేలో మీ పాత్ర ఎలా ఉంబోతుంది?
- `న‌న్ను దోచుకుందువ‌టే` సినిమాలో అన్ని ఎమోష‌న్స్ ఉన్న పాత్ర చేశాను. చాలా కూల్‌గానే సినిమాను పూర్తి చేశాను. ఇలాంటి పాత్ర చేయ‌డం నాకు చాలా సంతోషానిచ్చింది. ప్ర‌తిరోజూ కొత్తగా అనిపించేది.

హీరో సుధీర్ గురించి?
- సుధీర్‌గారు మంచి నిర్మాత‌.. బెస్ట్ కోస్టార్‌. కొత్త హీరోయిన్ కాబ‌ట్టి నాకు మంచి స్పేస్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ నాయుడుగారు, హీరో సుధీర్‌గారు నాపై న‌మ్మ‌కంతో ఇంత మంచి అవ‌కాశం ఇవ్వ‌డం నా అదృష్టం. అలాగ‌ని ప్రెష‌ర్‌గా అనిపించ‌లేదు. ఎందుకంటే చాలా హోమ్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల నాకు సెట్స్‌లో చాలా ఈజీగా అనిపించింది.

డైరెక్ట‌ర్ గురించి?
- డైరెక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.నాయుడుగారు ఓ సీన్‌లో త‌న‌కు ఏం కావాలో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. ఆయ‌న ఓర‌కంగా నాకు కావాల్సినంత స్పేస్ ఇవ్వడం వ‌ల్ల‌నే నేను చాలా కంఫ‌ర్ట్‌గా చేసుకుంటూ వ‌చ్చాను. డైరెక్ట‌ర్‌కి త‌న‌కేం కావాలి.. అనే విష‌యంపై క్లారిటీ ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved