pizza
Nagababu interview
ఆయ‌న ఇచ్చిన ధైర్యంతో మ‌ళ్లీ సినిమా చేశాను - కె.నాగ‌బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

01 May 2018
Hyderabad

అల్లు అర్జున్ హీరోగా.. కె.నాగ‌బాబు స‌మ్ప‌ణ‌లో రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై, వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్ నిర్మించిన చిత్రం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. మే 4న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర స‌మ‌ర్ప‌కుడు కె.నాగ‌బాబు ఇంట‌ర్వ్యూ...

ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ...
- నిర్మాత‌గా `ఆరెంజ్‌` చేశాను. ఆ సినిమా ప్లాప్ అయిన త‌ర్వాత నేను నిర్మాత‌గా ప‌నికి రాన‌ని అనిపించింది. ఎందుకంటే `మ‌గ‌ధీర‌` వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత చ‌ర‌ణ్‌కు హిట్ ఇవ్వ‌లేక‌పోయాన‌నే బాధ ఎక్కువ‌గా ఉండిపోయింది. సినిమాలో నిర్మాత‌గా న‌ష్టం కంటే ఆ స‌మ‌యంలో బాధ‌గా అనిపించింది. అందుక‌నే సినిమా నిర్మాణానికి దూరంగా ఉండిపోయి.. సీరియ‌ల్స్ , షోలు చేసుకుంటూ ఉన్నాను.

ఆయన ఇచ్చిన ధైర్య‌మే... అల్లు వారి ప్రేరణతో..

- సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న స‌మ‌యంలో మూడేళ్ల క్రితం అర‌వింద్‌గారు వ‌చ్చి `మ‌ళ్లీ నువ్వు నిర్మాత‌గా సినిమాలు చెయ్‌` అన్నారు. నాకు అవ‌స‌ర‌మా అని కూడా అనిపించింది. అయితే అల్లుఅర్జున్ కూడా వ‌చ్చి `మీరు సినిమా చేయాలి` అని అడ‌గ్గానే ఆలోచించాను. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారితో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా చేశాను. అప్ప‌టికే బ‌న్ని అన్ని రెడీ చేసుకుని ఉండ‌టంతో నాకు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింది. అయితే అర‌వింద్‌గారు ఇచ్చిన ధైర్యంతో మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న మాత్రం వ‌చ్చింది. పెద్ద హీరోల సినిమాలంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంటాయి. కాబ‌ట్టి నిర్మాత రోజూ సెట్‌కి వెళ్లాల్సిన ప‌ని లేదు. నేను అప్పుడప్పుడూ సెట్ కి వెళ్లానంతే. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు అన్ని విష‌యాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు.

ప్రస్తుతానికి అంతా బాగుంది..
నేను దాదాపు పదేళ్ళ తర్వాత నిర్మాతగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాను, మా అబ్బాయి హీరోగా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మా అమ్మాయి మంచి పాత్రలు చేస్తూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకొంటోంది. "జబర్దస్త్" షో జడ్జ్ గా నేను కూడా బిజీగా ఉన్నాను. నా కెరీర్ లో ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకొంటున్నాను.

వాడి ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌నే ఆశ లేదు..
- నా కొడుకు వ‌రుణ్ తేజ్ మంచి సినిమాలు చేస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా ఉన్నాడు. ప్ర‌స్తుతం చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. కొత్త క‌థ‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. వాడి ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌నే ఆలోచ‌న నాకెప్పుడూ లేదు. భవిష్యత్ లో ఏదైనా సినిమా ప్లాన్ చేయొచ్చేమో కానీ.. ఇప్పుడైతే ఆ ఆలోచ‌న‌లు లేవు. అలాగే వాడితో క‌లిసి న‌టించే విష‌యంలో కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

హ‌ర్ట్ అయ్యాం...
- మా సినిమా రిలీజ్ కాక‌ముందే సినిమా బాలేదంటూ కొంద‌రు నెగటివ్‌గా న్యూస్ పంపుతున్నారు. ఆ విష‌యంలో నేను , అర‌వింద్‌గారు బాధ‌ప‌డ్డాం...హ‌ర్ట్ అయ్యాం. సినిమా రిలీజ్ కాక‌ముందే అలాంటి వార్త‌లు ఎలా స్ప్రెడ్ చేస్తారో అర్థం కావ‌డం లేదు.
ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ గురించి...

- వ‌క్కంతం వంశీ దాస‌రిగారి ద‌గ్గ‌ర ప‌నిచేసిన‌ప్ప‌ట్నుంచి తెలుసు. మంచి రైట‌ర్ కూడా. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మంచి ఎమోష‌న్స్‌తో ప్రేక్ష‌కుడ్ని సినిమాకి క‌నెక్ట్ చేయించ‌గ‌ల‌డు. త‌న త‌దుప‌రి సినిమా కూడా మా కాంపౌండ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.

అల్లు అర్జున్ క్యార‌క్టైజేష‌న్‌...
- బ‌న్ని ఈ సినిమాలో ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డతారు. త‌న క్యారెక్ట‌ర్‌లో ఓ నిబ‌ద్ధ‌త ఉంటుంది. త‌న పాత్ర‌లో సీరియ‌స్‌నెస్ ఉంటుంది. దాని వ‌ల్ల కూడా కామెడీ క్రియేట్ అవుతుంది.
తెలుగు సినిమా స్థాయి పెరిగింది..

- టెక్నాలజీ పెర‌గ‌డం వ‌ల్ల ప్రాంతీయ సినిమా కూడా పెద్ద స్థాయిలో ఉండాల‌ని ప్రేక్ష‌కుడు కోరుకుంటున్నాడు. అందులో త‌ప్పు లేదు. అందువ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌లు క్వాలిటీ మూవీస్ చేయాల‌నుకుంటున్నారు. భ‌విష్య‌త్‌లో ప‌ది కోట్ల లోపు బ‌డ్జెట్ సినిమాల‌కు రిలీజ్‌లు ఉండ‌క‌పోవ‌చ్చు. వారికి వేరే ఫ్లాట్ ఫామ్‌లు క్రియేట్ అవ‌తాయి. పే ఫ‌ర్ వ్యూ కాన్సెప్ట్ రావ‌చ్చు ఎలాగైనా మారొచ్చు.

- టెక్నాలజీ పెర‌గ‌డం వ‌ల్ల ప్రాంతీయ సినిమా కూడా పెద్ద స్థాయిలో ఉండాల‌ని ప్రేక్ష‌కుడు కోరుకుంటున్నాడు. అందులో త‌ప్పు లేదు. అందువ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌లు క్వాలిటీ మూవీస్ చేయాల‌నుకుంటున్నారు. భ‌విష్య‌త్‌లో ప‌ది కోట్ల లోపు బ‌డ్జెట్ సినిమాల‌కు రిలీజ్‌లు ఉండ‌క‌పోవ‌చ్చు. వారికి వేరే ఫ్లాట్ ఫామ్‌లు క్రియేట్ అవ‌తాయి. పే ఫ‌ర్ వ్యూ కాన్సెప్ట్ రావ‌చ్చు ఎలాగైనా మారొచ్చు.

ఆ ఆలోచనే లేదు..
- న్యూస్ చానెల్‌ను ఇండ‌స్ట్రీ బ్యాన్ చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కానీ మాకు ఆ ఆలోచ‌న‌లే లేదు. కేవ‌లం ఇండ‌స్ట్రీ మంచి కోసం ఎలాంటి ప‌నులు చేయాల‌ని మాత్ర‌మే చ‌ర్చించుకున్నాం.

త‌దుప‌రి చిత్రాలు...
- ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ మూవీలో ఓ స్పెష‌ల్ రోల్ చేస్తున్నాను. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాది సినిమా ప్రారంభంలో వచ్చే పాత్ర. అలాగే.. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ ఫిలిమ్ లోనూ నటిస్తున్నాను.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved