pizza
Naga Shaurya interview (Telugu) about @Nartanasala
మ‌ల్టీస్టార‌ర్ మూవీలు చేయ‌ను - నాగ‌శౌర్య‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 August 2018
Hyderabad

`ఛ‌లో` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియేష‌న్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ చిత్రం `@న‌ర్త‌న‌శాల`. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ నెల 30న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో నాగశౌర్య ఇంట‌ర్వ్యూ....

మ‌ళ్లీ డెబ్యూ డైరెక్ట‌ర్‌తోనే సినిమా ఎందుకు చేశారు?
- క‌థ న‌చ్చ‌డ‌మే అందుకు కార‌ణం. అలాగ‌ని మా బ్యాన‌ర్‌లో అంద‌రూ కొత్త ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేస్తాన‌ని కాదు.. మంచి క‌థ‌లుంటే ఎవ‌రితోనైనా సినిమా చేయ‌డానికి సిద్ధ‌మే.

టైటిల్‌కు ముందు @ పెట్ట‌డానికి కార‌ణ‌మేంటి?
- గ‌తంలో న‌ర్త‌న‌శాల అనే పేరుతో వ‌చ్చిన సినిమాలు ఆగిపోయాయ‌ని నాన్న‌గారు చెప్పారు. అందుకని టైటిల్‌కు ముందు @ అని పెట్టాం.

క‌థేంటి?
- @న‌ర్త‌న‌శాల 80 శాతం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే క‌మ‌ర్షియ‌ల్ చిత్రం. గే అయిన హీరోను ఇద్ద‌రు అమ్మాయిలు ప్రేమిస్తారు. వారెందుకు హీరోను ప్రేమిస్తార‌నేది సినిమా కాన్సెప్ట్‌గా సాగుతుంది.

గే పాత్ర‌లో కావాల‌నే న‌టిస్తారా?
- అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

interview gallery



క్యారెక్ట‌ర్ ఏంటి?
- హీరో అమ్మాయిలంద‌రూ ధైర్యంగా ఉండాల‌నే చెప్పే వ్య‌క్తి.. వారి ధైర్యంగా ఉండ‌టం ఎలా అనే దానికి సంబంధించిన ట్ర‌యినింగ్ ఇస్తుంటాడు.

సోలోగా రావ‌డం ప్ల‌స్ అవుతుంది క‌దా?
- ఓ ర‌కంగా ప్ల‌స్సే. అయితే ముందుగా శైలజారెడ్డి అల్లుడు సినిమా 31న విడుద‌ల‌వుతుంద‌న్నారు. కానీ కేర‌ళ వ‌ర‌ద‌ల కార‌ణంగా వారు సినిమా ఆల‌స్య‌మైంది.

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టిస్తారా?
- నారా రోహిత్‌తో ఉన్న అనుబంధంతో మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించాను. ఇక‌పై మ‌ల్టీస్టార‌ర్ మూవీలు చేయ‌ను.

త‌దుప‌రి చిత్రాలు?
- భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లోఓ సినిమా చేస్తున్నాను. అలాగే మా బ్యాన‌ర్‌లో ర‌మ‌ణ తేజ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved