pizza
Nanditha Raj interview about Savitri
‘సావిత్రి’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - నందిత
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2016
Hyderaba
d

నారా రోహిత్ హీరోగా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 1న విడుదలవుతుంది. ఈ సందర్బంగా హీరోయిన్ నందితతో ఇంటర్వ్యూ....

టైటిల్ విని చేయనన్నాను...
-ఈ సినిమాలో సావిత్రి అనే టైటిల్ రోల్ చేశాను. ముందు డైరెక్టర్ పవన్ సాధినేని ఫోన్ చేసి టైటిల్ చెప్పగానే ఇదేదో ఉమెన్ సెంట్రిక్ మూవీ. మనకు ఇంకా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసే స్టేజ్ రాలేదని చేయనని అన్నాను. అయితే పవన్ ఫోన్ చేసి ముందు కథ వినమన్నాడు. సరేనని విన్నాను. కథ వినగానే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అర్థమైంది.

క్యారెక్టర్..
-సినిమా అంతా సావిత్రి అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. సావిత్రి ఓ పెళ్ళిలో పుడుతుంది. చిన్నప్పటి నుండి పెళ్లంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పిచ్చి. ఇంట్లో వాళ్లు పెళ్లి కుదురుస్తారు. ఈలోపు సావిత్రి హీరో రిషికి నచ్చుతుంది. అప్పుడేమవుతుందనేదే కథ.

డబ్బింగ్ ఎందుకు వద్దంటున్నారో...
-నేను తెలుగు అమ్మాయిని, తెలుగు బాగా మాట్లాడుతున్నాను. డబ్బింగ్ కూడా చెప్పడానికి రెడీ అయితే ఎందుకు డబ్బింగ్ చెప్పడానికి వద్దంటున్నారో అర్థం కావడం లేదు.

నిజానికి నేను అపోజిట్....
-నిజ జీవితంలో నేను ఈ సినిమాలో సావిత్రి రోల్ కు ఫుల్ అపోజిట్. ఈ సినిమాలో సావిత్రియే సమస్య అయితే హీరో ఆమెకు సొల్యూషన్.

Nanditha Raj interview gallery

నారా రోహిత్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్....
-నారారోహిత్ చాలా కామ్ గా ఉంటారు. వర్క్ పరంగా చాలా ప్రొఫెషనల్. ఆయనతో వర్క్ చేయడం ఎవరికైనా సులభమే. అంతలా ఈజీ గోయింగ్ పర్సన్.

నేను ఆ విషయంలో హ్యపీయే...
-నేను చేస్తున్న సినిమాలు పరిమితమే అయినా నేను చేస్తున్న సినిమా పట్ల హ్యపీగానే ఉన్నాను.

సినిమాలు మానేస్తారని...
-ఈ సినిమా తర్వాత నేను సినిమాలు ఆపేస్తానని వినిపిస్తున్న వార్తలు అబద్ధం. నాకేం వయసు అయిపోలేదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను.

భాష తెలిసి ఉండాలి...
-నేను యాక్ట్ చేసే సినిమాలో నాకు భాష తెలిస్తేనే ఆ ఎమోషన్స్ ను క్యారీ చేయగలుగుతాం. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగుపై అవగాహనతో ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. అందుకే వేరే భాషల్లో సినిమాలు వచ్చినా వాటిపై అవగాహన లేకపోవడంతో సినిమాలు చేయడం లేదు. చాలా మంచి క్యారెక్టర్ వస్తే అప్పడు కచ్చితంగా ఆలోచిస్తాను.

ఆయనలా అనడం తప్పు...
-ఆడియో వేడుకలో బాలకృష్ణగారు అలా మాట్లాడటానికి కారణాలు తెలియలేదు కానీ ఆయన అలా మాట్లాడటం తప్పు.

తదుపరి సినిమాలు...
-ప్రస్తుతం స్క్రిప్ట్స్ వింటున్నాను. కానీ ఇంత వరకు ఏ సినిమాలు అంగీకరించలేదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved