pizza
Nandu interview
న‌టుడిగా సంతృప్తిగా ఉన్నాను - నందు
You are at idlebrain.com > news today >
Follow Us

10 December 2017
Hyderabad


భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ప్రధాన పాత్ర దారులుగా వి ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కుటుంబ కథా చిత్రం' ఈ చిత్రానికి నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్.ఈ సినిమా డిసెంబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నందు సినిమా గురించి మాట్లాడారు.

క్యారెక్ట‌ర్ గురించి..?

- సాఫ్ట్ వేర్ కుర్రాడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను.

ఏ జోన‌ర్ మూవీ?

- కుటుంబ క‌థా చిత్రం ఒక‌ ప్యూర్ థ్రిల్ల‌ర్. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగే గొడ‌వ వ‌ల్ల సినిమా థ్రిల్ల‌ర్ స్టైల్‌లో న‌డుస్తుంది.

సినిమాకు ఎంత బ‌డ్జెట్ అయ్యింది?

- సినిమాను చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లోనే పూర్తి చేశాం. క‌థ విన్న త‌ర్వాత యూనిట్ అంతా ఎగ్జయిట్ అయ్యారు. ఇలాంటి మంచి సినిమాలో భాగం కావ‌డానికి రెమ్యున‌రేష‌న్ విష‌యం ఆలోచించ‌లేదు. అదే ఎక్కువ బ‌డ్జెట్‌లో సినిమా చేస్తే, సినిమా రిలీజ్ అప్పుడు మార్కెట్ ప‌రంగా చిన్న చిన్న స‌మ‌స్య‌లుంటాయి. అదే త‌క్కువ బ‌డ్జెట్‌లో చేస్తే, ఎక్క‌డా స‌మ‌స్య ఉండ‌దు. క్వాలిటీ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ప‌క్కా ప్లానింగ్‌తో సెట్స్‌లోకి వెళ్లాం.

interview gallery

న‌టుడిగా మీ జ‌ర్నీ హ్యాపీగా ఉందా?

- సోలో హీరోగా సినిమాలు వ‌స్తున్నాయి. కానీ నాకు హ్యుజ్ హిట్ అయితే రావ‌డం లేదు. కానీ న‌టుడిగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. వ‌రుస సినిమాలు చేస్తున్నాను. అయితే క‌థ‌లో నా పాత్ర‌కు కాస్త అయినా ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు చేయ‌డానికి ఒప్పుకుంటున్నాను.

ద‌ర్శ‌కుడు వాసు గురించి?

- వాసుగారు ఈ సినిమా ద‌ర్శ‌కుడు. మంచి ప్లానింగ్ ఉన్న డైరెక్ట‌ర్. ఆయ‌న నెరేష‌న్ చేసేట‌ప్పుడే నాకు సినిమా న‌చ్చేసింది.

వెబ్ సిరీస్‌లో బిజీగా ఉన్న‌ట్లున్నారు?

- ఓ టీం ఏర్ప‌రుచుకుని ఫీచ‌ర్ ఫిలిం ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్‌లో వై నాట్ ఎ గ‌ర్ల్ అనే షార్ట్ ఫిలిం చేశాను. దీనికి మంచి అప్రిసియేష‌న్స్ కూడా వ‌చ్చాయి. ఇక ఫీచ‌ర్ ఫిలింకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాం. నాకు వెబ్ సిరీస్‌లు చేయ‌మ‌ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. టేక‌ప్ చేయాలి. వ్యూ అనే కంపెనీవారు నాకు వెబ్ సిరీస్‌లో న‌టించ‌మ‌ని కూడా ఆఫ‌ర్ ఇచ్చారు. వెబ్ సిరీస్‌లో న‌టించడం వ‌ల్ల రీచింగ్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. రానా స‌హా ప‌లువురు టాలీవుడ్ న‌టులు వెబ్ సిరీస్‌లో క‌న‌ప‌డుతున్నారు. వీటి ద్వారా ఉప‌యోగం ఉంటుందో లేదో తెలియ‌దు కానీ, న‌ష్టం మాత్రం ఉండ‌దు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved