pizza
Nara Rohit interview about Raja Cheyyi Vesthe
ప్రతి సినిమా ఒక ప్రయోగమే – నారా రోహిత్
You are at idlebrain.com > news today >
Follow Us

28 April 2016
Hyderaba
d

నారా రోహిత్ఇషా తల్వార్ జంటగా నటించిన రాజా చెయ్యి వేస్తే’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఏప్రిల్ 29న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో నారా రోహిత్ తో ఇంటర్వ్యూ....

వెయిట్ తగ్గే పనిలోనే ఉన్నాను...
బాణం తర్వాత నేనేమీ వెయిట్ ఫెరగాలని ప్లాన్ చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు వెయిట్ తగ్గే పనిలో ఉన్నాను. అయితే నా సినిమాలు గ్యాప్ లేకుండా విడుదలవుతుండటంతో వెయిట్ తగ్గినట్టు కనిపించడం లేదు. కాస్తా వెయిట్ చేస్తే వెయిట్ తగ్గుతాను. ప్రస్తుతానికి ఐదు కిలోలు తగ్గాను.

టార్గెట్ పెట్టుకోలేదు...
వరుసగా సినిమాలు చేయాలని టార్గెట్ ఏదీ పెట్టుకోలేదు. సంవత్సరానికి ఒక సినిమా చేస్తే హిట్ వస్తుందనే గ్యారంటీ లేదు కదా, కథ నచ్చితే దర్శకుడు, నిర్మాతలు కొత్త వారు అని ఆలోచించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాను. అంటే ప్రతి సినిమాను ఓ ప్రయోగంగా చేస్తున్నాను.

కొంత నిరుత్సాహపడ్డాను...
తుంటరిసావిత్రి రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. నేనేదో ఐదు కోట్ల సినిమా చేసి పదిహేను కోట్లు వచ్చేయాలనుకోను. మన పెట్టుబడికి తగినంత వస్తే చాలనుకుంటాను. ఆ విషయంలో తుంటరి నిర్మాతలు చాలా హ్యపీ కాబట్టి నేను కూడా హ్యపీయే. అయితే సావిత్రి సినిమా మాత్రం మేం అనుకున్న మేర సక్సెస్ సాధించలేదు. ఆ విషయంలో కాస్తా నిరుత్సాహపడ్డాను. అయితే ఆ సినిమాలో ఎక్కడ మిస్ ఫైర్ అయిందో తెలియలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను.

కథను నమ్మి చేశాను...
రాజా చెయ్యి వేస్తే చిత్ర కథను సింగిల్ లైన్ లో చెప్పాలంటే రెగ్యులర్ కథే కదా అనిపిస్తుంది. అయితే చాలా మంచి స్క్రీన్ ప్లే. దర్శకుడు కథ చెప్పే స్టయిల్ నన్ను ఎంగేజ్ చేసింది. తన నెరేషన్ నచ్చింది. నేను సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

Nara Rohit interview gallery

క్యారెక్టర్ గురించి...
రాజా చెయ్యి వేస్తే చిత్రంలో రాజారాం అనే యువకుడిగా కనపడతాను. డైరెక్టర్ కావాలనుకునే అసిస్టెంట్ డైరెక్టర్ రోల్. నా క్యారెక్టర్ ను చాలా థ్రిల్లింగ్ గా డిజైన్ చేశారు.

ప్రదీప్ చిలుకూరితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్...
ప్రదీప్ చిలుకూరి కొత్త దర్శకుడైనా టెక్నికల్ గా తను స్ట్రాంగ్ గా ఉన్నాడు. తనకు ఏం కావాలో ఆ విషయంపై క్లారిటీతో ఉన్నాడు. తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చేవరకు వదిలిపెట్టడు.

టైటిల్ పెట్టడానికి కారణం....
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు రాజారాం. ఓ పాపులర్ సాంగ్ ఉండటంతో క్యాచీ ఉంటుందనే కారణంతోనే రాజా చెయ్యివేస్తే అనే టైటిల్ పెట్టాం.

తారకరత్న తో వర్క్ చేయడం గురించి....
తారకరత్న ఈ సినిమాలో విలన్ గా చేయడంతో సినిమాకు హైప్ వచ్చింది. సినిమాకు ముందు మా మధ్య పరిచయం ఉండేది కానీ ఈ సినిమాతో మంచి రిలేషన్ ఏర్పడింది.

తదుపరి చిత్రాల ప్రోగ్రెస్....
ప్రస్తుతం జ్యో అచ్యుతానంద సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇది ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించిన కథ. అలాగే కథలో రాజకుమారి సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారు. అల్రెడి మూడు సాంగ్స్ చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. అప్పట్లో ఒకడుండేవాడు షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాం. పండగలా వచ్చాడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జూన్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved