pizza
Nara Rohit interview about Tuntari
ఇప్పటి వరకు నేను చేయని డిఫరెంట్ జోనర్ మూవీ ‘తుంటరి’ - నారారోహిత్

You are at idlebrain.com > news today >
Follow Us

07 March 2016
Hyderaba
d


నారారోహిత్ హీరోగా శ్రీ కీర్తి ఫిలింస్ బ్యానర్ పై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా, నాగార్జున్ నిర్మించిన చిత్రం ‘తుంటరి’. ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో నారారోహిత్ మాట్లాడుతూ ...

నేను చేయని జోనర్...
-‘తుంటరి’ తమిళ చిత్రం ‘మాన్ కరాటే’కు రీమేక్ గా రూపొందింది. కామెడిఎంటర్ టైనర్. ఇప్పటి వరకు నేను ట్రై చేయని జోనర్. కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్ నచ్చడంతోనే రీమేక్ లో నటించాను. దాదాపు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఎక్కడా కన్ ఫ్యూజన్ కాలేదు. ఎందుకంటే ప్రతి సినిమలో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండటం, డైరెక్టర్ తో మంచి ర్యాపో ఉండటంతో ఎక్కడా కన్ ఫ్యూజన్ లేకుండా చేస్తున్నాను.

అన్నీ కుదరాలి....
సమ్మర్ కు అన్నీ సినిమాలు విడుదల అయ్యేలా కుదురుతూ వస్తున్నాయి. సినిమా అన్న తర్వాత అన్నీ అంశాలు కుదరాలి. అప్పుడే ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఈ సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ కు వున్నాయి. ఇప్పుడు ‘తుంటరి’ విడుదలవుతుంది. 25న సావిత్రి విడుదలవుతుంది. అయితే రెండు సినిమాల రిలీజ్ కు మధ్య గ్యాప్ ఉంది. అలాగే రెండు డిఫరెంట్ జోనర్ మూవీస్.

బాక్సింగ్ నేపథ్యంలో.....
ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే సాగదు. సినిమాలో బాక్సింగ్ అనేది చిన్న పార్ట్ లా ఉంటుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. కథకు తగిన విధంగా డైలాగ్ డిక్షన్ ఉండేలా ప్లాన్ చేసుకుని సినిమాను చేశాం. బాక్సింగ్ సినిమా కానప్పటికీ బాక్సింగ్ రింగ్ లో ఎలా స్టాండిగ్ కావాలనేటువంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ తీసుకున్నాను. మంచి ఎంటర్ టైనర్.

సక్సెస్ బట్టి అంచనా వేయలేం...
కమార్ నాగేంద్ర తొలి సినిమా ‘గుండెల్లో గోదారి’ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. అయితే రెండో చిత్రం ‘జోరు’ వర్కవుట్ కాలేదంతే. అంత మాత్రాన సినిమా ఫెయిల్యూర్ ను బట్టి దర్శకుడుని అంచనా వేయలేం కదా.

తమిళ మాతృక కంటే...

నేను తుంటరి తమిళ మాతృక ‘మాన్ కరాటే’ చూడలేదు. మంచి కమర్షియల్ ఫిలిం అని విన్నాను. స్క్రిప్ట్ వినగానే నచ్చింది. తమిళంతో పోల్చితే తెలుగులో లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తమిళంలోని చిన్న పోజ్ ను తీసుకున్నాం. మెయిన్ పాయింట్ అక్కడిదే అయినా మనకు తగిన విధంగా చాలా మార్పులను చేసుకుంటూ వచ్చాం.

 

Nara Rohit interview gallery

సీఎం అయినంత మాత్రాన....
పెద్దనాన్నగారు సీఎం అయినంత మాత్రాన సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. నిజంగా అలా అనుకుంటే రాజమౌళి వంటి పెద్ద దర్శకులతోనే చేయవచ్చు కదా.

సన్నబడే ప్రయత్నం.....
సిక్స్ ప్యాక్ వస్తే నేను షర్ట్ తీస్తాను. లేదంటే లేదని ఇంతకుముందే చెప్పాను. జూన్ నుండి చేయబోయే సినిమా కోసం సన్నబడాల్సి ఉంటుంది. అలా సన్నబడితేనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాకు నేను కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ‘రాజాచెయ్యివేస్తే’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా కంప్లీట్ అయ్యింది. మే చివరకు ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి కొత్త సినిమా కోసం సన్నబడతాను.

తమిళ్ లో ...
తమిళనాడులో 13 సంవత్సరాలు చదువుకున్నాను. వీలైతే తమిళ్ లో సినిమా చేయాలనుకుంటున్నాను. నాకు తమిళం బాగా వచ్చు.

దర్శకుడు గురించి....
కుమార్ నాగేంద్ర మంచి టెక్నిషియన్. సినిమాను చక్కగా తెరకెక్కించాడు. తమిళం కంటే ఎమోషనల్ గా ఉండేలా సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా అంతా ఫన్నీగా సాగుతుంది. నా గత చిత్రాలతో పోల్చితే డ్యాన్స్ కూడా చేశాను.

ఈ ఏడాది పెళ్ళి చేసుకోను....
ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఈ ఏడాది పెళ్లి ఉండకపోవచ్చు. బాలకృష్ణగారి సినిమా చేస్తానో లేదో చెప్పలేను. చెయ్యాలంటే తప్పకుండా చేస్తాను. బాలకృష్ణగారితో చిన్నప్పటి నుండి మంచి రిలేషన్ ఉంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
‘శంకర్’ రిలీజ్ గురించి నిర్మాతకే తెలియాలి. ఎప్పుడూ గ్యాప్ చూసుకుని రిలీజ్ చేస్తాడో చూడాలి. అలాగే ‘పండగలా వచ్చాడు’ కొన్ని రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. వచ్చే నెలలో అది కూడా పూర్తి చేసేస్తాను. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ పూర్తయ్యింది. అలాగే నేను, శ్రీవిష్ణు కలిసి చేస్తున్న ‘నీది నాది ఒకటే కథ’ కూడా జూన్, జూలైలో విడుదలవుతుంది. అల్రెడి ఆరు స్క్రిప్ట్స్ ను ఓకే చేశాను. నేను కాంబినేషన్ కంటే స్క్రిప్ట్ కు వాల్యూ ఇస్తాను.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved