pizza
Narasimha Nandi interview about Lajja success
`మైదానం` స్ఫూర్తితో `లజ్జ‌` తీశా! -నరసింహ నంది
You are at idlebrain.com > news today >
Follow Us

9 February 2016
Hyderaba
d

న‌ర‌సింహ నంది ఆలోచ‌న‌లు కొత్త‌గా ఉంటాయి. లోకమంతా ఒక వైపు ఉంటే అత‌ను మాత్రం మ‌రో వైపు ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అత‌ని సినిమాల‌కు ట్రెండ్‌తో ప‌నిలేదు. మ‌న సాహిత్యంలో ఉన్న ఆణిముత్యాల‌ను ఏరాల‌నుకుంటాడు. వాటి నుంచి స్ఫూర్తి పొందుతుంటాడు. మ‌గువ‌ల మ‌న‌సుల లోలోతుల్ని స్పృశించాల‌ని ఉబ‌లాట‌ప‌డ‌తాడు న‌ర‌సింహ నంది. అందుకే అత‌ని ఆలోచ‌న‌లే అత‌ని సినిమాల్లో క‌నిపిస్తాయి. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన సినిమా ల‌జ్జ‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా గురించి ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ల‌జ్జ గురించి చెప్పండి?
- ఆలోచించే వాళ్ళ‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను చేశాను. కొత్త క‌థ‌లు అస‌లు రావ‌ట్లేదు అంటుంటారు క‌దా. అలాంటి మాట‌ల‌కు స‌మాధానం ల‌జ్జ‌.

* మీ సినిమాల‌కు టార్గెట్ ఆడియ‌న్స్ ఎవ‌రు?
- ఇంగ్లిష్ సినిమాల‌ను ఎక్కువ‌గా చూసేవారు, బాగా చ‌దువుకున్న వారు, మంచి ఆలోచ‌నా ప‌రులు. వీళ్ళే నా టార్గెట్స్. కేవ‌లం నాలుగు ఫైట్లు, నాలుగు పాట‌లు ఉండే రెగ్యుల‌ర్ సినిమాల‌ను చేయ‌డం నాకిష్టం ఉండ‌దు. అందుకే నా టార్గెట్ ఆడియ‌న్స్ వారు కాలేరు.

* మీ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ హిట్ అవుతాయ‌ని అనిపిస్తుందా?
- నా దృష్టిలో కమర్షియల్ హిట్ అంటే మ‌నం పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రావ‌డ‌మే. ల‌జ్జ క‌మ‌ర్షియ‌ల్ హిట్టే. ఎందుకంటే చాలా త‌క్కువ పెట్టుబ‌డితో సినిమా చేశాం. తీసిన మేం, కొన్న వారూ సంతోషంగా ఉన్నారు. ఇది వరకు బాలచందర్, బాపు, భారతీరాజా తక్కువ బడ్జెట్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు. అలానే మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్ర‌మిది. తక్కువ బడ్జెట్ లో బాగా ప్రెజంట్ చేయడానికి ట్రై చేశాం.

* అవార్డుల‌ను ఆశించి తీస్తారా?
- అవార్డుల క‌న్నా ప్రేక్ష‌కులు సినిమా చూస్తార‌నే భావ‌నే ముందుకు న‌డిపిస్తుంది. సినిమా మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆ క‌థ ప్రేక్ష‌కుల‌కి ఎలా న‌చ్చుతుందా? అనే ఆలోచిస్తుంటా. సినిమా నా చేతిలో ఉన్నంత వ‌ర‌కు అన్ని విధాలా ఉన్న‌తంగానే తీర్చిదిద్దుతా. కానీ థియేట‌ర్లు అనేవి నా చేతిలో పని కాదు. మ‌ల్టీప్లెక్స్ లో సినిమాను విడుద‌ల చేయ‌లేక‌పోయాం. చేస్తే బావుండేది.

* మీ సినిమాకు ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది?
- చాలా మం చి రెస్పాన్స్ వస్తోంది. పెళ్ళికి ముందు అమ్మాయి తప్పు చేసిందంటే అది తండ్రి పొరపాటు. పెళ్ళైన తరువాత తప్పు చేస్తే అది ఆమె భ‌ర్త చేసిన తప్పు వ‌ల్లేన‌ని అనాలి. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవల వలన జీవితాలు నాశనమైపోతున్నాయి. ఓ అమ్మాయి భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో ఆమెకు ఓ వ్య‌క్తి ప‌రిచ‌య‌మ‌వుతాడు. అత‌నితో జీవితాన్ని గ‌డ‌పాల‌ని అనుకుంటుంది. అయితే అక్క‌డ కూడా ఆనందంగా ఉండ‌లేదు. అలాంటి అమ్మాయి జీవితం చివ‌రికి ఎలాంటి మ‌లుపు తిరిగింది? అనేదే మా ల‌జ్జ సినిమా. ఇందులో స‌మాజంలో ఉన్న ఆధిప‌త్యాన్ని ప్ర‌స్తావించా.

* ఈ సినిమాకు స్ఫూర్తి ఏంటి?
- చ‌లంగారి మైదానం న‌వ‌లే ఈ సినిమాకు స్ఫూర్తి.

* బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను చేస్తున్నార‌ని వార్త‌లొచ్చాయి?
- ఈ సినిమా కంటెంట్ న‌చ్చి ఒక‌రు అడిగిన మాట వాస్త‌వ‌మే. కానీ ఇలాంటి బోల్డ్ స‌బ్జెక్ట్ లు, కంటెంట్ ఉన్న సినిమాల‌ను ప‌దే ప‌దే చేయ‌లేం. ఈ సినిమా నా రెండేళ్ళ క‌ష్టం.

* మీ బుడ్డారెడ్డి ప‌ల్లి బ్రేకింగ్ న్యూస్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
- షూటింగ్ పూర్త‌యింది. ఓ గేదెకు సంబంధించిన క‌థ ఇది. పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. ఇంకో మూడు నెల‌ల్లో సినిమాను విడుద‌ల చేస్తాం.

 



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved