pizza
Niharika interview about Oka Manasu
అభిమానులను ఇబ్బంది పెట్టే పాత్రలను మాత్రం చేయను – నిహారిక కొణిదెల
You are at idlebrain.com > news today >
Follow Us

19 June 2016
Hyderaba
d

మెగాస్టార్‌ చిరంజీవి నట వారసులుగా హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే తొలిసారి మెగా వారసురాలిగామెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక 'ఒక మనసుచిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. నాగశౌర్యనిహారిక జంటగా టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రామరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒక మనసు'. జూన్‌ 24న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా కొణిదెల నిహారిక సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నిహారిక మాట్లాడుతూ .....

ఆసక్తిగా ఉంది...
- సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. టెన్షన్‌గా అనిపించడం లేదు కానీ ఆడియెన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారోఅవుట్‌పుట్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

చాలా కథలు విన్నా....
- నేను హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయాలనుకోగానే చాలా కథలు విన్నాను. అయితే అవేవీ కనెక్ట్‌ కాలేదనే చెప్పాలి. అయితే ఒక మనసు చిత్రంలో సంధ్య అనే క్యారెక్టర్‌ వినగానే మనసుకు బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా డెప్త్‌ ఉన్న క్యారెక్టర్‌ ఇది. నా ఫ్యామిలీఅభిమానులు సహా అందరికీ నచ్చే పాత్రలో కనపడతాను.

అందరూ ఒప్పుకున్నారు...
- నా కంటే ముందు వేరే ఫ్యామిలీస్‌ నుండి హీరోయిన్స్‌ వచ్చారు. అయితే వారు హీరోయిన్స్‌ గా కంటిన్యూ కాలేకపోయారు. ఇక నా విషయానికి వస్తే నేను చాలా రోజులుగా సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. అయితే హీరోయిన్‌ కావడానికి కంటే ముందు ప్రొడక్షన్‌ అంటే ఆసక్తి ఏర్పడింది. ప్రొడక్షన్‌ వ్యవహారాలను గమినిస్తూ వచ్చాను. తర్వాత నేను యాక్టింగ్‌ కూడా చేయవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. నాన్నగారికి ఈ విషయాన్ని చెప్పాను. ఆయన ఆలోచించుకుని సరే అన్నారు. తర్వాత పెద్దనాన్నగారుబాబాయ్‌అన్నయ్యలు ఇలా అందరితో మాట్లాడాను. అందరూ సినిమాల్లోకి వస్తే ఉండే ప్లస్‌ ఏంటిమైనస్‌లేంటి అనే విషయాలపై నాతో మాట్లాడారు. అందరూ ఒప్పుకున్న తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను.

ఆ రెండు సినిమాల తర్వాత మా సినిమాయే...
'ఒక మనసుప్యూర్‌ లవ్‌ స్టోరీ. సాధారణంగా లవ్‌ స్టోరీస్‌ అంటే మరోచరిత్ర’, ‘గీతాంజలి చిత్రాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు. నేను మరో చరిత్ర సినిమా చూడలేదు. అయితే గీతాంజలి సినిమా చూశాను. ఈ రెండు సినిమాలు తర్వాత ఒకమనసు సినిమాను గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇటువంటి లవ్‌స్టోరీ ఎక్కడా రాలేదనే గట్టిగా చెప్పగలను.

Niharika interview gallery

ఎబ్బెట్టుగా ఉండే లవ్‌స్టోరీ కాదు..
ఒక మనసు చిత్రం 80 శాతం సంధ్యసూర్యలపై నడుస్తుంది. సంధ్య అనే పాత్ర చాలా ప్రభావం చూపుతుంది. అమ్మాయంటే ఇలా ఉండాలనేలా ఉంటుంది. ఈ సినిమా లవ్‌స్టోరీ కదా అని ఎక్కడా ఎబ్బెట్టుగా ఉండదు.

అభిమానులు అర్థం చేసుకున్నారు...
- నేను సినిమాల్లోకి వస్తున్నానని తెలియగానే అభిమానులు వచ్చి నాన్నను కలిసి మాట్లాడారు. నాన్న కూడా వారితో నన్ను మాట్లాడించారు. ఇంత కాలం పెద్దనాన్నను అన్నయ్యగా భావించిన అభిమానులకు ఆయన కూతురుగా నేను ఇండస్ట్రీలోకి వస్తున్నానంటే వారి సొంత అమ్మాయిలా ఫీలయ్యారు. సినిమా అంటే గ్లామర్‌ ఫీల్డ్‌ కాబట్టి ఎలా ఉంటుందోనని భయపడ్డారేమోనని కూడా అనుకోవచ్చు. కానీ నేను వారికి వివరంగా చెప్పాను. అలా చెప్పిన తర్వాత వారు నటన పట్ల నా ఫ్యాషన్‌ అని అర్థం చేసుకున్నారు. నాకు అండగా నిలబడతామన్నారు.

కథ వినేటప్పుడు అవేం ఆలోచించలేదు...
- కథను నేను ఏం ఆలోచనలు లేకుండా విన్నాను. రామరాజుగారు చెప్పిన కథఅందులో హీరోయిన్‌ సంధ్య క్యారెక్టరైజేషన్‌ బాగా నచ్చింది. దాంతో సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను. అంతే తప్ప ఆయన మొదటి సినిమా ఎంటిఆయన కమర్షియల్‌ డైరెక్టరా అని ఆలోచించలేదు.

టాలెంట్‌ అవసరం...
- మా పెద్దనాన్నగారి కున్న ఇమేజ్‌ వల్ల నా మొదటి సినిమా గురించి ఇంత అటెన్షన్‌ ఉంది. నా రెండో సినిమాకు ఇంత అటెన్షన్‌ ఉండదు. అలాగే అభిమానులు కూడా మొదటి సినిమా ఎలా చేశానని చూస్తారు. నేను సరిగా యాక్టింగ్‌ చేయకపోతే నా రెండో సినిమాకు రారు. అంతెందుకు సినిమా బాలేకపోతే మా సొంత అన్నయ్య సినిమానే నేను రెండో సారి చూడను. మరి అభిమానులెందుకు బాలేకపోయినా చూస్తారు. నా టాలెంట్‌తోనే నేను వారిని థియేటర్స్‌కు రప్పించాల్సి ఉంటుంది.

కథల ఎంపికలో రెండు విషయాలు...
- నేను గ్లామర్‌ పాత్రలు చేయడానికి ఇష్టపడటం లేదు. అలాంటి పాత్రలు చేయడానికి నేను ఆసక్తిగా కూడా లేను. నేను కథలను ఎంపిక చేసుకునేటప్పుడు నాన్నగారినిమెగా అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఎంపిక చేసుకుంటాను. ఎందుకంటే అభిమానులు నన్ను నమ్మి నాకు సపోర్ట్‌ చేస్తున్నారు. అభిమానులను ఇబ్బంది పెట్టే పాత్రలను మాత్రం చేయను.

అదెంత కష్టమో నాకు తెలుసు...
- మెగా వారసురాలు అనే బాధ్యతను నేను అడగకపోయినా నాకు అభిమానులు ఇవ్వకుండా ఉంటారాఅయితే మెగా అనే పదం చాలా ప్రెస్టిజియస్‌. పెద్దనాన్న చిరంజీవిగారు ఆ పదం కోసం ఒక రాత్రి కష్టపడిపోలేదు. ఆయనెంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆ బాధ్యతను తీసుకోవడం అంత సులభం కాదు.

కెరీర్‌ లాంగ్‌ రన్‌...
- క్వాంటిటీ కంటే క్వాలిటీ చూసుకుంటాను. ఎన్ని సినిమాలు చేశామనడం కంటే ఎంత మంచి సినిమాలు చేశామనేది కూడా ముఖ్యం కదా. అలాగే నేను తెలుగు సినిమాలకే పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగుతో పాటు మలయాళంకన్నడతమిళ్‌ సహా మంచి పాత్రలు వస్తే ఏ భాషలో అయినా నటిస్తాను.

పెద్దనాన్న కాకుండా...
- నేను సినిమాలు చూస్తాను కానీమా ఫ్యామిలీ హీరోస్‌ సినిమాలనే ఎక్కువగా చూశాను. ఇక మా ఫ్యామిలీ హీరోస్‌ సినిమాలు కాకుండా కమల్‌హాసన్‌గారు నటించిన సినిమాలంటే ఇష్టం. బాలీవుడ్‌ కాజోల్‌ అంటే నాకు ఇష్టం.

రోల్‌ మోడల్‌...
- హీరోయిన్‌గా రోల్‌ మోడల్‌ ఎవరు అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. హీరో అయినా, హీరోయిన్‌ అంటే నటించాలి. అంటే కాబట్టి నటన పరంగా నాకు రోల్‌మోడల్‌ అంటే పెద్ద నాన్న చిరంజీవిగారే.

దర్శకుడు రామరాజుహీరో నాగశౌర్య గురించి....
- రామరాజుగారు చాలా ఇష్టంతో రాసుకున్న కథ ఒక మనసు. ఆయన డైరెక్షన్‌లో చేయడం చాలా కంఫర్ట్‌ బుల్‌గా అనిపించింది. అలాగే నాగశౌర్య మంచి కో స్టార్‌. కొన్ని సన్నివేశాల్లో నటన పరంగా బాగా సపోర్ట్‌ చేశాడు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved