pizza
Nithin interview (Telugu) about Chal Mohan Ranga
`ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` ఫ్యామిలీ ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిసిన హ్యాపీ మూవీ - నితిన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2018
Hyderabad

నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో నితిన్ ఇంటర్వ్యూ...

ముందుగానే అనుకున్నది...
‘లై’ సినిమా షూటింగ్ సమ‌యంలోనే ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా చేయాలని నేను, త్రివిక్రమ్‌గారు, కృష్ణైచెతన్య అనుకున్నాం. యాక్షన్ సినిమా తర్వాత రొమాంటిక్ కామెడీ సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాను. కాబట్టే ఈ సినిమా చేయుడానికి ఆసక్తి చూపాను. కథ, క్యారెక్టర్స్ ఎలా ఉండాలి.. ఎలా ట్రావెల్ అవుతాయి.. ఇలా అన్ని త్రివిక్రమ్‌గారి ఆలోచనల నుండి వచ్చినవే. దాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణ చైతన్య ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు. త్రివిక్రమ్‌గారు బిజీగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఆయన అనుకున్న కథ పాత బడిపోతుంది. కాబట్టి వేరే దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు. ఎవరితో డైరెక్ట్ చేస్తే బావుందనే డిస్కషన్ వచ్చింది. అప్పుడు త్రివిక్రమ్‌గారికి కృష్ణ చైతన్య గుర్తుకు వచ్చాడు. ఎందుకంటే తను డైరెక్ట్ చేసిన ‘రౌడీ ఫెలో’ సినిమా బాగా నచ్చింది. కాబట్టి తనైతే బావుంటుందని త్రివిక్రమ్‌గారు కృష్ణ చైతన్యకి కథ చెప్పారు. తనకి కూడా కథ నచ్చింది. అలా సినిమా స్టార్ట్ అయ్యింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా అవెురికాలో జరుగుతుంది. సెకండాఫ్ అంతా ఊటీ, కూర్గ్‌లో జరుగుతుంది.

ఫన్నీ క్యారెక్టర్...?
- ఇందులో నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా తర్వాత ఆ రేంజ్ కామెడీ మరో సినిమాలో నేను చేయలేదు. అయితే ఈ సినిమాలో కావెుడీ దాన్ని మించి ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు హీరో పాత్ర నవ్వుతూ.. అందరినీ వాడేసుకుంటూ... నవ్విస్తుంటుంది. చివరి ఐదారు నిమిషాలు మంచి ఫీల్‌తో ఉంటుంది. మొత్తంగా సినిమా హ్యాపీ మూవీ. త్రివిక్రమ్ గారి స్టైల్లో ఉండే డైలాగ్ డెలివరీతో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. యు.ఎస్‌కు ఎలాగైనా వెళ్లాలనుకునే హీరోకి మూడు సార్లు వీసా రిజక్ట్ అవుతుంది. నాలుగోసారి విచిత్రైమెన పరిస్థితుల్లో వీసా వచ్చేస్తుంది. ఆ సందర్భంలో పెద్ద పులి పాట వస్తుంది. ఇందులో హీరో బిల్డప్ ఉంటుంది. కానీ.. హీరోకి అంత సీన్ ఉండదని ప్రేక్షకుడికి తెలుస్తుంటుంది. మరి యు.ఎస్. వెళ్లిన హీరోకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయునేదే సినిమా. సినిమాలో నా పేరు ‘మోహన్ రంగ’. హీరో క్యారెక్టర్‌లో ఉండే జోష్ వల్ల ఛల్ మోహన్ రంగ’ అనే టైటిల్‌ను పెట్టారు.

ఆయనే నిర్మాతగా ఉంటానన్నారు...
- త్రివిక్రవ్‌ుగారు, నేను ఓరోజు పవన్‌కల్యాణ్‌గారిని కలిసి ‘నేను, నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డిగారితో కలిసి సినిమా నిర్మించబోతున్నాను. కథ నాదే’ అని అన్నారు. ‘అదేంటి మీరు మాత్రమే నిర్మాతలుగా ఎందుకుండాలి? నేను కూడా నిర్మాతగా ఉంటాను’ అని పవన్‌కల్యాణ్‌గారు అన్నారు. దాంతో మేం షాకయ్యాం. నా 25వ సినిమాకు త్రివిక్రమ్‌గారు స్టోరీ లైన్ ఇవ్వడం.. నిర్మాతగా సినిమా చేస్తాననడం గొప్ప విషయం. అలాంటిది నేను ఆరాధించే వ్యక్తి (పవన్‌కల్యాణ్) నిర్మాతగా చేస్తానని ముందుకు రావడం ఆనందంగా ఉంది.

పవన్ నటించలేదు...
- పవన్ కల్యాణ్‌గారు ఇందులో ఉండరు.. కానీ ఉంటారు. ఆయన సినిమాను నిర్మించడమే నాకు ఎక్కువ. అంతే కానీ ఆయన ఈ సినిమాలో ఎటువంటి అతిథి పాత్రలో నటించలేదు. పవన్‌కల్యాణ్‌గారు రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశం వేరు. ఆయన తప్పకుండా సమాజానికి ఏదో ఒక మంచి చేస్తారని అనుకుంటున్నాను. నేను పాలిటిక్స్‌లో వచ్చి ఏం చేస్తాను.

interview gallery




సరైన రిలీజ్ డేట్ కాదు...
- ‘లై’ సినిమా సరైన సవుయంలో రిలీజ్ కాలేదు. ఇంటెలెక్చువల్ మూవీ. ఆ సినిమా రిలీజ్ అయ్యే సమ‌యంలో ఎక్కువ సినిమాలు రావడం వైునస్‌గా మారింది. ఇప్పుడు మంచి కాంపీటీషన్ ఏర్పడింది. ఒకప్పుడు ఇంత కాంపీటీషన్ లేదు. ప్రతి ఏడాది ఓ హిట్ కచ్చితంగా ఇవ్వాల్సిందే.

పెళ్లి గురించి...
- పెళ్లి చేసుకోమని ఇంట్లో అమ్మనాన్నలు గోల పెట్టేస్తున్నారు. నేను ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఒకేసారి రెండు సినిమాలు...
- 2003లో దిల్‌రాజుగారితో దిల్ సినిమా చేసిన తర్వాత మరో సినిమా చేయుడానికి చాలా ప్రయుత్నాలు జరిగాయి. అయితే మా మధ్య ఉన్న వారు పుల్లలు పెట్టారు. అవన్నీ క్లియర్ కావడానికి కాస్త సమయం పట్టింది. ఇప్పుడు దిల్‌రాజుగారి బ్యానర్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను.

తదుపరి చిత్రాలు
- దిల్‌రాజుగారి బ్యానర్లో చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ జూలై 24న విడుదలవుతుంది. తర్వాత హరీశ్ శంకర్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయుబోతున్నాను. అది జూన్ లేదా జూలైలో స్టార్ట్ అవుతుంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయుబోతున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved