pizza
Nithya Menen interview (Telugu) about Awe
క‌థ‌ను న‌మ్మే `అ!` సినిమా చేశాను - నిత్యామీన‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

19 February 2018
Hyderabad

నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'అ!'. కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, నిత్యామీనన్‌, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు నటించారు. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపిరినేని నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా నిత్యామీన‌న్ మాట్లాడుతూ ``ప్రశాంత్‌ ఈ కథ చెప్పగానే ఎగ్జయిట్‌ అయ్యాను. ఇందులో నటించిన పాత్రలన్నింటినీ డిఫరెంట్‌గా డిజైన్‌ చేశారు దర్శకుడు ప్రశాంత్‌. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే అనుకుంటాం. దీని వల్ల కెరీర్‌ ఏమైపోతుందనే ఆలోచనే లేదు. డిఫరెంట్‌ ఎడ్జ్‌ రోల్స్‌ చేయడం ఇష్టం. లేకుంటే బోర్‌ కొట్టేస్తుంది. మా హీరో నాని ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమాలో అందరూ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కోసమే చేశారు. కథ అందరికీ బాగా నచ్చింది. నేను కూడా అంతే కథను నమ్మే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. రెండోసారి ప్రశాంత్‌ నన్ను కలిసినప్పుడు నానియే ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్నారని చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. ముందు రాధ క్యారెక్టర్‌ కానీ లేదా కృష్ణవేణి క్యారెక్టర్‌ కానీ చేయమని అన్నారు. నేను కృష్ణవేణి క్యారెక్టర్‌ చేయడానికి రెడీ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎలా చేస్తామోనని అనుకున్నాను. స్క్రీన్‌ టైం ఎంత ఉంటుందో అని కూడా ఆలోచించలేదు. ఎలాంటి సినిమా చేస్తున్నాను. వాళ్ల ఇన్‌టెన్షన్‌ ఏంటి? అనే ఆలోచిస్తాను. కాంచనలో గంగ పాత్ర చేసేటప్పుడు నాకు కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాత్ర విషయానికి వస్తే.. ఛాలెంజింగ్‌గా అనిపించింది కానీ.. అంత ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం నాకే వచ్చింది కానీ.. అది వర్కవుట్‌ కాలేదు. నాకు సినిమా స్క్రిప్ట్‌ బాగా నచ్చితే కేవలం నటిగానే కాకుండా నా వల్ల ఎంత సపోర్ట్‌ అవసరమో అంత సపోర్ట్‌ చేస్తాను. ఇప్పుడు 'ప్రాణ' సినిమా చేశాను. దీన్ని నాలుగు భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు కాబట్టి.. రైటింట్‌ సైడ్‌ కూడా నేను సహకారం అందించాను. భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం చేస్తాను. కానీ ప్రొడక్షన్‌ చేయను. తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి ప్రేక్షకుల కోసం కొత్త తరహా సినిమాలు చేయాలి. తెలుగు సినిమాల్లో విప్లవం రావాలని కోరుకుంటున్నాను. 'అ!' సినిమా ఇలాంటి కొత్తదనానికి చిన్న దారి చూపించింది. నేను ఏదైనా పాత్ర చేసేటప్పుడు.. అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆలోచించే ఒప్పుకుంటాను. 'ప్రాణ' అనే సినిమాను నాలుగు భాషల్లో చేస్తున్నాం. అందులో ఒకే ఒక పాత్ర మాత్రమే కనపడుతుంది. సింక్‌ సౌండ్‌లో సినిమాను చేస్తున్నాం. కేరళలోని హిల్‌ స్టేషన్‌లో సినిమా నడుస్తుంది. నాలుగు భాషలను వేర్వేరుగా చేశాను. ఈ సినిమాను 23 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం.

interview gallery



 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved