pizza
Nithya Shetty interview (Telugu) about O Pitta Katha
*ఓ పిట్టకథలో వెంకటలక్ష్మి పాత్రకు మంచి గుర్తింపు లభిస్తోంది - హీరోయిన్ నిత్యా శెట్టి*
You are at idlebrain.com > news today >
Follow Us

8 March 2020
Hyderabad


విశ్వంత్‌, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, నిత్యా శెట్టి హీోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ ఓ పిట్ట కథ ‘ . ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీల‌క పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా ప్రదర్షింపబబడుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిత్యా శెట్టి ఇంటర్వ్యూ...

నేను తెలుగమ్మాయిని చదువు మొత్తం హైదరాబాద్ లో పూర్తి చేశాను. సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను, అంజి , దేవుళ్ళు, సినిమా తరువాత రామానాయుడు గారి హరివిల్లు సినిమా చేశాను. ఆ సినిమా తరువాత హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేశాను. ఓ పిట్టకథ సినిమా కథ విని ఈ సినిమా చేశాను. ఆడియన్స్ నుండి మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఓ మాంచి సినిమాలో నటించిన తృప్తి ఉంది.

నేను హీరోయిన్ గ్లామర్ రోల్స్ చెయ్యలేదు, చేసిన పాత్రలు అన్ని నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కు దగ్గరగా ఉన్నవి, అలాంటి పాత్రే నేను ఓ పిట్టకథ సినిమలో చేశాను. డైరెక్టర్ చందు ముద్దు తాను అనుకున్న పాయింట్ ను అనుకున్నట్లు తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. భవ్య క్రియేషన్ ఆనంద్ గారు సినిమాను బాగా తియ్యడంతో పాటు బాగా ప్రమోట్ చేశారు. అందువల్లే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

నేను కూచిపూడి డాన్సర్ ని డైరెక్టర్ చందు గారు వెంకటలక్ష్మి పాత్ర నాకు చెప్పినప్పుడు బాగా ఇష్టపడ్డాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మూవీ చూసి బాగుందని చెప్తుంటే సంతోషంగా ఉంది.

తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నాను, తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంటర్వ్యూ ముగించారు.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved