pizza
Pa. Ranjith interview about Kabali
ర‌జ‌నీకాంత్‌గారు పిలిచి అవ‌కాశం ఇచ్చారు - పా.రంజిత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 June 2016
Hyderaba
d

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం `కబాలి`. రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్ గా నటించారు. సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధం కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఆదివారం పాత్రికేయుల‌తో క‌బాలి సినిమా విశేషాల‌ను మాట్లాడారు...

ఊహించ‌ని రెస్పాన్స్‌...
- తెలుగు, త‌మిళంలో ఒకేరోజున క‌బాలి సినిమా విడుద‌ల కానుంది. టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్ కు తెలుగు, త‌మిళ ఆడియెన్స్ నుండి వ‌చ్చిన రెస్పాన్స్ రియ‌ల్లీ సూప‌ర్బ్‌. ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల నుండి ఇలాంటి హ్యుజ్ రెస్పాన్స్‌ను ఊహించ‌లేదు.

ర‌జనీకాంత్ పిలిచి అవ‌కాశం ఇచ్చారు...
- గ‌తంలో నేను అట్ట‌క‌త్తి, మ‌ద్రాస్ సినిమాల‌ను డైరెక్ట్ చేశాను. మ‌ద్రాస్ సినిమాను కార్తీతో చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ట‌య్యింది. త‌ర్వాత సూర్య‌గారితో సినిమా చేసుకోవ‌డానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్న స‌మ‌యంలో సౌంద‌ర్య రజ‌నీకాంత్‌గారు నాకు ఫోన్ చేసి నాన్న‌గారు నీ మ‌ద్రాస్ సినిమా చూశారు. ఆయ‌న నీతో ప‌నిచేయాల‌నుకుంటున్నార‌ని అన్నారు. ర‌జ‌నీకాంత్‌లాంటి స్టార్ హీరో నాతో వ‌ర్క్ చేయాల‌నుంద‌డం కంటే ఇంకేం కావాలి. ఎంతో మంది స్టార్ డైరెక్ట‌ర్స్ ర‌జ‌నీకాంత్‌గారితో ప‌నిచేయాల‌నుకుంటారు. కానీ అలాంటి హీరోనే నాకు పిలిచి అవ‌కాశం ఇచ్చారు.

లుక్ ప‌రంగా కేర్ తీసుకున్నాం...
- ర‌జనీకాంత్‌గారు ఈ సినిమాలో యంగ్‌, ఓల్డ్ లుక్‌లో క‌న‌ప‌డ‌తారు. యంగ్ లుక్ కోసం ఆయ‌న న‌టించిన 80-90 ద‌శాకాల్లోని ఫోటోస్‌ను రెఫ‌రెన్స్‌గా తీసుకుని ఆయ‌న లుక్‌ను డిజైన్ చేశాను. ఓల్డ్ లుక్‌లో 20 నిమిషాలు మాత్ర‌మే క‌న‌ప‌డ‌తారు.

ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్ గురించి...
- స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌వారు ఇండియ‌న్స్‌ను మ‌లేషియా తీసుకెళ్ళి అక్క‌డ కూలీలుగా మార్చారు. అక్క‌డ ర‌బ్బ‌ర్ ఫ్యాక్ట‌రీస్‌లో మ‌న దేశానికి చెందిన వారు చాలా మంది ప‌నిచేస్తుంటారు. అక్క‌డ ఉన్న స‌మ‌స్య‌లు కార‌ణంగా వారి నుండే క‌బాలి డాన్‌గా ఎదుగుతాడు. మాస్ వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తే క‌బాలి.

గ్రాండ్ రిలీజ్‌...
- క‌బాలి త‌మిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, జ‌ర్మీనీ, మ‌లేషియా, చైనా దేశాల‌తో పాటు ప‌లు దేశాల్లో సినిమా వ‌రల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

యాక్ష‌న్ సినిమాయే కాదు...
- క‌బాలి అంటే అంద‌రూ యాక్ష‌న్ సినిమా అనుకుంటారు కానీ క‌బాలి యాక్ష‌న్ సినిమాయే కాదు. ఎమోష‌న్స్‌తో కూడుకున్న సినిమా. ర‌జ‌నీకాంత్‌గారు త‌మిళంలో యాక్ట్‌చేసిన ముళ్ళుమ్ మ‌ల‌ర్ అనే చిత్రంలో ఆయ‌న ఎక్స్ ట్రార్డిన‌రీగా నటించారు. ఆ సినిమా కంటే క‌బాలిలో అద్భుతంగా న‌టించారు.

తదుప‌రి చిత్రాలు...
- సూర్య‌గారితో సినిమా చేయబోతున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved