pizza
Pavan Sadineni interview about Savitri
‘సావిత్రి’ టైటిల్ పెట్టడానికి కారణమదే – పవన్ సాధినేని
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2016
Hyderaba
d


నారా రోహిత్ హీరోగా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 1న విడుదలవుతుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ పవన్ సాధినేనితో ఇంటర్వ్యూ....

అందుకే టైం పట్టింది....
-'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమా తర్వాత నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు నా మొదటి సినిమా కంటే ఐదారు రెట్లు బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాను. కథ, నటీనటులు ఇలా అన్నీ విషయాలను చూసుకుని చేయడంతో 'సావిత్రి' సినిమా స్టార్ట్ చేయడానికి టైం తీసుకుంది. ప్రతి సీన్ కలర్ ఫుల్ గా ఎక్కువ మంది నటీనటులతో ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ సపోర్ట్ చేయడంతో రెండు నెలల్లో సినిమాను పూర్తి చేయగలిగాను.

అదే తేడా...
-ఇప్పటి వరకు వచ్చిన పెళ్లి సినిమాలు పాత్రల మధ్య ఉన్న రిలేషన్స్ చుట్టూ తిరిగాయే తప్ప పెళ్లి చుట్టూ తిరగలేదు. కానీ ఈ సినిమా పెళ్లి చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ పెళ్లిలో పుడుతుంది. చిన్నప్పటి నుండి పెళ్లంటే చాలా ఇష్టపడుతుంటుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తే ఎలా ఉంటుందనేదే కథ.

అక్కడ నుండి వచ్చిన ఆలోచన..
-ఓసారి జిమ్ కు వెళ్లినప్పుడు అక్కడ అమ్మాయిలు జిమ్ కు వచ్చేవారు. అసలు వీళ్లు జిమ్ కు ఎందుకు వస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకోవడానికా, అంటే పెళ్లంటే అంత పిచ్చి ఉంటుందా, పెళ్లి గురించి ఒక అమ్మాయికి ఎంత పిచ్చి ఉండవచ్చు అనే ఆలోచనతో కథ రాసుకున్నాను.

Pavan Sadineni interview gallery

మాస్ టైటిల్...
-'సావిత్రి' అంటే అందరూ క్లాస్ టైటిల్ అనుకుంటారు కానీ, నేనైతే మాస్ టైటిల్ అంటాను. ఎందుకంటే సావిత్రిగారి కంటే పెద్ద మాస్ హీరోయిన్ ఎవరూ లేరు. సోసైటీలో ప్రతి మాస్ కు రీచ్ అయిన హీరోయిన్ ఆవిడ. ఈ టైటిల్ పెట్టగానే బాగా రీచ్ అయ్యింది. బిజినెస్ కూడా పూర్తయ్యింది. మరో రకంగా చెప్పాలంటే సావిత్రి గురించి హీరో రిషి తీసుకునే స్ట్రగుల్ సినిమా కాబ్టటి ఈ టైటిల్ పెట్టాం.

ముందు తను చేయనంది...
-ఈ సినిమాలో హీరోయిన్ తెలుగు అమ్మాయిగా ఉండాలి. కొంచెం ఇమ్యేచ్చుర్ గా ఉండాలని అనుకున్నాను. అందుకనే నందితన హీరోయిన్ గా తీసుకున్నాను. అయితే 'సావిత్రి' అనే టైటిల్ వినగానే నందిత ముందు చేయనంది. కానీ కథ విన్న తర్వాత చేయడానికి ఒప్పుకుంది. రోహిత్ ఇందులో తను మెడికో క్యారెక్టర్ చేశాడు. తనకు ట్రావెల్ చేయడమంటే చాలా ఇష్టం. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది.

వేరే కథ అనుకున్నాను...
-నేను నారారోహిత్ దగ్గరకు వెళ్లినప్పుడు యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీతో వెళ్లాను. అయితే అల్రెడి తను ఈ కథ విన్నాడు. మరి ఈ కథతో సినిమా ఎందుకు చేయడం లేదని అన్నాడు. సావిత్రిలో ముందు పదిహేను నిమిషాల వరకు హీరో క్యారెక్టర్ అనేది కనపడదు అన్నాను. అయితే తనకి సినిమా అంతా తానే ఉండాలి. సినిమాలో అందరూ ఉండాలి. అందరితో పాటు హీరో ఉండాలి అనుకునే వ్యక్తి. అలాగే సోలో తర్వాత తను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ చేయాలని అని ఎదురుచూస్తున్నాడు. తనకు ఈ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే యాక్సెప్ట్ చేశాడు.

అవే హైలైట్స్..
-హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్. ఎంటర్ టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామా ఇవే సినిమాలో డ్రైవింగ్ ఎలిమెంట్స్.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
-ఇంకా ఏదీ పైనలైజ్ కాలేదు. రెండు, మూడు కథలున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆలోచిస్తాను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved