pizza
Payal Rajput interview
లిప్‌లాక్ చేస్తే త‌ప్పేంటి - పాయల్ రాజ్‌పుత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

05 July 2018
Hyderabad


కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గా KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన చిత్రం `RX 100`. ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. An Incredible Love Story అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. ఈ చిత్రం జూలై 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేసింది....

- ఇంత‌కు ముందు నేను పంజాబీ సినిమాల్లో న‌టించాను. రీసెంట్‌గా సైర‌ట్ పంజాబీ రీమేక్‌లో న‌టించాను. ఆ సినిమాలో నా న‌ట‌న‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా వ‌చ్చింది. సీరియ‌ల్స్‌లో కూడా న‌టించాను. `ఆర్‌.ఎక్స్ 100` తెలుగులో నా తొలి చిత్రం. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత సినిమా సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఆద‌రిస్తున్నందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు

- సినిమాను అంగీక‌రించేట‌ప్పుడు స్క్రిప్ట్‌తో పాటు డైరెక్ట‌ర్‌.. ప్రొడ‌క్ష‌న్ హౌస్ అన్నీ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాను.

- అజ‌య్‌గారు ఆర్ ఎక్స్ 100 క‌థ నెరేట్ చేసిన‌ప్పుడు నా పాత్ర బాగా న‌చ్చింది. డిఫ‌రెంట్‌గా ఉంద‌నిపించింది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌. తెలుగు భాష‌లో న‌టించ‌డం ఎలా అని అనుకున్నాను. కానీ.. సెట్‌లోకి అడుగుపెట్టిన త‌ర్వాత డైరెక్ష‌న్ టీమ్‌.. ఇత‌ర స‌భ్యుల స‌హ‌కారంతో క‌ష్ట‌మ‌నిపించ‌లేదు.

- అజ‌య్ భూప‌తిగారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌గారి శిష్యుడ‌ని తెలిసింది. అలాగే ఆయన నెరేట్ చేసిన ప‌ద్ధ‌తి న‌చ్చింది. అందుకే ఆయ‌న చెప్పిన‌ట్లు చేసుకుంటూ వెళ్లిపోయాను. ప్ర‌తి సీన్ గురించి అజ‌య్‌గారికి క్లారిటీ ఉంది. నేను ప‌నిచేసిన ద‌ర్శ‌కుల్లో బెస్ట్ ప‌ర్స‌న్ అజ‌య్‌గారే. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

- నా రోల్ చిన్న‌దా? పెద్దదా? అని ఆలోచించ‌ను. పాత్ర ప్రాముఖ్య‌త‌ను గురించి ఆలోచిస్తాను.

- స్క్రిప్ట్‌లో భాగ‌మైనందు వ‌ల్ల‌నే లిప్‌లాక్ సీన్స్‌లో న‌టించాను. అందులో త‌ప్పేం క‌నిపించ‌లేదు. ఓ న‌టిగా స్క్రిప్ట్‌కు న్యాయం చేయ‌డం నా బాధ్య‌త‌గా భావించాను.

interview gallery



 

- కార్తికేయ మంచి మిత్రుడే కాదు.. మంచి వ్య‌క్తి కూడా. మంచి కో స్టార్‌. ఇద్ద‌రం బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాం. అలాగే రాంకీగారు, రావు ర‌మేశ్‌గారు..లాంటి సీనియ‌ర్ న‌టీన‌టులతో చేయ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది.

- ఇప్పుడు తెలుగు నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాు. తెలుగు క్లాసులకు వెళుతున్నాను.

- ఇప్పుడు పంజాబీ సినిమాల‌తో బిజీగా ఉన్నాను. వాటిని త్వ‌ర‌గా పూర్తి చేసేస్తాను. తెలుగు సినిమాల్లో న‌టిచండానికి ఆస‌క్తిగా ఉంది. సెప్టెంబ‌ర్‌లో ఓ తెలుగు సినిమా చేయ‌బోతున్నాను.

- తెలుగు సినిమాలు చూస్తున్నాను. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేశ్ .. సినిమాల‌ను చూశాను. తెలుగులో నాకు ప్ర‌భాస్ అంటే ఇష్టం. ఆయ‌న‌తో భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌కుండా క‌లిసి న‌టిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది.


 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved