pizza
Prabhakar interview about Right Right
‘రైట్ రైట్’ నాకు నటుడిగా మంచి గుర్తింపు తెస్తుంది - ప్రభాకర్
You are at idlebrain.com > news today >
Follow Us

4 June 2016
Hyderaba
d

వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన చిత్రం `రైట్ రైట్‌`. ఈ చిత్రం జూన్ 10న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్ర‌భాక‌ర్‌తో ఇంట‌ర్వ్యూ....

ఆయనే నాకు బ్రేక్ ఇచ్చారు....
మ‌ర్యాద‌రామ‌న్న చిత్రంతో రాజ‌మౌళిగారు నాకు మంచి గుర్తింపు తెచ్చే పాత్ర‌నిచ్చారు. ఆ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు వ‌చ్చాయి. అయితే ఎక్కువ‌భాగం సినిమాలు ఒక ఫైట్‌, ఒక సీన్‌తోనే ఉండేవి. అయితే మ‌ళ్లీ రాజ‌మౌళిగారు డైరెక్ట్ చేసిన బాహుబ‌లితో చాలా మంచి బ్రేక్ వ‌చ్చింది. ఇప్పుడు ప‌రిస్థితి చాలా బావుంది. చాలా మంచి పాత్ర‌లు వ‌స్తున్నాయి. నా సినిమా కెరీర్ ప‌రంగా చూస్తే రాజ‌మౌళిగారే నాకు పెద్ద బ్రేక్ ఇచ్చారు.

డిఫరెంట్ క్యారెక్టర్...
ఇప్పటి వరకు విలన్ పాత్రల్లోనే కనపడిన నేను రైట్ రైట్ చిత్రంలో డ్రైవర్ పాత్రలో కనపడతాను. పాజిటివ్ రోల్ చేశాను. సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ చూపించుకునే పాత్ర చేశాను. నటుడుగా నిరూపించుకునే పాత్ర. ఈ సినిమా మలయాళ వెర్షన్ ను చూశాను. మలయాళంలో పాత్ర కంటే బెటర్ గా క్యారెక్టర్ ను డిజైన్ చేశారు. డ్యాన్సులు కూడా చేశాను.

మనసుకు హత్తుకుంటుంది...
సినిమాలో ఇసకోటా నుండి గవిటీకి బస్సు నడిపే డ్రైవర్ గా కనపడతాను. సాధారణంగా సిటీ నుండి విలేజ్ కు వెళ్లే బస్ డ్రైవర్, కండెక్టర్ అక్కడే రాత్రి స్టే చేసి తర్వాత పొద్దున్నే తిరుగు ప్రయాణం చేస్తుంటారు. అందువల్ల అక్కడి పల్లె ప్రజలతో మంచి సంబంధాలుంటాయి. అలాగే అక్కడి ప్రజలతో సత్సంబంధాలుండే పాత్రలో కనపడతాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతాను.

Prabhakar interview gallery

 

ఎంజాయ్ చేశాను..
ఫుల్ లెంగ్త్ పాజిటివ్ పాత్ర చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన పాత్రలకు విలక్షణమైన పాత్ర కావడంతో బాడీలాంగ్వేజ్ లో మార్పు చూపించాలి. కాబట్టి డైరెక్టర్ మనుగారితో, ఎం.ఎస్.రాజుగారితో బాగా డిస్కస్ చేసేవాడిని వారి సలహాలు, సూచనలు బాగా హెల్ప్ అయ్యాయి.

డైరెక్టర్ మనుతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్....
డైరెక్టర్ మను దృశ్యం చిత్రంతో సహా పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రతి రోజు నా పాత్రకు సంబంధించి ముందురోజునే ఏ సన్నివేశాలు చేయాలి, ఎలా చేయాలని చెప్పేవారు. చాలా టాలెంటెడ్ పర్సన్.

సుమంత్ అశ్విన్ గురించి...
సుమంత్ అశ్విన్ తో రైట్ రైట్ సినిమా కంటే ముందుగా పరిచయం లేదు. ఈ సినిమాలో చేసటప్పుడు ముందు రెండు రోజులు పెద్దగా కలవలేదు. తర్వాత మా మధ్య బాగా సానిహిత్యం ఏర్పడింది. తను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరం కలిసి చేసే సీన్స్ లో డిస్కస్ చేసుకుని ఎలా చేస్తే బావుంటుందో ఆలోచించుకుని చేసేవాళ్లం.

బాధపడ్డరోజులున్నాయి...
నేను విలన్ గా చేసినప్పుడు నా ఫ్రెండ్స్, తెలిసినవాళ్లంతా ఏంట్రా ఏదో సీన్ లో కానీ, ఫైట్ లో కానీ రౌడీగా కనపడతావనేవారు. దాంతో మనసులో చిన్న బాధ కలిగేది. ఈ సినిమాతో ఆ బాధ తీరిపోయింది.

కళ్ళలో నీళ్లు తిరిగాయి...
బాహుబలి నాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చింది. సినిమా విడుదల సమయంలో చాలా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ ఉన్న విదేశీయులు చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. విదేశీయులు కూడా నా నటనను మెచ్చుకోవడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.

తదుపరి చిత్రాలు...
ఆక్సిజన్ లో టిపికల్ విలన్ గా కనపడతాను. అలాగే అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి, కాళకేయ వర్సెస్ కాట్రవల్లీ సినిమాలతో సహా మలయాళంలో మోహన్ లాల్ గారితో సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved