pizza
Prabhas interview (Telugu) about Baahubali 2
ఇండియ‌న్ సినిమాలో మేమేదో కొత్త‌గా చేస్తున్నామ‌నే గౌర‌వం `బాహుబ‌లి 2`తో రెట్టింపు అయ్యింది - ప్ర‌భాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

17 April 2017
Hyderabad

ఆర్కా మీడియా వ‌ర్క్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `బాహుబ‌లి 2`. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్‌తో ఇంట‌ర్వ్యూ...

నాలుగేళ్ల పాటు బాహుబ‌లితో ఉన్నారు. ఇప్పుడు హ‌మ్మ‌య్య అని రిలాక్స్ అయ్యారా?
- ఇంకా బాహుబ‌లి నుంచి బ‌య‌టికి రాలేదు. నాలుగేళ్లు దాన్లోనే ఉన్నాం క‌దా.. సినిమా రిలీజ్ అయ్యాక రిలాక్స్ అవుతాను.

నాలుగేళ్ల‌పాటు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండ‌టం ఎలా అనిపించింది?
- ఈజీ అయితే కాదండీ. ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ అయి మేమంతా కాస్త రిలీఫ్‌గా కూర్చుని ఉండ‌గా ఒక‌రోజు వినాయ‌క్‌గారు అడిగారు.. శివ‌గామి ఎందుకు చ‌నిపోయింది? క‌ట్ట‌ప్ప ఎందుకు పొడిచాడు? అస‌లేమైంది? ఇలాంటివి ప‌ది ప్ర‌శ్న‌లు ఉండి కూడా సినిమా హిట్ అయిందంటే మామూలు విష‌యం కాదు. అన్నీ ప్ర‌శ్న‌ల‌తో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అనేది ఎలా వ‌చ్చింద‌నేది వినాయ‌క్‌గారు మ‌మ్మ‌ల్ని అడిగిన ప్ర‌శ్న‌. అప్పుడు నేను రాజ‌మౌళిగారి వైపు చూశా. అస‌లు ఆ సినిమాలో అన్ని ప్ర‌శ్న‌లున్న‌ట్టు నాకు అప్ప‌టిదాకా అనిపించ‌లేదు. ఎందుకంటే నేను పూర్తి స్టోరీ విన్నాను. పూర్తిగా తెలుసు కాబ‌ట్టి. క‌థ హీరో, హీరోయిన్ కాదు.. ఇందులో ప్ర‌తి ఒక్క‌రి పాత్రా కీల‌క‌మైన‌దే. ఇన్ని పాత్ర‌ల్ని ఒక్క క‌థ‌లో చెప్ప‌డం క‌ష్ట‌మ‌నే రెండు భాగాల్లో తీద్దామ‌ని డిసైడ్ అయ్యారు. ఈ పార్ట్ ఒన్‌, పార్ట్ టూ ఎక్క‌డ క‌ట్ చేయాల‌నే పాయింట్‌ను ఆలోచించ‌డానికే ఆయ‌న 15-20 రోజులు టైమ్ తీసుకున్న‌ట్టున్నారు. క‌ట్ట‌ప్ప నెత్తిమీద కాలు పెట్టుకున్న క్యార‌క్ట‌ర్ బ్యాంగ్‌, ట్విస్ట్ అని అనుక‌న్నాం. కానీ ఇంత పెద్దగా ఉంటుంద‌ని అనుకోలేదు. వార్ న‌చ్చిందేమో, స‌డ‌న్‌గా అలా ఆప‌డ‌మే న‌చ్చిందేమో వాళ్లకి.

మీకు ఏది క‌ష్ట‌మ‌నిపించింది?
- శివుడు చాలా ఈజీ. బావుంటుంది. సీన్లు బావుంటాయి. అర‌వ‌చ్చు, కోప్ప‌డొచ్చు.. కానీ బాహుబ‌లి అనేది డిజైన్డ్ పాత్ర‌. కింగ్ అవుతాడా? కాదా? అయితే ఎలా ఉంటుంది? వ‌ంటివ‌న్నీ అత‌ని పాత్ర‌లో మెయిన్‌. అందుకే ఆ డిజైన్డ్ పాత్ర క‌ష్ట‌మ‌నిపించింది. శివుడు కొండ‌ల్లో పెరిగిన‌వాడికిమైండ్ సెట్ డిఫ‌రెంట్‌.. వాడికి వాడి గురించి అస‌లు తెలియ‌దు. తెలియ‌కుండానే డీఎన్ఏని బ‌ట్టి ఎదిగాడు. బాహుబ‌లికి ప్ర‌తిదీ మైండ్‌లో ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓ మ‌ద‌ర్ ఉంది. అంతా... శివ‌గామి పాత్ర చాలా గొప్ప‌గా ఉంటుంది. రాజ‌మౌళి డిజైన్ చేసిన పాత్ర‌లు గ్రేట్‌.

ఈ సినిమా తెలుగు అనే ప‌రిధిని దాటి చాలా దూరం వెళ్లింది?
- రాజ‌మౌళిగారు ఐదేళ్ల ముందు ఓ లైన్ చెప్పారు. దానికి ముందు ఐదేళ్ల ముందు నుంచీ ఐదారుక‌థ‌లు చెప్పారు. అన్నిట్లోకీ నాకు న‌చ్చింది ఇదే. అందులో ఓ సారి కృష్ణ‌దేవ‌రాయ‌ల క‌థ కూడా చెప్పారు. బిఫోర్ బిక‌మింగ్ ద కింగ్ అనేది కూడా ఉంటుంది. అయినా వాట‌న్నిటిక‌న్నా నాకు న‌చ్చింది ఇదే. రెబ‌ల్ డ‌బ్బింగ్‌లో ఉన్న‌ప్పుడు నాకు ఈ లైన్ చెప్పారు. లైన్ ఇంపాక్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి నాకు ఐదారు రోజులు ప‌ట్టింది. ఆ ఇంపాక్ట్స్ అన్నీ సెకండాఫ్‌లో ఉంటాయి. క‌థ చాలా తొంద‌ర‌గా చేసుకున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ మాత్రం టైమ్ తీసుకున్నారు. ఫ‌స్ట్ పార్ట్ లో ప్ర‌తి షాటూ నాకు ఎక్స్ పీరియ‌న్సే. ప్ర‌తిదీ ఊహించే చేయాలి. హాఫ్ బ్లైండ్‌లోనే ఫ‌స్ట్ పార్ట్ రిలీజైంది. ఇంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టి, అన్ ఫినిష్డ్ సినిమా చేసి ఎప్పుడూ మ‌నం రిలీజ్ చేయ‌లేదు. ఇన్ని ప్ర‌శ్న‌ల‌తో మ‌న సినిమా ఎప్పుడూ విడుద‌ల కాలేదు.. అలాంటి అన్ని యాంగిల్స్ లోనూ బాహుబ‌లి తొలి సినిమా అయింది. రిలీజ్ అయిన త‌ర్వాత చాలా పెద్ద హిట్ అయింది. నిర్మాత‌లు కూడా రిస్క్ తీసుకుందామ‌ని రెడీ అయ్యారు.
శోభుగారు ఒక‌టి న‌మ్మారు. వాట‌ర్ ఫాల్స్ సీక్వెన్స్, వార్‌, విజువ‌ల్స్ మ‌నం ఎప్పుడూ విన‌లేదు. వాట‌ర్ పాల్స్ ఆకాశం నుంచి వ‌చ్చిన‌ట్టు రాజ‌మౌళిగారు ఆలోచించారు. దేవ‌ర సాంగ్‌ను చూసి అవ‌తార్‌లా ఉందే అని క‌ర‌ణ్‌జోహార్ అన్నారు. వాట‌ర్ ఫాల్ ను నేను హాలీవుడ్‌లో కూడా చూడ‌లేదు నేను. అంత గొప్ప‌గా ఉంది. అది చూశాక నా లైఫ్‌లో ఇది చాల‌నిపించింది.

ఫ‌స్ట్ పార్ట్ చూశాక ధైర్యం వ‌చ్చిందా?
- ఫ‌స్ట్ పార్ట్ ఏంటంటే అండీ నేను, రాజ‌మౌళిగారు ఇంకో మూడు సినిమాలు చేస్తే స‌రిపోద్దేమో.. కానీ నిర్మాత‌లు అంత డ‌బ్బులు పెట్టి ఆ సినిమా ఆడ‌క‌పోతే ఆ వ‌డ్డీలు, వాటినుంచి బ‌య‌ట‌ప‌డ‌టం చాలా క‌ష్ట‌మయ్యేది.
బాహుబ‌లి హిట్ అయితే మా దృష్టిలో ఫ్లాప్ కిందే లెక్క‌. మ‌హా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా నిర్మాత‌కు ఇప్ప‌టికీ ఏం మిగ‌ల్లేదంటే చూడండి.

మొద‌టి నుంచీ మ‌ల్టీ లాంగ్వేజ్ చేయాల‌ని అనుకున్నారా?
- క‌చ్చితంగా అండీ. ఎందుకంటే రాజ‌మౌళిగారు ఆ సినిమా డ్రామా, లైన్‌లోనే అన్నీ లాంగ్వేజ‌స్‌కి క‌నెక్ట్ అయ్యేలా చేశారు. లైన్‌లో ఆ డెప్త్ ఉంది. ఆ విజువ‌ల్‌, ఆ వార్‌.. ఇవ‌న్నీ ఇండియ‌న్ సినిమాలో ఇంత‌కు ముందు క‌నిపించ‌లేదు. డ్రామా విత్ వార్ అనేది, పీరియాడిక్ ఫిల్మ్ విత్ బెస్ట్ ఎపిసోడ్‌తో మ‌నం ఇప్ప‌టిదాకా ఎప్పుడూ చూడ‌లేదు. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో ఉంది ఈ సినిమా. హిందీలో అస‌లు ఆడుతుందా? అనేది కూడా తెలియ‌దు.

మీరు, రాజ‌మౌళిగారు కాకుండా, మిగిలిన వాళ్లంద‌రూ చాలా సినిమాలు చేశారుగా?
- నేను, రాజ‌మౌళిగారు వేరే సినిమాలు చేసి ఉంటే ఎనిమిదేళ్లు ప‌ట్టేది. అలా కాకుండా చేశాం కాబ‌ట్టే ఇప్ప‌టికి పూర్త‌యింది. నేను కూడా వేరే సినిమాలు చేసి ఉండ‌వ‌చ్చు. కానీ నాకు అది న‌చ్చ‌లేదు. పూర్తిగా ఈ సినిమా మీదే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాం. వార్‌ని మేం 80 రోజులు ప్లాన్ చేశాం. ఎందుకంటే ప్లాన్ చేయ‌డానికి రిఫ‌రెన్స్ కూడా ఏమీ లేదు. దాన్లో దిగ‌డం ప్లాన్ చేయ‌డం, చేసుకుంటూ వెళ్లాం. 80 అనుకున్న‌ది 120కి చేరుకుంది. మ‌ధ్య‌లో స‌ర్జ‌రీ అయి, మ‌ధ్య‌లో నాలుగు నెల‌లు ఆపి ఇలా చేసుకుంటూ వెళ్లాం. సో సినిమా ఇదొక ఎక్స్ పెరిమెంట్‌. ఎక్స్ పీరియ‌న్స్ అంతే. మ‌ధ్య‌లో వెళ్లొచ్చి సినిమా చేయ‌డ‌మ‌నేది ఊహ‌కు కూడా క‌ష్టం.

Prabhas interview gallery

మీరు లేకుంటే సినిమానే లేద‌న్నారుగా రాజ‌మౌళి?
- న‌వ్వుతూ.. ఒక‌టేమిటంటే అండీ.. రాజ‌మౌళిగారు ఛ‌త్ర‌ప‌తితో నాకు బాగా క్లోజ్ అయ్యారు. దానివ‌ల్ల ఈ సినిమా ఇంత బాగా కుదిరింది. 12 ఏళ్ల నుంచి ఆయ‌న‌తో ట్రావెల్ చేస్తున్నా. ఆయ‌న ప‌ర్స‌న‌ల్‌గా నాకు బాగా తెలుసు. ఆయ‌న పిచ్చి ప్యాష‌న్‌తో ఏదో చేస్తున్నారు. వ‌ర్క‌వుట్ అయితే ఏదో ఒక వండ‌ర్ జరుగుతుంద‌ని చేశా. జ‌రిగింది.

ఐదేళ్లు అదే మ‌నుషుల‌తో బోర్ కొట్ట‌లేదా?
- రాజ‌మౌళిగారి కుటుంబంతో ముందు నుంచీ నాకు మంచి రిలేష‌న్ ఉందండీ. ఇంకోటంటే మామూలుగా ఎవ‌రైనా బోర్ కొడితే చాలా ఎగ్జ‌యిట్ క‌లిగించే అంశాల‌ను చేస్తారు. ఆడుతారు, ఏదైనా వెళ్లి చూస్తారూ... అలాగ‌న్న‌మాట‌. బాహుబ‌లి సెట్లోనే ప్ర‌తి రోజూ ఏదో ఒక‌టి కొత్త‌గా ఉండేది. ఒక‌రోజు వార్ చేసేవాళ్లం. మ‌రో రోజు గుర్రాల‌తో ఆడుకునేవాళ్లం. ఎప్పుడో స‌డ‌న్‌గా పిలిచి రాజ‌మౌళిగారు వాట‌ర్‌ఫాల్ సీన్ చూపించారు. అది అద్భుతంగా అనిపించింది. అస‌లు ఇలాంటిసినిమాలో మ‌నం ఉన్నామ‌న్న ఫీలింగ్‌తోనే నేను కొన్ని నెల‌లు గ‌డిపేశాను. అలాంట‌ప్పుడు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఎక్క‌డికీ వెళ్లలేదు. మా సెట్లోనే అన్నీ ఉన్నాయి. అయినా మూడేళ్ల త‌ర్వాత కాస్త బోర్ కొట్టింది. గ‌త ఎనిమిది నెల‌ల క్రితం రాజ‌మౌళిగారు నాకు ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ చెప్పారు. అంత‌కు ముందు తెలిసిందే అయినా ఆయ‌న మ‌రింత డెవ‌ల‌ప్ చేసి చెప్ప‌డంతో ఒళ్లు గ‌గుర్పొడిచింది.
ఆయ‌న ఎగ్జ‌యిట్‌మెంట్ ఏంటో నాకు తెలియ‌దు కానీ, మ‌మ్మ‌ల్ని మాత్రం ఎగ్జ‌యిట్‌మెంట్ చేశాం.

బాహుబ‌లి సెట్స్ నుంచి వ‌స్తున్న‌ప్పుడు ఏమ‌నిపించింది?
- ఫ‌స్ట పార్ట్ అయిన‌ప్పుడు మాత్రం కాస్త ఎమోష‌న్‌గా అనిపించింది. ఇలాంటి గొప్ప సినిమా ఆడుతుందా? ఆడితే ఇంకో పార్ట్ ఉంటుంది.. లేక‌పోతే? అని అక్క‌డున్న వారిని హ‌గ్ చేసుకుని వ‌చ్చాను. కానీ ఇప్పుడు నేను ఇంకా ఆ సినిమా నుంచి బ‌య‌టికి రాలేదు. ఇంకా రాజ‌మౌళి పిలిచి ఓ క్లోజ‌ప్ తీసుకోవాల‌ని అంటారేమోన‌నే అనుకుంటున్నా. నా దృష్టిలో ఇంకా సినిమా పూర్త‌యిన‌ట్టు లేదు.

సినిమా యూనిట్‌తో ఎలాంటి బాండింగ్ ఉండేది?
- ఏదో ఒక అద్భుతం జ‌రిగిపోతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఫీల‌య్యారు. ఆర్టిస్టుల‌కు ఏదైనా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఆర్ట్ డైర‌క్ట‌ర్లు, వెన‌కాల ప‌నిచేసే వాళ్లు.. అహ‌ర్నిశ‌లూ అప్ర‌మ‌త్తంగా ఉండేవారు. రాజ‌మౌళి పిచ్చోడు కాబ‌ట్టి, అలాంటి పిచ్చోళ్ల‌ను సెల‌క్ట్ చేసుకున్నారా? అనేది తెలియ‌దు. ప్ర‌తివాడు పిచ్చిగా ప‌నిచేశాడు. అది వారా? ఫ్యాక్ట‌రీనా అనేది తెలియ‌దు.

ఇందులో ఏం నేర్చుకున్నారు?
- ఒక సీన్ 30 ల‌క్ష‌లంట‌, 40 ల‌క్ష‌లంట‌.. ఒన్ మోర్ అంటే ఎలాగ‌? అనే మెంట‌ల్ టెన్ష‌న్‌తో ఉన్నాను. వార్‌లో ఒక షాట్ ఉంటే మాసివ్‌... ఉండేది. ఎక్క‌డో ఏదో మిస్ అయితే ఒన్ మోర్ అంటే దాన్ని సెట్ చేయ‌డానికి 3,4 గంట‌లు అయ్యేది. అందువ‌ల్ల స్కూల్‌కి వెళ్లిన‌ట్టు చేశా. నేను స్కూల్‌ని ఎంజాయ్ చేయ‌లేదు కానీ బాహుబ‌లిని ఎంజాయ్ చేశా. మామూలుగా మిర్చిలాంటి సినిమాలైతే ఫ్రెండ్సే కాబ‌ట్టి రేయ్ నేను 11కొస్తా, 12కొస్తా అని చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమాకు కూడా రాజ‌మౌళికి చెప్ప‌గ‌లిగే చ‌నువున్నా.. అంత ఖర్చుపెడుతున్న తీరు చూసి మ‌న‌కే ఒక టెన్ష‌న్ ఉంటుంది. దానివ‌ల్ల మోర్ అల‌ర్ట్ గా ఉండేవాళ్లం.

ఇందులో ‌ఫ‌స్ట్ పార్ట్ ఏంటండీ?
- అలా చెప్ప‌లేమండీ. ఇందులో ప్ర‌తి పార్ట్ ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్ ఉంటుందో అంత క‌ష్టం కూడా ఉంటుంది. ఒక‌రోజు 24 గంట‌లు కూడా చేశాం. బాహుబ‌లి సినిమా కోసం 300 డేస్‌కు పైగా వ‌ర్క్‌చేశాను. అందులోయాక్ష‌న్ 200 డేస్‌కు పైగా వ‌ర్క్‌చేశాను.

బాహుబ‌లి త‌ర్వాత సినిమా గురించి రాజ‌మౌళి ఏమైనా చెప్పారా?
- రాజ‌మౌళిగారు బాహుబ‌లి త‌ర్వాత ఆరు నెల‌లు పాటు విశ్రాంతి తీసుకుంటారు. నెక్ట్స్ సినిమా గురించి ఇప్ప‌ట్లో ఆలోచిస్తార‌ని నేను అనుకోవ‌డం లేదు.

బాహుబ‌లి త‌ర్వాత ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోయాయి క‌దా..మీ నెక్ట్స్ మూవీపై ఆ ప్ర‌భావం ఉంటుందా?
- ఆడియెన్స్‌ను బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఛ‌త్ర‌ప‌తి సినిమా త‌ర్వాత డార్లింగ్ సినిమా చేశాను. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అలాగే మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ చేశాను. ఆ సినిమాను కూడా ఆద‌రించారు. సినిమా రిలీజ్‌కు ముందుగానే సినిమాపై జ‌నాలు ఓ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుని ఉంటారు. ఇత‌నేదో కొత్త‌గా ట్రై చేశాడ‌నే అనుకుంటారు.

ఉన్న‌ప‌ళంగా బాహుబ‌లి రేంజ్ సినిమాలో చేయాల్సి వ‌స్తే, మీరుచేయ‌డానికి సిద్ధ‌మా..?
- బాహుబ‌లి సినిమాలో నేనేం చేశాను. ఇప్పుడు నెక్ట్స్ సినిమా కూడా అదే రేంజ్‌లో చేయాలంటే..నేనెందుకు చేయాలి. అది ల‌క్ష కోట్ల సినిమా అయినా స‌రే.. పేరు వ‌చ్చినా, రాకున్నా స‌రే, నాకు కొంత టైం కావాలి. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే నాలుగేళ్ళ త‌ర్వా ఆలోచిస్తాను.

మీకు రాజ‌కీయాలంటే ఇష్ట‌మా?
- నేను రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మేంటండి..మీరు చూస్తున్నారు క‌దా, నాదొక డిఫ‌రెంట్ మైండ్‌సెట్‌.

బాహుబ‌లి సినిమాను మూడు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు క‌దా, ఇత‌ర భాష‌ల‌కు చెందిన మీడియాలో ఎలాంటి స్పంద‌న వ‌స్తుంది?
- బాహుబ‌లి పార్ట్ 1 విడుద‌లకు ముందు మేం ప్ర‌మోష‌న్స్‌కు వెళితే, వీళ్లేదో కొత్త‌గా సినిమా చేశార‌ట అనే భావన అంద‌రిలో ఉంది. కానీ బాహుబ‌లి పార్ట్ 1 తర్వాత మంచి స‌క్సెస్ వ‌చ్చింది. మంచి స్పంద‌న వ‌చ్చింది. బాహుబ‌లి 2 ప్ర‌మోష‌న్స్‌కు వెళ్ళిన‌ప్పుడు ముంబైలో మీడియా వ్య‌క్తులు లేచి నిల‌బ‌డ్డారు. బాహుబ‌లితో మాపై గౌర‌వం పెరిగిపోయింది. ఎవ‌రైతే ఏమీ..మ‌న ఇండియ‌న్ సినిమాను గొప్ప‌గా తీస్తున్నార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఇండియ‌న్ సినిమాల్లో కొత్తగా చేశారు వీళ్ళు ఎవ‌రు అని అంద‌రూ మాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

రానా పాత్ర `బాహుబ‌లి 2` ఎలా ఉంటుంది?
- బాహుబ‌లి పార్ట్ 1లోరానా పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ మాత్ర‌మే చూశారు. సెకండ్ పార్ట్‌లో త‌న పాత్ర ఇంకా భ‌య‌కరంగా, శ‌క్తివంతంగా ఉంటుంది. రాజ‌మౌళిగారు ప్ర‌తి పాత్ర‌ను పీక్స్‌లో చూపించారు. రానా ఒక ప‌క్క హీరోగా చేస్తున్నా, విల‌న్‌గా చేయ‌డమంటే చిన్న విష‌యం కాదు, రానా ధైర్యానికి మెచ్చుకోవాలి.

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపార‌నే విష‌యాన్ని ఎవ‌రికైనా చెప్పారా?
- నేను బాహుబ‌లి సినిమా షూటింగ్ టైంలో పెద్ద‌గా ఎవ‌రినీ క‌ల‌వ‌లేదండి..అయితే నేను క‌లిసిన కొంత మంది ఆ విష‌యాన్ని అడిగారు. అస‌లు విష‌య‌మేమంటే, క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేది ఓ ముప్పై సీన్స్‌తో లింక్ అయ్యి ఉండే ఎలిమెంట్‌, దాన్ని ఓ సీన్ ఆధారంగా చేసుకుని చెప్ప‌మంటే కుద‌ర‌దు. అది సినిమాలో చూడాల్సిందే. ఒక‌వేళ చెప్పినా ఎంజాయ్ చేయ‌లేరు. ఎంత విన్నా కూడా సినిమాలో ఆ సీన్‌ను చూడాల‌నే ఆస‌క్తి చాలా మందికి ఉంటుంది.

అనుష్క, త‌మ‌న్నా బాగానే క‌ష్ట‌ప‌డ్డ‌ట్టున్నారు క‌దా?
- అవును ఇద్ద‌రూ బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అనుష్క ముస‌లి గెట‌ప్ వేసుకుని చేయాలంటే ధైర్యం, న‌మ్మ‌కం ఉండాలి. త‌ను మ‌ధ్య‌లో సైజ్ జీరోలో కూడా యాక్ట్ చేసింది. బాహుబ‌లి 2లో త‌ను అందంగా క‌న‌ప‌డుతుంది.

హాలీవుడ్ సినిమాల్లో చేయ‌బోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా?
- ఈ సినిమా స‌క్సెస్‌తో పాటు మంచి విష‌యాలు, రూమ‌ర్స్ అన్నీ ఎడా పెడా వాయించేస్తున్నాయి. హాలీవుడ్‌లో నేను చేస్తాన‌న‌డం రూమ‌ర్‌.

బాలీవుడ్‌లో క‌ర‌ణ్‌జోహార్ సినిమా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి?
- అలాంటిదేమీ లేదు. అన్నీ రూమ‌ర్స్‌

మీ నెక్ట్స మూవీ షూటింగ్ కంటే ముందు టీజ‌ర్ రానుంద‌ట అవునా?
- నా నెక్ట్స్ సినిమాకు సంబంధించి చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి క్లారిటీ రావాలి. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది.

రాజ‌మౌళి మ‌హాభార‌తంలో చేస్తే మీరే క్యారెక్ట‌ర్ చేస్తారు?
- రాజ‌మౌళిగారికి మ‌హాభార‌తం చేయాల‌నుంది కానీ, బాహుబ‌లి త‌ర్వాత మ‌హాభార‌తం చేయ‌మంటే, రాజ‌మౌళిగారు కొట్టినా కొట్టే అవ‌కాశం ఉంది. రాజమౌళిగారు మ‌హాభారతం ఏ క్యారెక్ట‌ర్ ఇచ్చినా చేయ‌డానికి నేను సిద్ధం.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఎప్పుడు ఉంటుంది?
- సుజిత్ సినిమాతో పాటు చేయాల‌నే ఆలోచ‌న ఉంది. బాహుబ‌లి 2 త‌ర్వాత దానికి సంబంధించి కూడా ఆలోచిస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved