pizza
Prabhu Deva interview (Telugu) about Abhinetri
నేను ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు - ప్రభుదేవా
You are at idlebrain.com > news today >
Follow Us

26 September 2016
Hyderaba
d

తెలుగుహిందీతమిళ భాషల్లో ప్రభుదేవామిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రభుదేవాతో సోమవారం జరిపిన ఇంటర్వ్యూ....

ముందు నన్ను హీరోగా అనుకోలేదు....
ముందు ఈ కథను నా ప్రొడక్షన్‌ హౌస్‌లో చేయాలని దర్శకుడు విజయ్‌గారు నన్ను కలిసి వేరే హీరోను అనుకుని కథ చెప్పారు. అయితే ఆ హీరోతో సినిమా ఎందుకనో పట్టాలెక్కలేదు. అప్పుడు డైరెక్టర్‌ విజయ్‌ మీరే హీరోగా చేయండి సార్‌...అన్నాడు. అలాగే తమిళ నిర్మాత గణేష్‌గారు కూడా నన్నే హీరోగా చేయమని అన్నారు. కథ నాకు నచ్చడంటైం కూడా ఉండటంతో నేను హీరోగా యాక్ట్‌ చేయడానికి అంగీకరించాను.

నచ్చడానికి కారణం..
ఈ జోనర్‌ తెలుగు ఆడియెన్స్‌కు కొత్త కాదుకానీ నాకు మాత్రం కొత్తే అని చెప్పాలి. అంతే కాకుండా స్ట్రాంగ్‌ లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌. ఇలాంటి జోనర్‌ సినిమాను డైరెక్ట్‌ చేయాలనే కోరిక మనసులో ఉండేది. ఫుల్‌ కామెడితో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అయితే చిన్న మెసేజ్‌ కూడా ఉంటుంది.

నెటివిటీ సమస్య కనపడదు...
హీరోహీరోయిన్‌ దక్షిణాది నుండి ముంబైకి వెళ్ళే ఓ కథను సినిమాగా తీశాం. దర్శకుడుకెమెరామెన్‌ సహా అందరూ ఎక్స్‌పర్ట్స్‌ కావడంతో నెటివిటీ సమస్య లేకుండానే జాగ్రత్తలు తీసుకున్నారు.

అలాంటి ఆలోచనే నా మైండ్‌లో లేదు....
ఈ సినిమా స్టార్ట్‌ చేసేటప్పుడు ఏదో సూపర్బ్‌గా యాక్ట్‌ చేసేయాలనే ఆలోచన నా మైండ్‌లోనే లేదు. విజయ్‌తమన్నామనీష్‌ సహా చాలా మంది కొత్తవాళ్ళతో కలిసి చేశాను. సీన్‌ బాగా రాకపోతే మరోసారి చేయమని అడుగుతారంతే కదా...యంగ్‌స్టర్స్‌ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే చాలు అనే ఉద్దేశంతో చేశాను. కథ తెలిసినా ఆ పర్టిక్యులర్‌ రోజు ఏ సీన్‌ తీస్తారో కూడా నాకు తెలిసేది కాదు. యూనిట్‌ ఏం చెబితే అది చేసేసి వచ్చేసేవాడిని.

అంత ఉండదు...
సినిమా హర్రర్‌ కామెడి జోనరే కానీహర్రర్‌ అంతగా ఉండదు. మంచి ఫన్‌ ఉంటుంది. సినిమా ఫ్యామిలీ జోనర్‌ స్టయిల్‌లోనే సాగుతుంది. సాధారణంగా హర్రర్‌ సినిమాలంటే దెయ్యాన్ని చూపిస్తారు. కానీ ఈ సినిమాలో దెయ్యాన్ని చూపించలేదు. కానీ దెయ్యం ఉంటుంది. అదే ఈ సినిమాలో ప్రత్యేకత.

Prabu Deva interview gallery

దాన్నే ఎంజాయ్‌ చేశాను...
నేను నటుడిగాకొరియోగ్రాఫర్‌గాదర్శకుడిగా పనిచేశాను. అయితే వీటన్నింటిలో కొరియోగ్రఫీని బాగా ఎంజాయ్‌ చేశాను. వేరే కొరియోగ్రాఫర్స్‌ దగ్గర కూడా వర్క్‌ చేశాను. వాళ్ళేం చెబితే అదే చేసుకుంటూ వచ్చాను. ఈ సినిమాకు నిర్మాతగా మారాను. అయితే నిర్మాతగా పేరు మాత్రమే నాది. డబ్బు నాది కాదు.

ఆ సినిమాకు కథ కూడా తెలియదు. అయితే కొరియోగ్రఫీని మాత్రం మిస్‌ అవుతున్నాను.

నమ్మి చేసేస్తాను...
వేరే దర్శకులతో పనిచేసేటప్పుడు నా ఐడియాస్‌ను అక్కడ ఇంప్లిమెంట్‌ చేయాలనుకోను. ఎందుకంటే ఓ మెచ్యురిటీ వచ్చింది కాబట్టి. ఓ నిర్మాతగా 'అభినేత్రికథేంటో నాకు తెలుసు. కానీ ఎబిసిడి పార్ట్‌1, పార్ట్‌2 సినిమాల కథ కూడా తెలియదు. దర్శకుడు ఏం చెబితేఏ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వమంటే అది ఇచ్చేసి వచ్చేశాను. ఫైనల్‌గా సినిమా చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. నేను ఏ సీన్‌లో ఎందుకు అలా నటించానని. కథనుదర్శకుడిని నమ్మి సినిమా చేస్తాను.

నేను నిద్రపోను...
నేను డైరెక్షన్‌ చేసినాకొరియోగ్రఫీ చేసినా లోఫర్‌ చిన్న ఫైర్‌కిక్‌ ఉంటుంది. ఆ రోజు రాత్రి సరిగా కూడా నిద్రపోను. అప్పుడే మనం చేయాలనుకున్న దాన్ని తెరపై కచ్చితంగా ప్రెజంట్‌ చేయగలుగుతాం.

అభినేత్రి అంటే....
ముంబై సిటీలోని యువకుడు మోడ్రన్‌ గర్ల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే నాన్న ప్రోద్భలంతో విలేజ్‌ పిల్లను పెళ్ళి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టం ఉండదు. కానీ చివరకు వచ్చేసరికి తన భార్యను ఎక్కువగా ఇష్టపడతాడుప్రేమిస్తాడు. ఈ సినిమాలో భార్యభర్తల మధ్య ఎమోషన్స్‌ ఉంటాయి.

కథ డ్యాన్స్‌ను డిమాండ్‌ చేసింది...
ఈ సినిమా కథే డ్యాన్స్‌ను డిమాండ్‌ చేసింది. ఏదో మేనేజ్‌ చేసేస్తాం అనుకుంటే కుదరదు. తమన్నా ఫుల్‌ బిజీగా ఉన్నా కూడాఈ సినిమా డ్యాన్స్‌ రిహార్సల్స్‌ కోసం 15-20రోజులు పూర్తిగా కేటాయించింది. సాధారణంగా ఎవరైనా నాలుగైదు గంటలు మాత్రమే డ్యాన్స్‌కు కేటాయిస్తారు. అయితే తను రోజంతా డ్యాన్స్‌ చేసేది. తమన్నా చాలా హార్డ్‌ వర్క్‌ చేసింది.

అప్పుడే రిహార్సల్స్‌ చేస్తాను...
నేను ప్రతిరోజు రిహార్సల్ చేయను. `ఎబిసిడి` సినిమా నుండి ఒకరోజుఒకటిన్నరోజు సినిమా షూటింగ్‌ అంటే నాలుగైదు రోజుల నుండి రిహార్సల్స్‌ చేస్తాను. అలాగని ఏదో వేరియేషన్స్‌ ప్రత్యేకంగా చూపించాలనుకోను. బీట్‌ను బట్టి స్టెప్స్‌ వేసుకుంటూ వెళ్ళిపోతాను.

డైరెక్షన్‌ గురించి...
నా బ్యానర్‌లో నా దర్శకత్వంలో సినిమా త్వరలోనే చేస్తాను. అలాగే తెలుగులో కూడా దర్శకత్వం చేస్తాను.

వాళ్ళన్నది నిజమే కదా...
నేను పద్నాలుగేళ్ళకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశాను. పాతికేళ్ళకు పైగా సినిమా రంగంలోనే ఉన్నాను. ఇప్పుడు నలబై వయసులో ఉన్నవారు అప్పటికీ పదిహేనేళ్ళ వయసులోని వారే. వారు అప్పటి నుండి నన్ను చూస్తూనే ఉండటం వల్ల వారి చిన్నప్పట్నుంచి నన్ను చూస్తున్నారని అనడం నిజమే కదా..అయితే నా వయసు కూడా నలబై రెండేళ్ళే.

ఫోన్‌ చేసి అభినందిస్తాను...
నేను ఏదైనా సాంగ్‌లో డ్యాన్స్‌ బావుంటే సదరు కొరియోగ్రాఫర్‌కు ఫోన్‌ చేసి అభినందిస్తాను. ఒకప్పుడు డ్యాన్స్‌ మాస్టర్లంటే చెన్నై నుండే వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మంచి కొరియోగ్రాఫర్స్‌ ఉన్నారు. అందరూ డ్యాన్స్‌ బాగా కంపోజ్‌ చేస్తున్నారు.

డ్యాన్స్‌ పరంగా ఆయనే నా ఫేవరేట్‌...
చిరంజీవిగారు నాకు ఎప్పుడూ ఫేవరేట్‌. ఇప్పుడున్న యంగర్‌ జనరేషన్‌ హీరోస్‌లో ఒకరిద్దరని కాకుండా అందరూ డ్యాన్స్‌ బాగా చేస్తున్నారు. టాప్‌ లేచిపోద్ది..,మెగా మెగా ...ఐ వాంట్‌ టు ఫాలో ఫాలో యు.. సాంగ్స్‌ సహా ఈ మధ్య చాలా సాంగ్స్‌ బాగా నచ్చాయి.

చాలా కష్టం...
మూడు భాషల్లో సినిమా చేయడమంటే సులువు కాదు. విజయ్‌ అండ్‌ టీం చాలా కష్టపడ్డారు. షూటింగే కష్టమని ముందుగా చెప్పిన డైరెక్టర్‌ విజయ్‌పోస్ట్‌ ప్రొడక్షన్‌ టైంలో మూడు భాషల్లో షూటింగ్‌ చేయడంపోస్ట్‌ ప్రొడక్షన్‌ చేయడం కంటే కష్టంగా ఉందని అన్నాడు. విజయ్‌ ఇంకెప్పుడూ మూడు భాషల్లో సినిమా చేయనని చెప్పేశాడు.

నేనేదీ ప్లాన్‌ చేసుకోను...
నేను ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. ముందు కొరియోగ్రాఫర్‌గా ఉన్నప్పుడుఅప్పుడప్పుడు స్పెషల్‌సాంగ్స్‌ చేస్తుండేవాడిని. ఒకరోజు పవిత్రన్‌గారు వచ్చినువ్వు బాగా చేస్తున్నావ్‌..నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానన్నారు. నేను సరేనన్నాను. అలాగే 'వర్షంసినిమాలో ఎన్నాళ్ళకు గుర్తొచ్చానో వాన..సాంగ్‌ చేస్తున్నప్పుడు ఎం.ఎస్‌.రాజుగారు వచ్చి ప్రభు నువ్వు నా బ్యానర్‌లో నెక్ట్స్‌ మూవీని డైరెక్ట్‌ చేస్తావా అన్నారు. నేను సరేనన్నాను. అలాగే ఈ సినిమాకు కూడా గణేషన్‌గారు వచ్చి సార్‌..మీ పేరుపై ఓ బ్యానర్‌పెట్టి సినిమా చేస్తానని అన్నాడు. నేన సరేనన్నాను. అన్నీ అలా జరిగిపోయాయంతే..

చిన్న చిన్న విషయాలకు కూడా...
సాధారణంగా ఓ స్టేజ్‌కు వెళ్ళిన తర్వాత ఎగ్జయిట్‌ కారు. నేను చిన్న చిన్న విషయాలకు ఎగ్జయిట్‌ అవుతాను. అంటే కొత్త సినిమా చూడాలంటేనచ్చింది ఏదైనా తినాలనుకున్నప్పుడు..ఆ ఎగ్జయిట్‌మెంట్‌ఎంజాయ్‌మెంట్‌ నాలో ఉంటుంది.

నేను నా పిల్లలకు అదే చెబుతాను...
నేను పెద్ద బ్రిలియంట్‌గా ఉండాలిఅది సాధించాలిఇది సాధించాలిగొప్ప ధనవంతుడిని అయిపోవాలి అనుకోవద్దు అందరి దగ్గర మంచి వ్యక్తి అనిపించుకుంటే చాలు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అదే విషయాన్ని నా పిల్లలకు చెబుతుంటాను. సాధారణ పిల్లలులాగానే నా పిల్లలు కూడా ఉంటారు. అలాగే ఉండమని అంటాను. ఎందుకంటే నేను అంత మంచివాడిని కాను.

డ్యాన్స్‌ అకాడమీ గురించి...
డ్యాన్స్‌ అకాడమీ పెట్టాలనే ఆలోచనైతే ఉంది కానీఅదొక లోకంఆ లైన్‌ వేరుగా ఉంటుంది. అది ఎలా చేయాలనేదే తెలియడం లేదు.

నెక్ట్స్‌ సినిమా...
నా దర్శకత్వంలో తదుపరి చిత్రం బాలీవుడ్‌లో ఉంటుంది. ఆ సినిమా డిసెంబర్‌ నుండి ప్రారంభం అవుతుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved