pizza
Pragya Jaiswal interview about Kanche
You are at idlebrain.com > news today >
Follow Us

21 October 2015
Hyderabad

సీతాదేవి పాత్ర కోసం రీసెర్చ్ చేశాను - ప్ర‌గ్యా జైశ్వాల్‌

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ఫై వ‌రుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శ‌క‌త్వంలో రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబులు నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ సినిమా గురించి చెప్పిన ముచ్చ‌ట్లు...

క్యారెక్ట‌ర్‌...
కంచె సినిమాలో రాచకొండ సీతాదేవి పాత్ర చేశాను. ఈ సినిమాలో నా రోల్ రాచ‌కుంటుంబానికి చెందిన అమ్మాయి. త‌న కొన్ని సిద్ధాంతాల‌ను, విలువ‌ల‌ను న‌మ్ముతుంది. వాటి కోసం ఎంత వ‌ర‌కైనా పోరాడే త‌త్వ‌మున్న అమ్మాయే సీతాదేవి. 1930 సంవ‌త్స‌రంలో ఇలాంటి విభిన్న మ‌న‌స్త‌త్వం గ‌ల మ‌హిళ త‌న క్లాస్ మేట్ ధూపాటి హ‌రిబాబును ప్రేమిస్తుంది. మ‌రి త‌న ప్రేమ కోసం సీతాదేవి ఏం చేసింద‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమాలో అవ‌కాశం...
బాలీవుడ్ మూవీ గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ చిత్రానికి సంబంధించిన ఆడిష‌న్‌కు వెళ్ళిన‌ప్పుడు క్రిష్‌గారికి నేను న‌చ్చాను. అయితే గబ్బ‌ర్ చిత్రంలో న‌టించ‌లేక‌పోయాను. అయితే క్రిష్‌గారు త‌న కంచె సినిమాలో హీరోయిన్‌గా నాకు అవ‌కాశం ఇచ్చారు.

రీసెర్చ్ చేశాను..
ఈ సీతాదేవి పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశాను. సినిమా మొత్తం ప్రీ ఇండిపెండెన్స్ ముందు జ‌రుగుతుంది కాబ‌ట్టి అలాంటి ఆహార్యం కోసం క‌ష్ట‌ప‌డ్డాను. ద‌ర్శ‌కుడు క్రిష్‌గారు చాలా క్లియ‌ర్‌గా, ప‌ర్టిక్యుల‌ర్ గా ఉండేవారు. ఆయ‌న స‌ల‌హాతో పాత హిందీ, ఇంగ్లీష్ మూవీస్ చూశాను. క్రిష్‌గారు రాణి గాయ‌త్రి దేవీ లుక్‌ను రెఫ‌రెన్స్ గా ఇచ్చారు. ఆయ‌న స‌ల‌హాను పాటిస్తూ న‌టించాను.

క్రిష్‌గారితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
క్రిష్‌గారు నాకు గురువుగారితో స‌మానం. ఆయ‌న్నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను డిఫ‌రెంట్‌గా మ‌లిచారు. చిన్న సీన్‌లో కూడా కాంప్ర‌మైజ్ అయ్యేవారు కారు. ఈ సినిమాలో చిన్న వాన‌పాట ఉంది. ఆ పాట‌లో క‌ళ్ళు ఆర్ప‌కుండా న‌టించాలి. ఒక‌వేళ క‌ళ్ళు ఆర్పితే మ‌ళ్ళీ చేయ‌మ‌నేవారు. చాలా సీన్స్ లో చెప్పులు లేకుండా న‌టించాను. ఇలా క్రిష్ ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా త‌న‌కు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు.

వ‌రుణ్‌తో క‌లిసి న‌టించ‌డం..
వ‌రుణ్‌తేజ్ చాలా మంచి కోయాక్ట‌ర్‌. ధూపాటి హ‌రిబాబు క్యారెక్ట‌ర్ లో చ‌క్క‌గా న‌టించాడు. పెద్ద ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరో అయిన సింపుల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటాడు. త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఆయ‌న కాంప్లిమెంట్ మ‌ర‌చిపోలేను..
మెగా ఫ్యామిలీ చాలా మంచి స‌పోర్ట్ అందించారు. రామ్‌చ‌ర‌ణ్ ఆడియో రోజున చాలా అందంగా ఉన్నాన‌ని కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే పాత సినిమాలో కాంచ‌న‌లా ఉన్నాన‌ని, నిజ‌మైన మ‌హారాణిలా ఉన్నాన‌ని నాగ‌బాబుగారు అన్నారు.

నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌...
ప్ర‌స్తుతం క‌థ‌లు వింటున్నాను. తెలుగుతో పాటు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ సినిమాల్లో కూడా న‌టించడానికి సిద్ధ‌మే. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాతే నా త‌దుప‌రి చిత్రం గురించి నిర్ణ‌యం తీసుకుంటాను.

 



Photo Gallery (photos by G Narasaiah)
lick here for other galleries of Pragya Jaiswal: 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved