pizza
Prasad V Potluri interview about Kaashmora
కాష్మోరా సినిమాను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ - ప్ర‌సాద్ వి.పొట్లూరి
You are at idlebrain.com > news today >
Follow Us

29 October 2016
Hyderaba
d

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించిన భారీ చిత్రం 'కాష్మోరా'. ఈరోజు విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో తొలిరోజునే ఐదు కోట్ల రూపాయ‌లు క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందిన 'కాష్మోరా' విజువల్‌ వండర్‌గా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరితో ఇంట‌ర్వ్యూ....

Prasad V Potluri interview gallery

ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ - ''ఈ ఏడాది మా పివిపి సంస్థ నుండి నాలుగు చిత్రాలు క్షణం, ఊపిరి, బ్రహ్మూెత్సవం, కాష్మోరా సినిమాలు విడుదలయ్యాయి. ఈ దీపావళి సందర్భంగా విడుదలైన కాష్మోరా సినిమాను పిల్లలు, మహిళలు సహా అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. కంటెంట్‌పై నమ్మకంతో సినిమాను రూపొందించాం. సినిమా విడుదలైన తొలిరోజునే ఐదుకోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించాయి. మంగళవారం సినిమా సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్స్‌ మనకు చాలా విషయాలు నేర్పుతాయి. అందుకనే సినిమా విడుదల ముందు కంటే విడుదల తర్వాతే ఎక్కువ ప్రమోషన్స్‌ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ముందు నుండి ప్రమోషన్స్‌ చేసి ఆడియెన్స్‌ అంచనాలు పెంచకూడదని ప్రమోషన్స్‌ను లో ప్రొఫైల్‌లోనే చేసుకుంటూ వచ్చాం. ఊపిరి సినిమాతో పాటు కాష్మోరా సినిమాను స్టార్ట్‌ చేశాం. అప్పటి నుండి కార్తీతో రిలేషన్‌ కొనసాగుతూ వచ్చింది. బాహుబలితో మా సినిమాను పోల్చుకోకూడదు. రాజమౌళి ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అయ్యారు. రాజమౌళిగారు మగధీర, ఈగ, బాహుబలి సినిమాలతో ఇండస్ట్రీని పుష్‌ చేశారు. కాష్మోరా సినిమా విషయానికి వస్తే విజువల్‌ ఎఫెక్ట్స్‌ బావున్నాయని అంటున్నారు. కొందరు ఫస్టాఫ్‌ బావుందంటే మరికొంత మంది సెకండాఫ్‌ బావుందంటున్నారు. ఓవరాల్‌గా మంచి పండుగను ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అందరూ హ్యాపీగా ఉన్నారు. మా సంస్థలో ఈ సంవత్సరం వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. కాష్మోరా సినిమా కోసం కార్తీ ఎంత ఎఫర్ట్‌ పెట్టాడో నాకు తెలుసు. కథ విషయంలో నాతో పాటు టీం అందరూ కూర్చొని డిస్కస్‌ చేసి నిర్ణయం తీసుకుంటాం. కాన్సెప్ట్‌ ఫిలింస్‌ అప్పుడు నిర్మాతగా కంఫర్ట్‌ ఉండదు. కాంబినేషన్స్‌తో సినిమాలు చేస్తే కంఫర్ట్‌ జోన్‌ ఉంటుంది. పెద్ద సినిమా అంటే మార్కెట్‌ స్థాయిలో ప్రెషర్‌ ఉంటుంది. అన్నీ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వచ్చే ఏడాది ఫిభ్రవరి 24న ఘాజి సినిమాను విడుదల చేస్తున్నాం. హిందీ తెలుగు, తమిళం, మలయాళంలో ఘాజీని విడుదల చేస్తున్నాం. హిందీలో కరణ్‌జోహార్‌గారు ఘాజీ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య అండర్‌వాటర్‌ ఓ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ నేపథ్యంలో ఘాజీ సినిమా రూపొందింది. వైజాగ్‌లో జరిగిన కథ. రానా, అతుల్‌కులకర్ణి, కె.కె.మీనన్‌, తాప్సీ తదితరులు ఈ చిత్రలో నటించారు. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఓంకార్‌గారితో రాజుగారి గది2 చిత్రాన్ని నాగార్జునగారు హీరోగా చేస్తున్నాం. ఊపిరి తర్వాత నాగార్జునగారితో చేయడం ఆనందంగా ఉంది. మూడో సినిమాను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, వంశీపైడిపల్లితో తెలుగు, తమిళంలో సినిమా చేస్తున్నాం. ఈ సినిమాలన్నీ 2017లో నిర్మిస్తాం'' అన్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved