pizza
Prasanth Varma interview (Telugu) about Awe
అవార్డుల కోసం 'అ!' చేయలేదు - ప్రశాంత్‌ వర్మ
You are at idlebrain.com > news today >
Follow Us

17 February 2018
Hyderabad

నేచరల్‌ స్టార్‌ నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'అ!'. కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, నిత్యామీనన్‌, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు నటించారు. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపిరినేని నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇంటర్వ్యూ...

నేపథ్యం...
- ఇంజనీరింగ్‌ చదివాను. 'అ!' కంటే ముందు చాలా డాక్యుమెంటరీస్‌, షార్ట్‌ ఫిలింస్‌, మ్యూజిక్‌ వీడియోస్‌, యాడ్‌ ఫిలింస్‌ చేశాను.

సక్సెస్‌ రెస్పాన్స్‌...
- సినిమాకు సక్సెస్‌ రెస్పాన్స్‌ బాగా ఉంది. ఇలాంటి జోనర్‌లో సినిమా చేయాలని ముందుగానే అనుకునే సినిమా చేశాను. ఆలోచనతో కూడిన సినిమా కాబట్టి కొంత మందికి మొదటిసారి చూస్తేనే అర్థమైంది. రెండు, మూడు సార్లు చూస్తే.. అందరికీ అర్థమవుతుంది. సినిమా చూసిన థియేటర్స్‌లో ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. నా తదుపరి సినిమా కూడా ఇలాగే ఉంటుంది.

ఇన్‌స్పిరేషన్‌ ఏమీ లేదు...
- తక్కువ బడ్జెట్‌లో ఓ సినిమా చేయాలని అనుకుని ఈ కథను రాయడం స్టార్ట్‌ చేశాను. ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌ లేదు. నా ఐడియా నుండి రాసుకున్నాను. ప్రస్తుత సమస్యపై కూడా సినిమా ఉండాలని అనుకున్నాను. ఎక్స్‌ప్రెషనిజమ్‌ అనే జోనర్‌ను బేస్‌ చేసుకుని పాత్రలను డిజైన్‌ చేసుకున్నాను. నేనే స్వంతంగా సినిమా చేయాలనుకున్నాను. చేప వాయిస్‌ కోసం నానిగారిని కలిశాను. కానీ ఆయన ధైర్యంగా ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు.

ముందు నేనే నిర్మించాలనుకన్నాను..
- కథ విన్న తర్వాత నానిగారికి నచ్చింది. తర్వాత ఫుల్‌ స్క్రిప్ట్‌ ఇచ్చాను. నానిగారికి నచ్చడంతో సెట్స్‌పైకి వెళ్లాం. నానిగారికున్న క్రెడిబిలిటీ పాడు చేయకూడదు. నేనే సినిమా చేసుకుంటే హిట్‌ అయినా, పోయినా బాధలేదు. ఈ విషయాన్ని నేను నానిగారికి ముందే చెప్పాను. నానిగారు చాలా కాన్ఫిడెంట్‌గా సినిమా చేద్దామని అన్నారు.

interview gallery



బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌...
- నాకన్నా నానిగారు, ప్రశాంతిగారు, రాబోయే కొత్త దర్శకుల కోసం సినిమా హిట్‌ కావాలని కోరుకున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత కొత్త కథలు రాయాలని అన్నారు. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను మళ్లీ చూడలేనేమో అని మరికొంత మంది అన్నారు. వీటినే బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా ఫీలయ్యాను. సినిమా చేసినందుకు కంగ్రాట్స్‌ చెప్పకుండా..థాంక్యూ చెప్పడం గొప్పగా అనిపించింది.

దానిపై అవగాహన తేవాలి...
- నా నిజ జీవితంలో కూడా డిప్రెషన్‌కు లోనైన వ్యక్తులను చూశాను. అందులో సక్సెస్‌ అయినవాళ్లున్నారు. ఫెయిల్‌ అయినవాళ్లున్నారు. దీనిపై అవగాహన తేవాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఛాలెంజింగ్‌గా అనిపించలేదు...
- నాన్నా కమర్షియల్‌ సినిమాలను బాగా చేయగలిగే దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సినిమా చేయాలని ముందుగానే అనుకునే సినిమా చేశాను. ఇందులో ఏదీ ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. నేను అనుకున్న జోనర్‌ ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశంతో చేశాను.

అవార్డుల కోసం చేయలేదు...
- అవార్డుల కోసం ఈ సినిమా చేయలేదు. అయితే తప్పకుండా మా టీంలో ఒకరిద్దరికి అవార్డ్స్‌ వస్తాయని అనుకుంటున్నాను. అలాగని డబ్బుల కోసమే కూడా సినిమా చేయలేదు. మంచి సినిమా చేయాలనే ఆలోచనతోనే సినిమా చేశాను.

కథలు చాలానే ఉన్నాయి..
- నేను ఈ సినిమా కంటే చాలా సినిమాలు చేయాల్సింది కానీ ఆగిపోయాయి. ఈ సినిమా వర్కవుట్‌ అయ్యింది. నా దగ్గర 30 కథలకు పైగానే ఉన్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved