pizza
Priya Prakash Varrier interview (Telugu) about Lovers Day
సోష‌ల్ మీడియా వ‌ల్ల నాకు చాలా మంచే జరిగింది - ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 January 2019
Hyderabad


ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇంట‌ర్వ్యూ...

- వింకిల్ గ‌ర్ల్ అనే ట్యాగ్ రావ‌డం క‌చ్చితంగా నాకు చాలా హెల్ప్ అయ్యింది. మంచి పాపులారిటీ, గుర్తింపును తెచ్చి పెట్టింది. అయితే ఆ పాపులారిటీనీ దాటి ఎద‌గాల‌నుకుంటున్నాను.

- నాకు, మా ఫ్యామిలీ స‌భ్యుల‌కు అంత పేరు రావ‌డం కొత్త‌గానే అనిపించింది. నాకు ఆ స‌మ‌యంలో సెల్‌ఫోన్స్ కూడా ఇవ్వ‌లేదు. నేను బోర్డింగ్ స్కూల్‌లో చ‌దువుకోవ‌డం లేదు. కాలేజ్‌కు వెళ్తున్నాను. కొన్నిరోజులు వ‌ర‌కు ఇంట్లో వాళ్లు న‌న్ను బ‌య‌ట‌కు కూడా పంప‌లేదు. అమ్మ‌నాన్న కాస్త టెన్ష‌న్ ప‌డ్డారు కూడా. మీడియా వ్య‌క్తులు నేరుగా ఇంటికి వ‌చ్చి క‌లిసేవారు. వారికి ఇంట‌ర్వ్యూస్ ఇచ్చేదాన్ని. చాలా బ‌య‌టి వాళ్లు వ‌చ్చి మా నాన్న‌గారికి నేను ఇంట్లో ఉన్నానా? క‌ల‌వడానికి కుదురుతుందా? అని అడిగేవారట‌. ఆ స‌మ‌యంలో నాన్న నేను ఇంట్లో లేను అని, బ‌య‌ట ఉన్నాన‌ని చెప్పేవారు.

- సోష‌ల్ మీడియా వ‌ల్ల పాజిటివ్ ఉంది.. నెగిటివ్ కూడా ఉంది. నా వ‌ర‌కు చూస్తే సోష‌ల్ మీడియా వ‌ల్ల మంచే జ‌రిగింది. ఓ రీజ‌న‌ల్ సినిమాలో సాంగ్ వైర‌ల్ అయ్యింది. ల‌క్ష‌ల మంది వ్య‌క్తులు ఆ సాంగ్‌ను చూశారు. నాకు తెలిసి.. సోష‌ల్ మీడియా లేకుంటే అంత పేరు వ‌చ్చేది కాదు.

- ఒరు ఆడార్ ల‌వ్ సినిమా కార‌ణంగా వ‌చ్చిన క్రేజ్‌తో నాకు తెలుగు స‌హా ఇత‌ర సినీ రంగాల నుండి అవ‌కాశాలు వ‌చ్చాయి. నేను కొన్నింటిని అంగీక‌రించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదు. ఎందుకంటే ఏడాది పాటు ఒరు ఆడార్ ల‌వ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నాం. ముందుగా మేం సాంగ్ మాత్ర‌మే షూట్ చేశాం. అది రిలీజైంది. మంచి పేరు వ‌చ్చింది. అప్ప‌టికి సినిమా ఇంకా చిత్రీక‌రించ‌నే లేదు. ఈ సినిమాకు క‌మిట్ అవ‌డం వ‌ల్ల నేను ఇత‌ర సినిమాల్లో న‌టించ‌లేన‌ని చెప్పానే త‌ప్ప‌.. రెమ్యున‌రేష‌నో మ‌రేదో కార‌ణం కాదు.

- అవ‌కాశాలు ఎన్ని వ‌చ్చాయంటే ఇన్ని అని క‌చ్చితంగా చెప్ప‌లేను కానీ.. బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తెలుగు విష‌యానికి వ‌స్తే ఒరు ఆడార్ ల‌వ్ త‌ర్వాత బ‌న్నిగారితో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. కానీ ఒరు ఆడార్ ల‌వ్ క‌మిట్‌మెంట్‌లో ఉండ‌టం వ‌ల్ల చేయ‌లేక‌పోయాను.

- క‌థ‌ల‌ను నేనే వింటాను. నా పాత్ర గురించి, క‌థ గురించి నాన్న‌గారితో డిస్క‌స్ చేస్తాను. నిర్ణ‌యం నాదే ఉంటుంది.

- ర‌ణ‌వీర్ సింగ్‌తో సింబా సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అలాగే `శ్రీదేవి బంగ్లా` సినిమాకు సంబంధించి నాకు లీగ‌ల్ నోటీసులు వ‌చ్చాయంటూ వార్త‌లు వ‌చ్చాయి. నా సినిమాకు సంబంధించి కాంట్ర‌వ‌ర్సీ ఉండాల‌ని అనుకోను. ఒక‌వేళ మీర‌న్న‌ట్లు ఏదైనా స‌మ‌స్య ఉంటే డైరెక్ట‌ర్‌, నిర్మాత‌ల‌కు సంబంధించింది. నావ‌ర‌కు నా పాత్ర‌ను నేను ఎలా చేశాన‌నే చూసుకుంటాను. టైటిల్‌, టీజ‌ర్‌లో ఉన్నెఎలిమెంట్స్, డైరెక్ట‌ర్ క్రియేటివిటీ కార‌ణంగా శ్రీదేవిగారి సినిమా అనే వార్త‌లు వ‌చ్చాయి. సినిమా చూస్తే కానీ అస‌లు విష‌యం తెలియ‌దు కదా. స్క్రిప్ట్ విన్న‌ప్పుడు చాలా బాగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబ‌ట్టి ఆ సినిమాను ఒప్పుకున్నాను.

- నేను మ‌ల‌యాళీ అమ్మాయి అయినా నాకు నార్త్ ఇండియా, హైద‌రాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో అభిమానులున్నారు. అలాంటి సంద‌ర్బాల్లో నా అభిమానుల‌ను, ఫాలోవ‌ర్స్‌ను క‌లుసుకునేలా చేసిది సోష‌ల్ మీడియానే. అదీగాక నా సోష‌ల్ మీడియా అకౌంట్ను యాక్టివ్‌గా ఉంచుకోవాల‌నుకుంటాను. కాబ‌ట్టి వాటిలో ఫోటోలు, వీడియోస్‌, మెసేజ్‌లు పోస్ట్ చేస్తుంటాను.

interview gallery



- ఒక న‌టిగా చాలా విష‌యాల‌ను సాధించాల‌నుకుంటున్నాను. న‌టిగా న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ప‌ర్టికుల‌ర్‌గా ఉన్న ట్యాగ్స్‌ను దాటి ఎద‌గాల‌నుకుంట‌న్నాను. అంతే త‌ప్ప ఒత్తిడిగా భావించ‌డం లేదు.

- `ఒరు ఆడార్ ల‌వ్‌`లో క‌న్నుగీటే సీన్ వ‌న్ టేక్‌లో చేశాను. ప్ర‌త్యేకంగా ప్రాక్టీస్ చేయ‌లేదు.

- నా కుటుంబంలో ఎవ‌రికీ సినిమాల‌తో సంబంధం లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుండేదాన్ని. సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకునేదాన్ని. ఓ సంద‌ర్భంలో నేను ఎందుకు సినిమాల్లో న‌టించ‌కూడ‌దు అనిపించింది.

- నా స్నేహితులు నాతో ఎప్ప‌టిలాగానే ఉంటున్నారు. నేను స్టేజ్ పెర్ఫామ‌ర్స్ వెళ్లిన‌ప్పుడు వాళ్ల నుండి వ‌చ్చే ఆద‌ర‌ణ‌నే పెద్ద స‌పోర్ట్‌గా భావిస్తుంటాను. నేను స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తాను. మ‌ధ్య‌లో నన్ను కొన్ని రోజులు బ‌య‌ట‌కు పంప‌లేదు. కానీ... మ‌ళ్లీ స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్ల‌డం స్టార్ట్ చేశాను.

- `ఒరు ఆడార్ ల‌వ్` నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల‌వుతోన్న మ‌ల‌యాళ సినిమా. సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. సినిమాలో ఆరు పాట‌లున్నాయి. అంద‌రం కొత్త‌వాళ్లే. మా బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చాం. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండే సినిమా. స్కూల్ లైఫ్‌లో జీవితం గురించి చెప్పే సినిమా ఇది.

- నాకు `ఒరు ఆడార్ ల‌వ్` పాట‌కు సంబంధించి ఎంతోహైప్ వ‌చ్చింది. మ‌రో ప‌క్క విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ముందు ఇదేంటిలా అని అనుకున్నాను కూడా. కొంత‌మందైతే కేసులు పెట్టారు కూడా. కొంద‌రు ఆ పాట‌లో న‌టించొద్దు అని కూడా అన్నారు. అయితే ఇవ‌న్నీ సినిమాలో భాగ‌మేన‌ని అర్థ‌మైంది. న‌న్ను చూపించి సినిమా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. అందువ‌ల్ల నేనేమీ టెన్ష‌న్ ప‌డ‌టం లేదు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాల‌ని క‌ల‌లు క‌న్నాను. ఇప్పుడు ఆ క‌ల‌ల్లో ఉంటున్నాను. ప్ర‌తి సెక‌న్‌.. చ‌రిష్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. నా తొలి సినిమాతోనే చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌నిపించింది.

- అల్లు అర్జున్ చాలా పెద్ద స్టార్‌. ఆయ‌న మా ఆడియో లాంచ్‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న మా వీడియోస్ చూసి అభినందించారు. ఆయ‌న కొడుకు చేసిన గ‌న్ షాట్ సీన్ నేను కూడా చూసి ఎంజాయ్ చేశాను. ఆయ‌న్ను నేరుగా క‌లుసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను.

- నా త‌దుపరి చిత్రాల గురించి ఇప్పుడే చెప్ప‌లేను. `శ్రీదేవి బంగ్లా`లో న‌టిస్తున్నాను. ఇత‌ర భాషా చిత్రాల్లో కూడా న‌టిస్తున్నాను. ఆ వివ‌రాలను రివీల్ చేయ‌లేను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved