pizza
Puri Jagannadh interview about Loafer
క‌ల్యాణ్ త‌న ఫ్యాన్స్ కి చెప్పాలి - పూరి జ‌గ‌న్నాథ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

12 December 2015
Hyderabad

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లోఫ‌ర్ ఈ నెల 17న విడుద‌ల కానుంది. సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా ఇది. వ‌రుణ్ తేజ్‌, దిశా ప‌టాని జంట‌గా న‌టించారు. ఈ సినిమా గురించి పూరి జ‌గ‌న్నాథ్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* లోఫ‌ర్ ఎలా ఉంటుంది?
- పేరుకు త‌గ్గ‌ట్టే ఉంటుంది. గ‌తంలోనూ ఇడియ‌ట్‌, పోకిరి, దేశ‌ముదురు అని సినిమాలు చేశాను. అయినా అందులో హీరోలు మంచి వారే క‌దా. అలాగే లోఫ‌ర్‌ను కూడా మంచి వాడిగా చూపించే ప్ర‌య‌త్నం చేశాం. అమ్మానాన్న త‌ర‌హాలో ఉంటుంది. కాక‌పోతే ఆ సినిమాలో త‌ల్లీ కొడుకులు క‌లిసి ఉంటారు. ఈ సినిమాలో క‌లిసి ఉండ‌రు. పైగా కొడుకును అస‌హ్యించుకుంటుంది త‌ల్లి. అలా సాగుతుందీ సినిమా.

* జాండిస్ అనే ప‌దాన్ని భ‌లే వాడారే?
- అవునండీ. మంచి త‌ల్లి, చెడ్డ తండ్రి మ‌ధ్య‌లో కొడుకు. ముగ్గురూ బ‌తికే ఉంటారు. కానీ చ‌నిపోయార‌ని ఒక‌రికొక‌రు అనుకుంటుంటారు. అలాంటి నేప‌థ్యంలో జాండిస్ అనే ప‌దాన్ని వాడాను. రేవ‌తి ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాత్ర‌ను చేయ‌లేదు. న‌న్ను న‌మ్మి చేస్తున్నాన‌ని చెప్పింది. పోసాని ఇప్ప‌టిదాకా చేయ‌ని పాత్ర‌లో క‌నిపిస్తారు. వారిద్ద‌రూ సినిమాకు లెఫ్ట్ హ్యాండ్ ఒక‌రైతే, రైట్ హ్యాండ్ మ‌రొక‌రు.

* స్టార్ సూప‌ర్‌స్టార్ కావాలంటే మీతో సినిమా చేయాల‌ని ప్ర‌భాస్ అన్నారు క‌దా. వ‌రుణ్ సూప‌ర్ స్టార్ అవుతారా?
- ఈ సినిమాతో త‌ప్ప‌కుండా అత‌ను స్టార్ రేంజ్‌కి వెళ్తాడు. త‌న‌ది అమాయ‌క‌త్వం గ‌ల ఫేస్‌. ఎక్క‌డో చూడ‌గానే క‌నెక్ట్ అవుతాడు. ద‌ర్శ‌కుడు చెప్పింది చేసే హీరో. ద‌ర్శ‌కుడు చెప్పింది హీరో చేయ‌క‌పోతే ద‌ర్శ‌కుడు కూడా ఏమీ చేయ‌లేడు. వ‌రుణ్ ద‌ర్శ‌కుడు చెప్పింది అర్థం చేసుకుని చేయ‌గ‌ల హీరో. ఇటీవ‌ల నేను చిరంజీవిగారిని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న వ‌రుణ్ గురించి చాలా సేపు మాట్లాడారు.

* చిరంజీవిగారి గురించి మీరు పుట్టిన‌రోజు స‌మ‌యంలో చెప్పిన మాట‌లు ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేసిన‌ట్టున్నాయి?
- ఫ్యాన్స్ ప్ర‌తిదానికీ రియాక్ట్ అవుతారులెండి. చిరంజీవిగారితో నాకున్న సాన్నిహిత్యం వారికి తెలీదు క‌దా. ఈ మ‌ధ్య కూడా ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న 150వ సినిమా కాక‌పోతే, 151, 152 ఏదో ఒక సినిమా చేస్తాను.

* మొన్న లోఫ‌ర్ ఆడియో వేడుక‌లో ఫ్యాన్స్ అరుస్తుంటే చిరాకు ప‌డ్డారా?
- నాకే కాదు. ఎవ‌రికైనా చిరాగ్గానే ఉంటుంది. ఎంతో ఖ‌ర్చుపెట్టి ఫంక్ష‌న్ చేసి, మా సినిమా గురించి నాలుగు మాట‌లు చెప్పాల‌ని అనుకున్నాం. అయితే ఎవ‌రూ మాట్లాడాల‌నుకున్న‌ది మాట్లాడ‌లేక‌పోయాం. ఫ్యాన్స్ కి క‌ల్యాణ్ గారు చెప్పాలి. లేకుంటే ప‌వ‌న్‌గారి ఫ్యాన్స్ కి కామ‌న్ సెన్స్ లేద‌ని అనుకుంటారు. అరిచి ప‌రువు తీయ‌కండ్రా అని క‌ల్యాణ్ గారు చెప్పాలి. ఏ ట్విట్ట‌ర్‌లోనో ఆయ‌న దీని గురించి రాస్తే బావుంటుంది.

* సునీల్ క‌శ్య‌ప్ గురించి చెప్పండి?
- చాలా మంచి సంగీతాన్నిచ్చాడు. నా తర్వాతి సినిమాకు కూడా త‌నే సంగీతం చేస్తాడు.

* మీరు ఫాస్ట్ గా సినిమాలు తీయ‌డానికి మీకు ప్ల‌స్ అయ్యే అంశాలేంటి?
- ప్లానింగ్‌. క్లారిటీ. నా టీమ్ అంద‌ర్నీ కూర్చోబెట్టి క‌థ చెప్పేస్తా. వారంద‌రికీ ఓ క్లారిటీ వ‌స్తుంది క‌దా. అందుకే చెప్పేస్తా. నా షూటింగ్‌లో వాతావ‌ర‌ణం వ‌ల్ల ఎండో, వానో ఎక్కువ‌గా ప‌డి ఇబ్బందిపెట్టిన సంద‌ర్భాలున్నాయే త‌ప్ప‌, మా ప్లానింగ్ లోపం ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.

* మీరు క‌థ రాయాలంటే బ్యాంకాక్‌కు వెళ్లాల్సిందేనా?
- బీచ్‌లో కూర్చుని రాయాల‌నుకుంటాను. వైజాగ్ బీచ్‌లో కూర్చోనివ్వ‌రు క‌దా. అందుకే బ్యాంకాక్‌. ముందు నేను కూడా ఇండియాలోనే రాసుకునేవాడిని. డ‌బ్బులొచ్చాక బ్యాంకాక్‌కి వెళ్తున్నా. అక్క‌డివారికి నా భార్య‌, పిల్ల‌ల పేర్లు బాగా తెలుసు. ఇండియా నాకు ప‌రాయిదేశంలా ఉంటుంది. బ్యాంకాక్ సొంత ఊరులా ఉంటుంది.

* మీ నిర్మాత ఏమంటున్నారు?
- తొలి కాపీ చూశారు. చాలా బావుంది. సూప‌ర్‌హిట్ సినిమా చేశాం అన్న‌య్యా అని ఫోన్ చేశారు. సో హ్యాపీ.

* జ్యోతిల‌క్ష్మి విష‌యంలో పొర‌పాటు జ‌రిగిందా?
- ఏం లేదు. అన్నీ సినిమాలూ మ‌నం అనుకున్నంత ఆడ‌వు. ఎక్కువా త‌క్కువ‌లు ఉంటాయి. ఆ సినిమా చాలా మందికి రీచ్ అయింది.

* మ‌హేష్‌తో త‌దుప‌రి సినిమా?
- ఉంది. స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా. అంత‌లో ఆయ‌న మ‌రో సినిమా చేస్తున్నారు.

* హాలీవుడ్ స్టార్ ని తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నాలు..
- మేం అనుకున్న విష‌యాలు మీ వ‌ర‌కు అంత ఫాస్ట్ గా ఎలా రీచ్ అవుతాయి?

* గాసిప్స్ ఎలా తీసుకుంటారు?
- గాసిప్స్ రాస్తున్నార‌ని మీడియాను ప‌క్క‌న‌పెట్ట‌లేం. ఆ మాట‌కొస్తే గాసిప్స్ రాకూడ‌ద‌నుకుంటే ఏ ప‌నీ చేయ‌కూడ‌దు. ఏ ప‌ని చేసినా గాసిప్స్ వ‌స్తూనే ఉంటాయి. వాటిని లైట్ టీసుకోవాలంతే.

* వ‌ర్మ‌గారు మీకు స‌ల‌హాలిస్తుంటారా?
- చాలా ఇస్తుంటారు. ఆయ‌న ఇచ్చిన ప్ర‌తి స‌ల‌హా నాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది.

* మీ అబ్బాయిని ఎప్పుడు ప‌రిచ‌యం చేస్తున్నారు?
- ఇంకో మూడేళ్ళు ప‌డుతుంది.

* మీ నిర్మాణంలో చిన్న సినిమాల‌ను తీస్తాన‌న్నారు?
- ఇప్పుడు ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి పెద్ద‌గా బాగా లేదు. పైగా శాటిలైట్ కూడా కావాలి క‌దా. అందుకే ప్ర‌స్తుతానికి ఆగాం. సుకు మంచి హిట్ కొట్ట‌డంతో మేం చాలా హ్యాపీ.

* రోగ్ మొద‌లైందా?
- షూటింగ్ మొద‌లు పెట్టాం. జ‌రుగుతోంది. తెలుగు, క‌న్న‌డ‌లో తీస్తున్నాం.



Photo Gallery (photos by G Narasaiah)
advertisement
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved