pizza
P.V. Giri interview about Nandini Nursing Home success
`నందిని న‌ర్సింగ్ హోం` స‌క్సెస్‌లో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్ - పి.వి.గిరి
You are at idlebrain.com > news today >
Follow Us

24 October 2016
Hyderaba
d

నవీన్ విజ‌య్‌కృష్ణ‌ హీరోగా, నిత్య, శ్రావ్య హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `నందిని న‌ర్సింగ్ హోమ్‌`. ఎస్‌.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రూపొందింది. రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలు. ఈ సినిమా అక్టోబ‌ర్ 21న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం చిత్ర ద‌ర్శ‌కుడు పి.వి.గిరి ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో సినిమా గురించిన సంగ‌తులు తెలియ‌జేశారు....

నేప‌థ్యం...
- మాది రాజ‌మండ్రి, నేను జ‌నార్ధ‌న మ‌హ‌ర్షిగారి వ‌ద్ద అసిస్టెంట్ ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేశాను. అలాగే ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారి వ‌ద్ద కూడా వ‌ర్క్ చేశాను. అల్ల‌రి న‌రేష్ న‌టించిన బెండు అప్పారావ్ సినిమాకు ముందు క‌థ‌ను అందించాను. త‌ర్వాత త్రికోటిగారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దిక్కులు చూడ‌కు రామ‌య్యా సినిమాకు కూడా క‌థ‌ను అందించాను.

క‌థ విన‌గానే...
- `నందిని న‌ర్సింగ్ హోం` నిర్మాత‌లు రాధాకిషోర్.జి నాకు క‌జిన్ కాబ‌ట్టి ఓ ర‌కంగా చూస్తే ఎస్‌.వి.సి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ నాకు హోం బ్యాన‌ర్‌లాంటిది. `నందిని న‌ర్సింగ్ హోం` క‌థ‌ను సిద్ధం చేసిన త‌ర్వాత నిర్మాత‌ల‌కు వినిపించాను. క‌థ‌లోని ఎలిమెంట్స్‌తో పాటు నా నెరేష‌న్ కూడా న‌చ్చ‌డంతో నిర్మాత‌లు న‌న్నే ద‌ర్శ‌కత్వం వ‌హించ‌మ‌ని చెప్పారు. సినిమా ప్ర‌ధానంగా ల‌వ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది కాబ‌ట్టి న‌వీన్ విజ‌య్‌కృష్ణ అయితే బావుంటాడని భావించి సీనియ‌ర్ న‌రేష్‌గారిని, న‌వీన్‌గారిని క‌లిసి క‌థ వినిపించాం. ఇద్ద‌రూ క‌థ విన‌గానే హ్య‌పీగా ఫీల‌య్యారు. సింగిల్ సిట్టింగ్‌లోనే క‌థ‌ను ఓకే చేశారు.

ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌..
- సినిమాను ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై విడుద‌ల ముందు వ‌ర‌కు చిన్న‌పాటి టెన్ష‌న్ ఉండేది. అయితే ఆడియెన్స్ సినిమాను రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం. మేం హైద‌రాబాద్‌లోని ప‌లు థియేట‌ర్స్‌లోకి వెళ్లి ఆడియెన్స్‌ను క‌లిశాం. అంద‌రూ సినిమా బావుంద‌ని మెచ్చుకున్నారు. స్క్రీన్‌ప్లే బావుంద‌ని అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కులు స‌హా, హిట్‌లో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్`` అన్నారు. ముఖ్యంగా సినిమా రెండు గంట‌ల పాటు ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది, చివ‌రి ఇర‌వై నిమిషాలు ఎమోష‌న‌ల్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. కృష్ణ‌, విజ‌య‌నిర్మలగారు సినిమా బావుంద‌ని మెచ్చుకున్నారు. సినిమా మొద‌టి ఆట త‌ర్వాత ఇక సీనియ‌ర్ న‌రేష్‌గారి కంట్లో అయితే నీళ్లు తిరిగాయి.

పాత్ర‌లో మాత్ర‌మే ఇన్‌వాల్వ్ అయ్యారు...
- నవీన్ మంచి టెక్నిషియ‌న్ అని సినిమా మొద‌లు పెట్టే వ‌ర‌కు నాకు తెలియ‌దు. త‌ను మంచి టెక్నిషియ‌న్ అయినా ద‌ర్శ‌కుడుగా నేను చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయాడు. మేకింగ్‌లో ఎక్క‌డా ఇన్‌వాల్వ్ కాలేదు. త‌న పాత్ర‌లో మాత్ర‌మే ఇన్‌వాల్వ్ అయ్యారంతే.

క‌న్న‌డంలో రీమేక్‌...
- `నందిని న‌ర్సింగ్ హోం` సినిమాను క‌న్న‌డంలో రీమేక్ చేయాల‌ని అక్క‌డి నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఆ రీమేక్‌ను నేనే డైరెక్ట్ చేయాలా? లేదా కేవలం రీమేక్ హక్కుల‌ను మాత్ర‌మే ఇచ్చేయాలా అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

తదుప‌రి చిత్రం...
- ప్ర‌స్తుతం నా త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన క‌థ సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం `నందిని న‌ర్సింగ్ హోం` సినిమా ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నాను. కాబ‌ట్టి నా త‌దుప‌రి చిత్ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved