pizza
Raghu Dixit interview about W/o Ram
పాట‌లు లేకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ చేయ‌డం చాలెంజింగ్‌గా అనిపించింది - ర‌ఘు దీక్షిత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 July 2018
Hyderabad

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’.విజయ్ యొలకంటి దర్శకుడు. ఈ సినిమా జూలై 20న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘు దీక్షిత్ సినిమా గురించి విశేషాల‌ను తెలియ‌జేశారు..

- నేను ఇది వ‌ర‌కు బాలీవుడ్‌, క‌న్న‌డ సినిమాల‌కు సంగీతం అందించాను. `వైఫ్ ఆఫ్ రామ్` నా తొలి తెలుగు చిత్రం. ఓ ఫ్రెండ్ ద్వారా ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని క‌లిశాను. త‌ను సినిమాకు సంగీతం చేయాల‌ని అడ‌గ్గానే ఎన్ని సాంగ్స్ ఉన్నాయ‌ని అడిగాను. త‌ను అందుకు `పాట‌లే లేవు` అన్నాడు. కాబ‌ట్టి ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాను. అయితే అంత కంటే ముందు నేను కొన్ని తెలుగు సినిమాల‌ను గ‌మ‌నించి ఆర్‌.ఆర్ చేశాను. అది విజ‌య్‌కి న‌చ్చ‌లేదు. రెగ్యుల‌ర్‌గా ఉంది. కొత్త‌గా కావాల‌ని అడిగాడు. కొంత స‌మ‌యం తీసుకుని త‌న‌కు న‌చ్చిన‌ట్లు సినిమాకు స‌రిపోయేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాను.

- నేను రొమాంటిక్, యూత్‌ సినిమాల‌కు మాత్ర‌మే సంగీతం ఇచ్చాను. ఇది టైట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని ప్రేక్ష‌కుడు సినిమాను వీక్షిస్తాడు. ఎందుకంటే చూసే ప్రేక్ష‌కుడు మ్యూజిక్ కార‌ణంగా త‌ను సినిమా క‌థ‌తో ర‌న్ అవుతు ఉన్న‌ట్లు ఫీల్ అవుతాడు.

- పాట‌లు లేని సినిమాకు సంగీతం అందించ‌డం చాలెంజింగ్‌గా అనిపించింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో మంచి సంగీతం అందించ‌డం ఒక చాలెంజ్ అయితే.. తొలి సినిమా పాట‌లు లేకుండా ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌న‌డం మ‌రో చాలెంజింగ్‌గా అనిపించింది.

- `పెళ్ళిచూపులు` సినిమాతో త‌రుణ్‌భాస్క‌ర్‌కి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఫేస్‌బుక్‌లో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచయం పెరిగింది. ఓ కాన్‌స‌ర్ట్‌కి వ‌చ్చిన‌ప్పుడు త‌రుణ్‌భాస్క‌ర్‌ని క‌లిసి.. `మీతో క‌లిసి ప‌నిచేయాల‌నుంది` అన్నాను.

interview gallery



- నేను ముందు మ్యూజిక్ కంపోజ‌ర్‌ని.. త‌ర్వాతే ప్లేబ్యాక్ సింగ‌ర్‌ని. వేరే వాళ్ల ట్యూన్‌కి పాట‌లు పాడ‌టం చాలా క‌ష్టం. అయితే నాకు సింగ‌ర్‌గా చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. నాకు మ్యూజిక్ చేయ‌డ‌మంటేనే ఇష్టం. ఎందుకంటే నేను బేసిక్‌గా సంగీతం నేర్చుకోలేదు. మైక్రోబ‌యాల‌జీ చ‌దివి సైంటిస్ట్‌గా కొన్ని రోజులు ప‌నిచేశాను. అలాగే భ‌ర‌త‌నాట్యం నేర్చుకున్నాను. సంగీతం అనేది నా హ‌బీగా ఉండేది. దేవిశ్రీప్ర‌సాద్‌, త‌మ‌న్‌లు న‌న్ను త‌మ సినిమాల్లో పాడించారు.

- నాకు శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ సంగీతం అంటే చాలా ఇష్టం. తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

- `ప్ర‌దేశ స‌మాచార` అనే క‌న్న‌డ సినిమాలో అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ పాత్ర‌లో న‌టించాను.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved