pizza
Rahul Vijay interview (Telugu) about Ee Maya Peremito
నాన్న చెప్పిన మాటలను జీవితాంతం మరచిపోలేను - రాహుల్‌ విజయ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

19 September 2018
Hyderabad

సీీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాపర్‌ హీరోయిన్‌. వి.ఎస్‌.ఎ వర్క్స్‌ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్‌ ఈ లవ్‌, కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ నెల 21న విడుదలవుతుంది. ఈసందర్భంగా హీరో రాహుల్‌ విజయ్‌ ఇంటర్వ్యూ...

8 సంవత్సరాల శిక్షణ...
- సినిమాల్లోనే పుట్టి పెరిగాను. షూటింగ్‌లకు వెళ్లేవాడిని. కెమెరా వెనుక నిలబడి షూటింగ్స్‌ చూస్తుండేవాడిని.. చిన్నప్పుడు డాన్స్‌ ఎక్కువగా చేసేవాడిని. అది చూసిన నాన్న లారెన్స్‌ మాస్టర్‌గారి దగ్గర చేర్పించారు. ప్రతిరోజూ డాన్స్‌ క్లాసులకు వెళ్లి వస్తుండేవాడిని. ఆ సమయంలో ..నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాన్న 'సినిమాల్లో హీరోగా నటిస్తావా?'అని అడిగారు. నాకు కూడా ఇంట్రెస్ట్‌ ఉండటంతో నేను కూడా సరేనని అన్నాను. ఆ తర్వాత 8 సంవత్సరాలు సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్షణ పొందాను. డాన్స్‌ విషయానికి వస్తే హిప్‌హాప్‌, కూచిపూడి నేర్చుకున్నాను. జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నాను. బ్యాంకాక్‌ వెళ్లి మూవీ ఫైటింగ్‌ కోర్సు నేర్చుకున్నాను. కరాటేలో బ్లూ బెల్ట్‌ సాధించాను. కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నాను. దేవదాస్‌ కనకాల, లక్ష్మిదాస్‌ కనకాల గారి వద్ద నటనలో శిక్షణ పొందాను. ఇలా అన్ని నేర్చుకోవడానికి కారణం ఏదైనా స్క్రిప్ట్‌ వచ్చినప్పుడు దాన్ని అన్నివిధాలా నేను న్యాయం చేయగలిగేలా ఉండాలి. అందుకనే నాన్న మాట మేర అన్నింట్లో శిక్షణ పొందాను.

సినిమాలో పాత్ర గురించి...
- సినిమాలో నా పాత్ర పేరు చందు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని.. ఖాళీగా తిరిగే ఓ కుర్రాడి పాత్ర. ఓ అమ్మాయి కోసం చందు జీవితం బాధ్యత గల యువకుడిగా మారుతాడు. ఇలా మారిన క్రమంలో చందు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే సినిమా.

నా వయసుకు తగిన విధంగా...
- యాక్షన్‌ సినిమాలు, మాస్‌ సినిమాలు చేయడానికి నాకు ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే 30,40 ఏళ్లలో కూడా వీటిని చెయ్యొచ్చు. కానీ లవ్‌ స్టోరీస్‌లో నటించడానికి ఇప్పుడు నా ఏజ్‌ కరెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఇప్పుడే చేస్తే అది వర్కవుట్‌ అవదని నమ్మాను. నన్ను తెరపై చూసినప్పుడు ఇతను మా అబ్బాయిలా ఉన్నాడని ఫీల్‌ కావాలి. వాళ్లని వాళ్లు నాలో చూసుకోవాలి.

కథను నమ్మే ముందుకెళ్లాం...
- స్టోరి ముఖ్యం. కంటెంట్‌ సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముందు పెద్ద కమర్షియల్‌ డైరెక్టర్‌తోనే వెళ్దామని అనుకున్నా.. అది వర్కవుట్‌ కాలేదు. డిలే అవుతుండటంతో రాము కొప్పుల చెప్పిన కథ నచ్చడంతో బాగా నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాం. ఈ సినిమాను ఓ సందర్భంలో సుకుమార్‌గారు నిర్మించాలనుకున్నారు. అయితే.. ఆయన 'రంగస్థలం' సినిమాతో బిజీగా ఉండటంతో ఆయన చేయలేకపోయారు. దాంతో నాన్నగారే సినిమాను నిర్మించాలనుకుంటున్నట్లు ఆయనతో చెప్పారు. ఆయనకు కూడా నా పూర్తి సహకారం ఉంటుంది అని అన్నారు. అన్నట్లుగానే ఆయన ప్రతి దగ్గర తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు.

interview gallery





స్వంత నిర్మాణ సంస్థలో సినిమా చేయడం టెన్షనే...
- బయట సినిమాలైతే వెళతాం.. షూటింగ్‌ చేస్తాం... వచ్చేస్తాం. కానీ స్వంత నిర్మాణ సంస్థలో సినిమా అంటే బయట విషయాలు కూడా ఇంటి వరకు వస్తుంటాయి. అది టెన్షన్‌గా అనిపిస్తాయి. కాబట్టి ఈ సినిమా విషయంలో కాస్త ప్రెషర్‌ ఫీల్‌ అవుతున్నాను. కానీ నన్ను నేను తొలిసారి తెరపై చూసుకున్నప్పుడు కంట్లో నీళ్లు తిరిగాయి. దీని కోసమే కదా! ఇంత కష్టపడ్డాను అనిపించింది.

సినిమా చూసిన తర్వాత నాన్న ఏమన్నారంటే...
- సినిమా చూసిన తర్వాత నాన్న, అమ్మ, అక్కయ్య వచ్చి చాలా బాగా చేశావని మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా 'ఒరేయ్‌ నేను ముప్పై ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో టెక్నీషియన్‌గా వర్క్‌ చేస్తున్నాను. మూవీ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో నేను చెప్పలేను కానీ.. హీరోగా నువ్వు సక్సెస్‌ అయ్యావు' అని నాన్న ఓ టెక్నీషియన్‌గా చెప్పిన మాటను నా జీవితంలో మరచిపోలేను.

ఒత్తిడితో ఏడ్చేసేది...
- దివ్యక్క రంగస్థలం సినిమా ప్రొడక్షన్‌ వ్యవహారాలను చూసుకున్నారు. ఆమె స్వంతంగా ప్రొడక్షన్‌ చేయడం స్టార్ట్‌ చేసిన తర్వాత అన్ని వ్యవహారాలు తనే చూసుకోవాల్సి వచ్చింది. తమ్ముడు మూవీ కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నా.. బయటపడేది కాదు.. నాకు తెలియకుండా ఏడ్చేది. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. సినిమా చూసిన తర్వాత తను ముఖంలో నవ్వు చూసిన తర్వాత నాకు కాస్త టెన్షన్‌ తగ్గింది.

తదుపరి చిత్రం..
- నెక్స్‌ట్‌ నిహారికతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. అది రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇది కాకుండా ఓ సినిమా చర్చల దశలో ఉంది. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved