pizza
Raja Goutham interview (Telugu) about Manu
ప్రేక్ష‌కుల‌కు `మ‌ను` ఓ కొత్త అనుభూతినిస్తుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను - రాజా గౌత‌మ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 September 2018
Hyderabad

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'మను'. నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో రాజా గౌత‌మ్ సినిమా గురించి చెప్పిన విశేషాలు...

- నేను చాలా షార్ట్‌ఫిలింస్ చూశాను. అందులో బెస్ట్ షార్ట్ ఫిలింస్‌లో మ‌ధురం, బ్యాక్ స్పేస్ షార్ట్ ఫిలింస్ నాకు బాగా న‌చ్చింది. బాగా చేశావంటూ ఫ‌ణికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. అప్పుడు ఇద్ద‌రం ఓ కాఫీ షాప్‌లో క‌లుసుకున్నాం. అప్పుడు త‌ను `మ‌ను` గురించి నాకు 15 నిమిషాలు చెప్పాడు. ఎవ‌డు చేస్తాడో తెలియ‌దు కానీ.. చేసిన‌వాడికి చాలా మంచి పేరు వ‌స్తుంద‌ని మ‌న‌సులో అనుకున్నాను. త‌న‌తో క‌లిసి నెల రోజుల పాటు ట్రావెల్ చేశాను. ఓ రోజు `మ‌ను అనే పాత్ర‌ను మీరే చేస్తున్నారు` అంటూ ఫ‌ణి నాకు మెసేజ్ పెట్టాడు. ఆరోజు నుండి నేటికి అంటే సినిమా రిలీజ్‌కి మూడు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

- క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్‌లో సినిమా చేశాం. దాదాపు 115 మంది మా సినిమాకు స‌పోర్ట్ చేశారు. డ‌బ్బును ఇన్‌వెస్ట్ చేసి ఏదో సినిమా తీశామ‌న‌డం కంటే.. టైమ్‌ను ఇన్‌వెస్ట్ చేసి స‌రిగ్గా సినిమా తీస్తే సినిమా రేంజ్ ఎలాగో ఉంటుంది. ఫ్లాట్‌ఫాం కూడా స‌క్సెస్ అయితే ఇంకా టాలెంటెడ్ డైరెక్ట‌ర్స్ వ‌స్తారని భావించాం. అందుక‌నే మూడున్న‌రేళ్ల నిరంత‌ర కృషి చేశాం.

- వీడు త‌న‌కు న‌చ్చిన సినిమా ఏదో చేస్తున్నాడు అని నాన్న‌(బ్ర‌హ్మానందం)కి తెలుసు. మిగ‌తా విష‌యాలు ఆయ‌న అడ‌గ‌లేదు. నేను చెప్ప‌లేదు. బ‌సంతి త‌ర్వాత ఎలాంటి స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేయాల‌నే దానిపై ఫోక‌స్ చేసుకున్నాను. అందుకనే ఎక్క‌వ స‌మ‌యం ప‌ట్టింది. ఏదో సినిమా చేసేయాల‌ని కాకుండా ఏదో కొత్త‌గా చేయాలి.. ఆడియెన్స్‌ను మెప్పించాల‌నే ఎక్కువ త‌ప‌న ప‌డ్డాను. అంతే త‌ప్ప కావాల‌నే ఎక్కువ స‌మ‌యం తీసుకోలేదు.

- క‌థ తెలుసు, డైరెక్ట‌ర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలుసు. సినిమా షూటింగ్‌లో ఇబ్బంద‌లు ప‌డినా.. రిస్క్ తీసుకున్నా కూడా .. జ‌నాలు డ‌బ్బులు పెట్టి సినిమా చేస్తున్న‌ప్పుడు రూపాయి కూడా వేస్ట్ కాకూడ‌దు అనే ఆలోచ‌న అంత‌ర్గంగా ఉండింది. అందువ‌ల్ల మా క‌ష్టాల‌న్నీ వాటి ముందు చిన్న‌గా అనిపించాయి. మాగ్జిమ‌మ్ క‌ష్టం ప‌డ్డాం. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు మ‌ను సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంద‌ని, డిసప్పాయింట్ చేయ‌ద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను.

interview gallery



- మ‌ను ఒక రొమాన్స్ మిస్ట‌రీ. ఫ‌ణీంద్ర‌పై ప్రేక్ష‌కులకు ఎక్క‌డో న‌మ్మ‌కం ఉంది. ఈ క‌థ‌ను నిర్మాత‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లాం. అయితే మ‌రి ఎక్స్‌పెరిమెంట‌ల్‌గా ఉన్నారనుకున్నారేమో వెన‌క‌డుగు వేశారు. ఫ‌ణి క్రౌడ్ ఫండింగ్‌తో సినిమా చేయాల‌ని ఓరోజు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. నాలుగు రోజుల్లో కోటి రూపాయ‌లు వ‌చ్చాయి. అంత డ‌బ్బులు వ‌చ్చాయంటే కేవ‌లం డైరెక్ట‌ర్‌పైనే న‌మ్మ‌కం.

- క్యాస్ట్ అండ్ క్రూకి నెల పుడితే అంద‌రికీ ఖ‌ర్చులు ఉండేవి. అయితే ఏదో మంచి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. సినిమా ఆడితే చాల‌నుకుని అంద‌రం క‌ష్ట‌ప‌డ్డాం. ఈరోజు వ‌ర‌కు ఎవ‌రం డ‌బ్బులు గురించి ఆలోచించ‌డం లేదు. సినిమాను న‌మ్మే ముందుకు వెళ‌తారు ఎవ‌రైనా కొన్ని వ‌ర్క‌వుట్ అవుతాయి. కొన్ని కావు. సినిమా చూసిన ప్రేక్ష‌కులు జ‌యాప‌జ‌యాల‌ను నిర్ణ‌యిస్తారు. నేను కూడా క‌థ‌ను న‌మ్మే వ‌చ్చాను. ఎంత ఎఫ‌ర్ట్ పెట్టాలో అంత ఎఫ‌ర్ట్ పెట్టాను. మిగ‌తా దేని గురించి ఆలోచించ‌లేదు. ఫిజిక‌ల్‌గా, మెంట‌ల్‌గా ఎంత ఎఫ‌ర్ట్ పెడుతున్నాన‌నేది నాకు తెలుసు. ఫెయిల్యూర్స్ గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌ను. నెక్ట్స్ ఏంట‌నే ఆలోచిస్తాను.

- టెక్నిక‌ల్‌గా విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ చాలా బలంగా చేశాం. ఏ క్రాఫ్ట్‌ను వేలెత్తి చూప‌లేని విధంగా క‌ష్ట‌ప‌డ్డాం. ఎక్క‌డా సీజీలు ఉప‌యోగించ‌లేదు. పాట‌లు బావులేవు. మాకున్న బ‌డ్జెట్‌లో ఇంత సినిమా చేశామ‌ని చెబితే ప్రేక్ష‌కులు కూడా న‌మ్మ‌రు. అంత ఎఫెక్టివ్‌గా సినిమా ఉంటుంది. సింక్ సినిమావాళ్లు సౌండ్ డిజైన్‌. మ్యూజిక్ చాలా హాంటింగ్‌గా ఉంటుంది.

- నా పాత్ర విష‌యానికి వ‌స్తే ఆర్టిస్ట్‌(పెయింట‌ర్‌).. త‌క్కువ‌గా మాట్లాడుతాడు. సంద‌ర్భానుసారం కొన్ని ఎమోష‌న్స్‌ను వ్య‌క్తం చేస్తుంటాను. అదేంటో సినిమా చూడాల్సిందే. సినిమా చూసిన అంద‌రికీ నా పాత్ర త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. హై ఎమోషన్స్ ఉంటాయి.

- రెండు క‌థ‌లున్నాయి. మ‌ను త‌ర్వాత ఏ క‌థ‌తో సినిమా చేయాల‌నేది నిర్ణ‌యించుకుంటాను.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved