pizza
Raj Tarun interview about Eedo Rakam Aado Rakam
‘ఈడోరకం ఆడోరకం’ కన్ ఫ్యూజింగ్ కామెడి ఎంటర్ టైనర్– రాజ్ తరుణ్
You are at idlebrain.com > news today >
Follow Us

12 April 2016
Hyderaba
d

మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్ హీరో హీరోయిన్స్ ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘ఈడోరకం  ఆడోరకం’ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తో ఇంటర్వ్యూ....

కన్ ఫ్యూజన్ కామెడి....
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారు పంజాబీ సినిమా సీడీ ఇచ్చి చూడమన్నారు. చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. సినిమా చూసిన తర్వాత ఆయన నాకు సినిమా కథను వివరించారు. మన నెటివిటీ, తెలుగు ప్రేక్షకులకు తగిన విధంగా కథలో మార్పులు చేర్పులు చేశారు. కన్ ఫ్యూజన్ కామెడి, ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది

క్యారెక్టర్ గురించి...
ఈడోరకం ఆడోరకం సినిమాలో నా క్యారెక్టర్ పేరు అశ్విన్. నేను, విష్ణు అన్నయ్య కలిసి అబద్దాలు చెబుతుంటాం. అలా చెప్పే అబద్దాలు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. దాన్ని ఎలా తప్పించుకున్నారనేదే కథ. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ప్రతి సీన్ ను హిలేరియస్ గా దర్శకుడు నాగేశ్వరరెడ్డి మలిచారు.

Raj Tarun interview gallery

పొరపాటు కావాలనే చేయరు...
వరుసగా మూడు సక్సెస్ లు తర్వాత చేసిన సినిమా సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. కానీ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. అందుకు వేరేవరినో తప్పు పట్టలేను. ఎందుకంటే కథ నెరేషన్ టైంలో సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. సినిమా కథ విషయంలో కావాలనే మరెవరు పొరపాటు చేయరు కదా.

విష్ణుతో, రాజేంద్ర ప్రసాద్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్...
రాజేంద్రప్రసాద్ గారితో చేయాలంటే ముందు భయపడ్డాను. కానీ ఆయన అందరితో కలిసి పోయారు. సెట్ లో ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆయన ఎనర్జీలో పదిశాతం ఉంటే చాలానిపించింది. అలాగే విష్ణు అన్నయ్యతో సినిమా చేయాలనగానే చాలా మంది మోహన్ బాబు ఫ్యామిలీ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని అన్నారు. కానీ నిజానికి వాళ్లకి దగ్గరైతే ఎలా చూసుకుంటారో నాకు బాగా తెలుసు. విష్ణుగారు చాలా కూల్ పర్సన్. పక్క నటుడు యాక్ట్ చేయడానికి స్కోప్ ఇస్తారు.

ఇప్పుడే డైరెక్షన్ ఆలోచన లేదు...
సాధారణంగా నాకు ఖాళీ ఉన్నప్పుడంతా కథలు రాసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఓస్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. అలాగని వెంటనే డైరెక్ట్ చేయను. కానీ భవిష్యత్ తప్పకుండా మూవీ డైరెక్ట్ చేస్తాను.

తదుపరి చిత్రాలు...
పెద్ద వంశీగారు ఓ సినిమా, గీతాఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నాను. రెండింటికి స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. అలాగే దిల్ రాజుగారి బ్యానర్ లో ఓ సినిమా, మారుతిగారి ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved