pizza
Raj Tarun interview (Telugu) about Rajugadu
నేను చేసిన ప్ర‌తి సినిమా నాకు స్పెష‌లే - రాజ్ త‌రుణ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 May 2018
Hyderabad

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నచిత్రం `రాజుగాడు`. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో న‌టించారు. జూన్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ త‌రుణ్‌తో ఇంట‌ర్వ్యూ...

యాదృచ్చికంగానే...
- వరుస చిత్రాలు మహిళా దర్శకులతో చేయడం అంటే ... యాదృచ్చికంగా అలా కుదిరిందంతే. నిజానికి 'రంగులరాట్నం' సినిమా కంటే ముందే రాజుగాడు ప్రారంభమైంది. కానీ ముందు రంగులరాట్నం విడుదలైంది. డైరెక్టర్‌ అంటే డైరెక్టర్‌. అందులో లేడీ అయితే ఏంటి? జెంట్‌ అయితే ఏంటి? ఎవరైనా ఎంత బాగా ఎగ్జిక్యూట్‌ చేస్తారనేదే ముఖ్యం.

ఆల‌స్యమైంది అందుకే...
- స్క్రిప్ట్‌ వర్క్‌ తయారు చేసుకున్నాం. అంధగాడు తర్వాత ఈ సినిమా స్టార్ట్‌ అయ్యింది. ఆ సినిమా కారణంగా కాస్త ఆలస్యమైంది. నాది మరో సినిమా సెట్స్‌లో ఉంది. అలా ఆలస్యమైంది. నిజానికి ముందు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ 'రంగులరాట్నం' లైన్‌లో ఉండటంతో కాస్త మంచి డేట్‌ చేసుకుని ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నాం.

న‌మ్మ‌కంతోనే...
- ఏ సినిమా చేసినా హిట్‌ అవుతుందనే నమ్మకంతోనే చేస్తాం. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాను.

పాత్ర గురించి...
- ఇందులో నాకు క్లిప్టోమేనియా అనే డిజార్డర్‌ ఉంటుంది. దాని వల్ల నాకు తెలియకుండానే నేను దొంగతనం చేసేస్తుంటాను. రియల్‌ జీవితంలో కూడా మా అంకుల్‌కు ఈ సమస్య ఉండేది. ఏ జాబ్‌ చేసినా దొంగతనం చేస్తున్నాడనే కారణంతో అతన్ని తీసేస్తుంటారు. అందువల్ల అతని తండ్రి అతన్ని ఓ సూపర్‌మార్కెట్‌లో జాబ్‌కు కుదురుస్తాడు. హీరో దొంగతనం చేసుకువచ్చే వస్తువులను పొద్దునే తిరిగి ఇచ్చేస్తుంటాడు. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌ పంథాలో ఉంటుంది. ఓ డిజార్డర్‌తో బాధపడే హీరో అనుకోకుండా కొన్ని పరిస్థితులను ఫేస్‌ చేస్తాడు. వాటి నుండి ఎలా బయటపడ్డాడనేదే కథ.

బ్యాన‌ర్ గురించి...
- ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి నిర్మాతలు.

interview gallery



ప్ర‌తి సినిమా స్పెష‌లే
- నేను చేసిన ప్రతి సినిమా నాకు స్పెషలే. అలా ఫీలవుతాను కాబట్టే సినిమాలు చేశాను. సినిమా జయాపజయాలను నిర్ణయించే కారకాలు చాలానే ఉంటాయి. సినిమాలు ఎక్కువగా చేసేయాలని కాకుండా.. మంచి సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుని అచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాను.

త‌ప్పుల నుండి నేర్చుకోవాలి...
- తప్పులు జరిగిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. మన తప్పులను ఒప్పుకున్నప్పుడే ముందుకెళ్లగలుగుతాం. ఇప్పటికీ కథలను నేనే వింటాను.

ఇన్‌వాల్వ్ కాను...
- దర్శకత్వంలో నేను ఎప్పుడూ ఇన్‌వాల్వ్‌ కాను. ఎవరి ఆలోచనలు వారికుంటాయి. వాటిలో మనం ఇన్‌వాల్వ్‌ కాకూడదు. అయితే ముందు జరిగే కథా చర్చల్లో నేనూ ఉంటాను.

తదుప‌రి చిత్రాలు...
- 'లవర్‌' దాదాపు పూర్తయ్యింది. కొన్ని రోజుల షూటింగ్‌ మాత్రమే పెండింగ్‌ ఉంది. తర్వాత సూర్య ప్రతాప్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే వశిష్ట అనే కొత్త అబ్బాయి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved