pizza
Rakul Preet Singh interview about Sarrainodu
ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేయడానికి సిద్ధమే – రకుల్ ప్రీత్ సింగ్
You are at idlebrain.com > news today >
Follow Us

19 April 2016
Hyderaba
d

స్ష్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా అల్లు రామలింగయ్య సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం `స‌రైనోడు`. రకుల్ ప్రీత్ సింగ్క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఇంటర్వ్యూ.....

నాన్నకు కూతుర్నే...
నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినా మా నాన్న కూతుర్నే. నేను తప్పు చేస్తే ఆయన కొడతారు. సెలబ్రిటీస్ అని సాధారణ ప్రజలు అనుకుంటారు కానీ మా సమస్యలు మాకుంటాయి. నేను కామన్ అమ్మాయిలాగానే ఉంటాను. షూటింగ్ లేనప్పుడు ఫ్రెండ్స్ తో బయటకు వెళుతుంటాను. నా సినిమా వ్యవహారాలన్నీ మా నాన్నగారే చూసుకుంటారు. మా మేనేజర్ తో కూడా ఆయనే మాట్లాడుతారు. నా దగ్గర నాకు అవసరమైన డబ్బులు ఉంటాయి.

ఇల్లు..., బిజినెస్....
రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ఇల్లు కొన్నాను. ప్రతి రూపాయి కూడబెట్టి కొన్న ఇల్లు అది. ఆ ఇల్లు ఇంకేవరో ఇచ్చారని రూమర్స్ వచ్చాయి. కానీ ఆ రూమర్స్ లో నిజం లేదు. అలాగే హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన జిమ్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది.

సరైనోడులో క్యారెక్టర్ గురించి...
సరైనోడులో రాజమండ్రికి చెందిని మహాలక్ష్మి అనే విలేజ్ అమ్మాయి పాత్రలో కనపడతాను. మేకప్ కూడా వేసుకోలేదు. రాజమండ్రి యాస్ డిఫరెంట్ గా ఉండటంతో డబ్బింగ్ కూడా చెప్పుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక డీ గ్లామర్ రోల్ అనవచ్చు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో, బ్రూస్ లీ చిత్రాల్లో మాత్రమే గ్లామర్ రోల్స్ లో నటించాను. మహాలక్ష్మి పాత్ర పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర, ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే క్యారెక్టర్ పరంగా బోయపాటిగారు ఏం చెబితే దాన్ని ఫాలో అయిపోతూ వచ్చాను.

Rakul Preet Singh interview gallery

నాకు బోర్ కొడుతుంది...
ఒకేవిధమైన పాత్రలు చేయాలంటే బోర్ కొడుతుంది. అందుకే నేను చేసే పాత్రల్లో ఏదైనా డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటాను. మన పాత్ర మనల్నే కాదు, ఆడియెన్స్ ను కూడా ఎగ్జయిట్ చేసేలా ఉండాలి.

డ్యాన్స్ విషయంలో ఇంప్రూవ్ మెంట్....
రామ్ చరణ్, అల్లుఅర్జున్ ఇలా మెగా హీరోలతో వర్క్ చేశాను. నేనేదీ ప్లాన్ చేసి చేయలేదు. అయితే రెండు, మూడు సినిమాల నుండి మంచి డ్యాన్సర్స్ అయిన హీరోలతో వర్క్ చేయడం వల్ల డ్యాన్స్ ఇంప్రూవ్ అవుతుంది.

ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో...
నాకు జబ్ వుయ్ మెట్, ఆషికి వంటి లవ్ స్టోరీస్ తో పాటు యాక్షన్ పిలింస్, స్పోర్ట్స్ బేస్ డ్ మూవీస్ లో చేయాలనే కోరిక ఉంది. అలాగే ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా చేయడానికి కూడా సిద్ధమే. పాత్రల పరంగా ఏదో ఒక ప్రయోగం చేయాలనే ఉంటుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
రాంచరణ్ తో తనీ ఒరువన్ రీమేక్ లో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం మే నెలలో కాశ్మీర్ వెళుతున్నాను. అలాగే సాయిధరమ్ తేజ్ తో మే నెలలోనే మరో సినిమాలో యాక్ట్ చేయబోతున్నాను. 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved