pizza
Ram Gopal Varma interview (Telugu) about Lakshmi's NTR
`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రాన్ని బాల‌కృష్ణ‌గారికి అంకిత‌మిస్తున్నా - రాంగోపాల్ వ‌ర్మ‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 March 2019
Hyderabad

``విశ్లేష‌ణ చేస్తున్న‌ప్పుడు తెలుసుకున్న‌ది కానీ, చాలా మంది చెప్పిందాన్ని బట్టి న‌మ్మ‌ద‌గిన‌వాటిని బ‌ట్టి మ‌న‌కు ఓ అవ‌గాహ‌న వ‌చ్చింది. నేను న‌మ్మిన నిజాన్ని నేను చెప్పాను. `ఇలా జ‌ర‌గ‌లేదు` అని ఎవ‌రైనా అనుకుంటే, వారు న‌మ్మిన‌దాన్ని బ‌ట్టి సినిమా తీసుకోవ‌చ్చు . నాకేం అభ్యంత‌రం లేదు`` అని అంటున్నారు రాంగోపాల్ వ‌ర్మ‌. . జీవీ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో రాకేష్ రెడ్డి, దీప్తి బాల‌గారి నిర్మాత‌లుగా రాంగోపాల్ వ‌ర్మ‌, ఆగ‌స్త్య మంజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. మార్చి 29న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా రాంగోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూ...

* బాలీవుడ్‌లో మీరు మాఫియా మీద కూడా సినిమాలు చేశారు. అప్పుడు లేని వివాదాలు ఇప్పుడు ఎందుకు వ‌స్తున్నాయి?
- ఎందుకంటే ఇక్క‌డ నిజం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌నే భ‌యం. ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలా తెలియ‌ని నిజాలు ఇప్పుడు ఎక్క‌డ తెలుస్తాయోన‌నే భ‌యం. అందుకే ఇన్ని వివాదాలు వ‌స్తున్నాయి. విడుద‌ల కాకుండా అప‌డానికి ట్రై చేస్తున్నారు. అవ‌త‌లివారి ద‌గ్గ‌రే నిజం ఉంటే, వాళ్లు ఆప‌డానికి అంత‌గా ఎందుకు ప్ర‌య‌త్నించాలి.

* ల‌క్ష్మీపార్వ‌తి బ‌తికున్నారుగా. ఆమే యాక్ట్ చేస్తే స‌రిపోయేదిగా?
- ఇది 25 ఏళ్ల క్రితం క‌థ‌. ఇప్పుడు ఆవిడ వ‌య‌సు అంత కాదు.

* ఇప్పుడు నిజం ఎవ‌రికీ తెలియ‌ద‌న్నారు క‌దా. మీరు ల‌క్ష్మీపార్వ‌తి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన‌ట్టున్నారు?
- ఆ మాట త‌ప్పు. నేను లక్ష్మీ పార్వ‌తి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్ప‌లేదు. ల‌క్ష్మీపార్వ‌తి ఆయ‌న జీవితంలో ప్ర‌వేశించిన స‌మ‌యం నుంచిఈ క‌థ తీశా.

* ఇప్పుడు మీరు కుట్ర అని ఏదైతే అంటున్నారో... చంద్ర‌బాబుగారి పాయింట్ ఆఫ్ వ్యూలో అదే నిజ‌మై ఉండొచ్చు క‌దా?
- ఉండొచ్చు. ఆయ‌న అంత‌గా న‌మ్మిన‌ప్పుడు చంద్ర‌బాబునాయుడే ఒక సినిమా తీసుకోవ‌చ్చుగా.

* నాదెండ్ల‌ భాస్క‌ర‌రావు చేసింది పెద్ద కుట్రా? చ‌ంద్ర‌బాబు నాయుడు చేసింది పెద్ద కుట్రా?
- త‌ప్ప‌కుండా చంద్ర‌బాబునాయుడు చేసింది పెద్ద కుట్ర‌. కార‌ణం ఏంటంటే, నాదెండ్ల భాస్క‌ర‌రావు పార్టీకోసం త‌ప్ప ఆయ‌న‌తో పెద్ద‌గా క‌లిసింది లేదు. కానీ కుటుంబీకులు అలా కాదు. ర‌క్త‌సంబంధీకులు, ద‌గ్గ‌రివాళ్లు చేసిన కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది.

* మామూలుగా ఇలాంటి సినిమాలు చేసేట‌ప్పుడు... స్టార్స్ తో చేస్తారు. మ‌రి మీరెందుకు రియ‌లిస్టిక్ కేర‌క్ట‌ర్ కోసం ఎందుక అన్ని రెఓజులు వెతికారు?
- రియ‌లిస్టిక్ కేర‌క్ట‌ర్ల‌ను పెద్ద‌గా ఫేమ‌స్ కానివారు చేసిన‌ప్పుడు బిలీవ‌బులిటీ ఎక్కువ ఉంటుంద‌నేది నా ఐడియా. అందుకే నా వీర‌ప్ప‌న్‌గానీ, వంగ‌వీటిగానీ కొత్త‌వాళ్ల‌తోనే చేశా.

* ఈ క‌థ గురించి ల‌క్ష్మీపార్వ‌తిగారిని క‌లిశారా?
- లేదండీ.

* ఈ సినిమా నిర్మాత వైసీపీ అని అంటున్నారు. ల‌క్ష్మీపార్వ‌తిగారు కూడా చంద్ర‌బాబునాయుడుగారికి వ్య‌తిరేక‌మే. అందువ‌ల్ల మీరు ఒక పార్టీకి స‌పోర్ట్ గా, మ‌రో పార్టీకి వ్య‌తిరేకంగా తీశార‌ని అంటున్నారే?
- అందులో నిజం ఉండ‌దు. పైగా మ‌నం ఏం చెప్పినా, అవ‌త‌లివాడు ఏది న‌మ్మాల‌నుకుంటే అదే న‌మ్ముతాడు. ఈ నిర్మాత వైసీపీ అని ముందు నాకు తెలియ‌దు. ఒక‌వేళ తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు. అది వేరే విష‌యం. పాయింట్ ఏంటంటే ఒక పార్టీ వాళ్లు ఎప్పుడూ మ‌రో పార్టీని ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే ఉంటారు. నేను సినిమా మేక‌ర్‌గా 25 ఏళ్ల క్రితం జ‌రిగిన క‌థ‌నే నేను చేశా. మా నిర్మాత వైసీపీ కాద‌నుకోండి.. అయినా నేను వైసీపీకి స‌పోర్ట్ చేయొచ్చు. అలా తీయ‌కూడ‌ద‌నేం లేదు క‌దా. పాతికేళ్ల క్రితం జ‌రిగిన క‌థ ఒకానొక వ్య‌క్తికి వ్య‌తిరేకంగా ఉండొచ్చేమోగానీ, వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది?

interview gallery



* వైసీపీ అప్పుడు లేక‌పోవ‌చ్చు. కానీ ఇప్పుడు పార్టీయే క‌దా?
- అప్పుడు లేక‌పోయినా, ఇప్పుడు ఉన్నా.. నేను వాళ్ల‌కు అనుకూల‌మైతే, ఎలాగైనా అనుకూలంగానే ఉంటా. లేదంటే లేదు.

* ఇందులో భాస్క‌ర‌రావుగారి ఎపిసోడ్ లేదా?
- ఇది కేవ‌లం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంతేనండీ. ఆయ‌న ఎపిసోడ్ ఎప్పుడో అయిపోయింది. 1989 త‌ర్వాత ల‌క్ష్మీపార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఉంటుంది.

* ల‌క్ష్మీపార్వ‌తి మీద ఉన్న అభియోగాల‌ను సినిమా తుడిచేస్తుందా?
- తుడిచేస్తుందా? పెంచుతుందా? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

* ఆమె సీఎం కావాల‌ని అనుకున్నార‌ని అప్ప‌ట్లో మాట‌లుండేవి. వాటిని ట‌చ్ చేశారా?
- అన్నీ యాంగిల్స్ ని చూసిన త‌ర్వాత నేను న‌మ్మిన యాంగిల్‌ను తీశాను.

* సినిమా ఆపేస్తే రూ.50 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌చ్చిందట నిజ‌మేనా?
- అలాంటిదేమీ లేదండీ. నేను సినిమా మేక‌ర్‌ని. నేను క‌ష్ట‌ప‌డి ఓ సినిమాను చేసిన‌ప్పుడు దాన్ని రిలీజ్ చేయాల‌నే అనుకుంటా.

* మ‌హాన‌టి సినిమాలో చాలా అబ‌ద్ధాలున్నాయి. అందులో చాలా విష‌యాలు సినిమాటిక్‌లున్నాయి..
- దాని గురించి కాదు.. నేను న‌మ్మిన విష‌యాల‌ను మాత్ర‌మే నేను తీశా. నేనేం సినిమాటిక్‌గా తీయ‌లేదు. నా మాట‌ను న‌మ్మ‌ని వాళ్ల‌కు సినిమాటిక్‌గా అనిపించ‌వ‌చ్చు.

* విజ‌య్‌కుమార్‌గారు ఎన్టీఆర్ పాత్ర‌లోకి మారిన ప‌ద్ధ‌తి మీకు ఎలా అనిపించింది?
- ఎన్టీఆర్ గారిని సినిమాల్లోనూ, పొలిటిక‌ల్ స్పీచుల్లోనే చూశాం. కానీ అలా కాకుండా ఆయ‌న లివింగ్ రూమ్‌లోనూ, బెడ్‌రూమ్‌లోనూ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్టుకోవ‌డం ఏ న‌టుడికైనా ఒక ట్రెమండ‌స్ ఎమోష‌న‌ల్ డెప్త్ ను కేప్చ‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దాన్ని ఆయ‌న చాలా బాగా చేశారు.

* డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కూడా సినిమాను విడుద‌ల చేయొద్ద‌ని బెదిరింపులు వ‌చ్చాయ‌ట క‌దా?
- అవ‌న్నీ యూట్యూబ్ వీడియోల్లో వ‌చ్చిన విషయాలు. ఎవ‌రు వార్నింగ్ ఇస్తారు అస‌లు.

* ఎన్టీఆర్‌లో వైయ‌స్ఆర్ కేర‌క్ట‌ర్ చేసిన‌త‌న్ని ఇందులో బాబు పాత్ర చేయించారు?
- నేను చేయించేట‌ప్పుడు ఆ విషయం కూడా నాకు తెలియ‌దు.

* ఫిల్మ్ మేకింగ్ స‌మ‌యంలో సినిమాను ఆపేయ‌మ‌ని ఎవ‌రైనా ప్రెజ‌ర్ చేశారా?
- స‌లహాలే ఇచ్చారు అంద‌రూ `వ‌ద్దు. ఇదెందుకు` అని.

* చంద్ర‌బాబుమీద‌గానీ, ప్ర‌భుత్వం మీద గానీ క‌సితోనే చేశార‌ని అంటున్నారే?
- నాకు సీబీయ‌న్‌గారి మూలాన న‌ష్టం లేదు, జ‌గ‌న్ వ‌ల్ల లాభం కూడా లేదు. వైస్రాయ్ ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో నేను రంగీలా తీశా. అప్పుడు సోష‌ల్ మీడియా లేక‌పోవ‌డం వ‌ల్ల పెద్ద ఐడియా లేదు. కానీ బాల‌కృష్ణ‌గారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి` క‌థానాయ‌కుడు` సినిమాతోనే ఇది మొద‌లైంది. అందుకే నేను ఈ సినిమాను బాల‌కృష్ణ‌గారికి అంకిత‌మిస్తున్నా. న‌న్ను ఆయ‌న క‌లిశారు. ఆయ‌న న‌న్ను క‌ల‌వ‌లేదంటే ఆయ‌న‌న్నా అబ‌ద్ధ‌మైనా అయి ఉండాలి. నేను చెప్పేదైనా అబద్ధం అయినా అయి ఉండాలి.

* ఇన్ని కాంట్ర‌వ‌ర్శీలు చూశాక బాలీవుడ్‌లో సినిమా చేయ‌డం క‌ష్ట‌మా? ఇక్క‌డ చేయ‌డం క‌ష్ట‌మా?
- ఎక్క‌డా క‌ష్టం ఉండ‌దు. లీగ‌ల్‌గా క‌రెక్ట్ గా చేస్తున్న‌ప్పుడు డెమాక్ర‌టిక్ కంట్రీలో ఏదీ క‌ష్టం కాదు.

* వివాదాల వ‌ల్ల వ‌చ్చే ప‌బ్లిసిటీ వ‌ర్మ‌కు వ్య‌స‌నం అయిపోయింద‌నే మాట ఉంది..
- వ్య‌స‌నం.. నాకు చాలా వ్య‌స‌నాలున్నాయి. ఇది కూడా వ్య‌స‌న‌మైనా ఓకే. 90 శాతం నా కెరీర్‌లో ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్ర‌వ‌ర్శీల‌ను తీసుకునే చేశా.స‌ర్కార్‌, వంగ‌వీటి, ర‌క్త‌చ‌రిత్ర ఏదైనా అలాంటిదే.

* ఈ సినిమా మీ కెరీర్‌లో ప్ర‌త్యేకం అని అన్నారుగా..
- ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఆయ‌న క‌న్నా ప్ర‌ముఖ‌మైన తెలుగువారు ఉండ‌రు. అలాంటి వ్య‌క్తికి జ‌రిగిన ఎక్స్ ట్రీమ్ ట్రాజెడీని తెర‌కెక్కించ‌డ‌మ‌నేది డిఫిక‌ల్ట్, ఎమోష‌న‌ల్ టాస్క్. దాన్ని జ‌స్టీస్ చేయ‌డం చాలా రెస్పాన్సుబిలిటీ. ట్రూత్‌ఫుల్ టు హిమ్ అనేది చాలా కీల‌కం.

* మేకింగ్ ఎఫ‌ర్ట్ లో మిగిలిన సినిమాల‌క‌న్నా ఏమైనా ఉందా?
- నేనేమీ లైట్స్ మోశాన‌ని కాదు. థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నా. కాన్‌సెన్‌ట్రేష‌న్ లెవ‌ల్ మ‌రింత ఎక్కువ‌గా పెట్టాల్సి ఉంటుంది. ఏ డైర‌క్ట‌ర్ అయినా స‌బ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉండాలి.

* మీ అసిస్టెంట్ డైర‌క్ట‌ర్స్ కూడా మీ సినిమాలు చేస్తుంటారు? వాళ్లు చేసేవి చూస్తుంటారా?
- సినిమా మేకింగ్ అనేది ఎప్పుడైనా టీమ్ వ‌ర్క్. కాక‌పోతే ప‌ర్టిక్యుల‌ర్‌గా వాళ్ల పేర్ల‌ను తెర‌మీద చూడ‌టం అల‌వాటైపోయి ఇలా మాట్లాడుతుంటాం కానీ, నా దృష్టిలో సినిమా మేకింగ్ ఎప్పుడూ టీమ్ వ‌ర్కే. మా మంజు చాలా మంచి డైర‌క్ట‌ర్‌. త‌న కాంట్రిబ్యూష‌న్ చాలా గొప్ప‌ది. అందుకే త‌న పేరు వేశా.

* మీ న‌టీన‌టులంంద‌రూ థియేట‌ర్స్?
- య‌జ్ఞ క‌న్న‌డ న‌టి. మిగిలిన వాళ్లంద‌రూ థియేట‌ర్ న‌టులే.

* మీరు క‌థానాయ‌కుడు, మ‌హానాయకుడు చూశారా? ఎక్క‌డ తప్పు జ‌రిగింద‌ని అనుకుంటున్నారు?
- ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో చెప్ప‌డానికి నేనెవ‌రిని? కాక‌పోతే నా ఉద్దేశం ప్ర‌కారం ఓ ఎమోష‌న‌ల్ కాన్‌ఫ్లిక్ట్ లేకుండా సీన్ల‌ను పేర్చిన‌ట్టు పేర్చారు.

* ఆడియ‌న్స్ ఎక్కువ‌గా నెగ‌టివిటీని ఎక్కువ లైక్ చేస్తారా?
- అది క‌రెక్ట్ కాదు. సినిమా అనేది ఫండ‌మెంట‌ల్‌గా ఎమోష‌న‌ల్ కాన్‌ఫ్లిక్ట్ అనేది మెయిన్‌. ఇప్పుడు గాంధీ సినిమా చేస్తున్నామ‌ని చెప్పి బ్రిటిష్‌ని అందులో నుంచి తీసేస్తే ఇక ఎమోష‌న‌ల్ కాన్‌ఫ్లిక్ట్ ఎక్క‌డ ఉంటుంది? ఆయ‌న ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అనేది కాదుగా సినిమా అంటే. బ్రిటిషర్లు రాక‌తో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది?

* ఈ సినిమాతో మార్పు వ‌స్తుంద‌ని అనుకుంటున్నారా?
- అలా కాదండీ. ఓటు వేసేవారు హామీలు, వాటిని నెర‌వేర్చిన విధానం గురించి ఓ అవ‌గాహ‌న ఉంటుంది. ఆ అవ‌గాహ‌న‌తో న‌మ్మ‌కంతో ఒక వ్య‌క్తికి ఓటు వేస్తారు. అలాంటి వ్య‌క్తి గురించి స‌డ‌న్‌గా ఏదో తెలిసి న‌మ్మ‌కం పోగొట్టుకున్నార‌నుకోండి.. ఏ మేర‌కు సాధ్య‌మ‌వుతుంది? అది ఎంత మందిని ప్ర‌భావితం చేస్తుంద‌ని నాకు తెలియ‌దు. కానీ ట్ర‌స్ట్ ఫ్యాక్ట‌ర్ అనేది రావ‌చ్చు, పోవ‌చ్చు. కానీ స‌డ‌న్‌గా మీ గురించిగ‌తంలో జ‌రిగింది ఏదైనా తెలిస్తే ఆటోమేటిగ్గా నా మ‌న‌సు మీద ఎఫెక్ట్ ఉంటుందిగా. కానీ ఏ మేర ఉంటుంద‌నేది మెయిన్‌.

* ఈ ఏడాది ఓటు వేస్తారా?
- నాకు ఓటు లేదనుకుంటా.

* వైస్రాయ్ గురించి చాలా మందికి తెలుసుగా?
- నిజమే. వైస్రాయ్ గురించి తెలుసు. కానీ దానికి దారితీసిన కార‌ణాలు మీకు తెలియ‌దుగా.

* సెన్సార్ వ‌ల్ల ఇబ్బందులేమైనా ఉన్నాయా?
- ఉండ‌వండీ. నేను సెన్సార్ రూల్స్ కు అనుగుణంగానే చేశా.

* అనంత‌పురాన్ని ఆనంద‌పురం అని మార్చిన‌ట్టుగా ఏమైనా మారుస్తారా?
- అలాంటిదేమీ ఉండ‌దండీ. ఎందుకంటే సుప్రీమ్‌కోర్టు ప‌ద్మావ‌త్‌, ఉడ్తా పంజాబ్ త‌ర్వాత చాలా వెసులుబాటు క‌ల్పించింది. అందుకే `మ‌హానాయ‌కుడు`లోనూ నాదెండ్ల భాస్క‌ర‌రావు పేరును అలాగే వాడిన‌ట్టున్నారు.

* మీ ట్రైల‌ర్‌లో వాడికి పేరు లేదా? వాడు వాడు అని అంటున్నారు?
- సినిమా చూస్తే తెలుస్తుంది. నాక్కూడా తెలియ‌దు. కాక‌పోతే వాడిని ఎక్క‌డో చూసిన‌ట్టు ఉంది.

* వెన్నుపోటును ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ స‌మ‌యంలో దాని గురించి ప‌ట్టించుకోవ‌డం స‌బ‌బేనా?
- నాకు పార్టీల‌తో సంబంధం లేదు. వెన్నుపోటు లేకుండా జీవితాలే లేవు. `ద‌గా` అని ఓ పాట‌ను విడుద‌ల చేశాం. ఒకత‌ను చంద్ర‌బాబునాయుడికి వెన్నుపోటు పొడుస్తున్నారు రామ్‌గోపాల్‌వ‌ర్మ అని కేసుపెట్టారు. క‌ట్ చేస్తే సీబీయ‌న్ ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌లా. ఆయ‌న వైసీపీలో చేరారు. కాబ‌ట్టి వెన్నుపోటు పొడ‌వ‌కుండా జీవితాలే ఉండ‌ట్లేదు.

* మీరు ఎవ‌రికైనా వెన్నుపోటు పొడిచారా?
- నా వీపు చాలా తిక్ అండీ. నేనెప్పుడూ ముందుపోటే పొడుస్తా.

* ఏపీలో ఎవ‌రు వ‌స్తారు?
- నేను జ్యోతిష్కుడిని కాదు. కాక‌పోతే ఎవ‌రు వ‌చ్చినా ఫ‌ర‌క్ ప‌డ‌దు. మార్పు అనేది ప్రాసెస్‌లో రావాలేగానీ, ఎన్నిక‌ల్లో జ‌రుగుతుంద‌ని అనుకోను. కాక‌పోతే సీఎం గా ఒక చాయిస్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఒక చాయిస్ కేఏపాల్‌. ఒక‌రొస్తే సినిమా వాళ్ల ఫొటోలు ఫ్రెంట్ పేజీలో ఉంటాయి. మ‌రొక‌రొస్తే కామెడీకి కొద‌వుండ‌దు.

* కేసీఆర్ బ‌యోపిక్ గురించి చెప్పండి..?
- ఆయ‌న బ‌యోపిక్ గురించి రిసెర్చ్ చేస్తున్నా. కాంట్ర‌వ‌ర్శీలు ఏమీ కావు.

* వెబ్ సీరీస్ లు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయి?

- ఒక‌టి సెప్టెంబ‌ర్‌లో వ‌స్తుంది.

* కేఏపాల్ మిమ్మ‌ల్ని క‌లిశారా?
- ఆయ‌న వ‌చ్చి న‌న్ను ముంబైలో క‌లిశారు. మ‌నిషి పుట్టిన‌ప్ప‌టినుంచి కేఏపాల్ క‌న్నా అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడ‌లేదు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved