pizza
Rana Daggubati interview about Nene Raju Nene Mantri
`నేనే రాజు నేనే మంత్రి` చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రాధా జోగేంద్ర ప్రేమ‌క‌థ - రానా ద‌గ్గుబాటి
You are at idlebrain.com > news today >
Follow Us

10 August 2017
Hyderabad

తొలి సినిమా 'లీడర్‌'తోనే నటుడిగా తన కెపాసిటీని, కేపబులిటీని నిరూపించుకొని 'కృష్ణం వందే జగద్గురుమ్‌', 'ఘాజీ'లాంటి డిఫరెంట్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు రానా దగ్గుబాటి. 'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రాలు తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పాయి. 'బాహుబలి'లో భల్లాలదేవగా తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుండి నటన పరంగా అనేక ప్రశంసలు అందుకోవడమే కాకుండా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. రెగ్యులర్‌ ఫిలింస్‌కి భిన్నంగా డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ను సెలెక్ట్‌ చేసుకొని వరుస హిట్స్‌ సాధిస్తున్న రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డా. డి.రామానాయుడు సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ఆగస్ట్‌ 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం రిలీజ్‌ సందర్భంగా హీరో రానా దగ్గుబాటితో ఇంటర్వ్యూ.

పర్టిక్యులర్‌గా ఈ సినిమా చేయడానికి రీజన్‌ ఏంటి?
- ఈ సంవత్సరం నేను చేసిన 'బాహుబలి' 'ఘాజి' ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' చేశాను. మూడు డిఫరెంట్‌ జోనర్‌ ఫిలింస్‌. 'బాహుబలి-2' బిగ్గెస్ట్‌ హిట్‌ అయి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది. 'ఘాజి' కూడా సూపర్‌హిట్‌ అయి విమర్శకుల ప్రశంసలు పొందింది. 'నేనే రాజు నేనే మంత్రి' ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. తేజగారు కథ చెప్పగానే ఇమ్మీడియెట్‌గా నేను, మా నాన్న ఓకే చేశాం.

సినిమా మెయిన్‌ కథాంశం ఏమిటి?
- పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రాధా జోగేంద్ర లవ్‌స్టోరి ఇది. మాస్‌ డైలాగ్స్‌, యాక్షన్‌, ఎమోషన్‌ సీన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వుంటాయి. రియలిస్టిక్‌ అప్రోచ్‌తో సాగే ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.

మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- ఈ చిత్రంలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ వున్న జోగేంద్ర క్యారెక్టర్‌లో నటించాను. ఫస్ట్‌టైమ్‌ ఓ కొత్త జోనర్‌ని టచ్‌ చేశాను. అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో వున్నాం.

ఈమధ్య డిఫరెంట్‌ ఫిలింస్‌ చేస్తున్నట్లున్నారు?
- నాకు సినిమాలు అంటే ఇష్టం. యాక్టింగ్‌ అంటే మరీ ఇష్టం. మా ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలోనే వుంది. లక్కీగా నాకు అన్ని మంచి సబ్జెక్ట్స్‌ వస్తున్నాయి. ఏదైనా కొత్తగా చెయ్యాలని తాపత్రయం నాలో వుంది. కొత్త థాట్స్‌తో వస్తున్న డైరెక్టర్స్‌ని ఎంకరేజ్‌ చెయ్యాలి. అప్పుడే మంచి సినిమాలు బయటికి వస్తాయి.

టెక్నాలజీ అనేది సినిమాకి ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది?
- అన్ని భాషలకన్నా కన్సిస్టెంట్‌గా మన తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. టెక్నాలజీ అనేది స్టోరిని సపోర్ట్‌ చేసే ఒక అంశం. టెక్నాలజీ వల్ల ఏ సినిమాలు ఆడవు. ప్రేక్షకులకి ఒక అద్భుతమైన కథని ఇంకా బెటర్‌గా చెప్పడమే టెక్నాలజీ. ఎనీ సినిమాకి సోలో స్టోరినే. సినిమాలో పిక్చర్‌, స్టోరి అండ్‌ సౌండ్‌లో చెప్పడం.

ఫస్ట్‌టైమ్‌ మీ సొంత బేనర్‌లో చేశారు కదా.. ఎలా ఫీలయ్యారు?
- చాలా హ్యాపీగా వుంది. సురేష్‌ ప్రొడక్షన్‌ అంటే నేను పుట్టిన సంస్థ ఇది. ఫస్ట్‌ నుండి మా బేనర్‌లో చేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. నా సినిమాలు అన్నీ రెగ్యులర్‌గా కాకుండా కొంచెం రొటీన్‌కి భిన్నంగా వుంటాయి. నాన్న బిగ్‌ మెయిన్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌. మా చిన్నాన్న బిగ్‌ యాక్టర్‌. ఇద్దరూ ఈ బేనర్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌ ఫిలింస్‌ చేశారు. ఫస్ట్‌టైమ్‌ మా నాన్నకి, వెంకటేష్‌గారికి, నాకు కథ చ్చింది. తేజగారితో కూర్చుని డిస్కస్‌ చేసి ఈ సినిమా వెంటనే స్టార్ట్‌ చేశాం. మా ఫాదర్‌ నిజంగా గ్రేట్‌ సపోర్ట్‌ చేశారు. అలాగే కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ అయి అన్ని పనులు చక్కగా చేశారు.

పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'లీడర్‌' చేశారు. మళ్లీ ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వుంటుందా?
- 'లీడర్‌' అనేది ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ పొలిటికల్‌ సినిమా. కానీ ఈ సినిమాలో పాలిటిక్స్‌ అనేది చిన్న అంశం మాత్రమే. మెయిన్‌గా ఒక భర్త, భార్య మధ్య జరిగే కథ. అనంతపూర్‌, కారైకుడి ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి జోగేంద్ర, అలాంటి సింపుల్‌ లైఫ్‌ గడిపే ఆ వ్యక్తికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటనేది సినిమా చూడాల్సిందే.

తేజగారితో వర్క్‌ చేయడం ఎలా వుంది?
- ఫెంటాస్టిక్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ చిత్రంలో తేజగారు పాలిటిక్స్‌ని చాలా అద్భుతంగా చూపించారు. ఈ కథ నాకు నచ్చడానికి మెయిన్‌ రీజన్‌ అదే. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి వివరంగా ఈ చిత్రంలో చూపించారు.

తమిళ్‌ రాజకీయాలకి ఈ చిత్రం ఏమైనా దగ్గరగా వుంటుందా?
- ఈ సినిమా చూశాక అక్కడ రాజకీయాలకు బాగా కనెక్ట్‌ అవుతుంది అన్పించింది. నేను ప్రతిసారి పొలిటికల్‌ సినిమా చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట కనెక్ట్‌ అవుతూనే వుంది. ఈ సినిమాని తమిళ్‌లో చాలా మార్పులు చేసి చేశాం.

మీ గోల్‌ ఏమిటి?
- యాక్టర్‌ అయ్యిందే కొత్త కాన్సెప్ట్‌ ఫిలింస్‌ చేద్దామని. సినిమా చేసే ప్రతిసారి ఆ క్యారెక్టర్‌ ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చు అనేది నా థాట్‌. ప్రతిసారి చేసిన సినిమానే చేస్తే ఆడియన్స్‌కి, నాకు బోర్‌ కొడుతుంది. 7 ఇయర్స్‌లో నేను చేసిన అన్ని సినిమాలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి.

ఈ సినిమాకి ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
- ఫిజికల్‌గా ఈ సినిమాకి చాలా కష్టపడ్డాను. ఈ సినిమా 6,7 సంవత్సరాల్లో జరిగే కథ. తేజగారు నా క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. వడ్డీ చేసే వ్యాపారి ఎలా ఉంటాడో అలాగే నా బాడీని మౌల్డ్‌ చేసుకున్నాను. మళ్లీ ఒక సింపుల్‌ మాన్‌, యారోగెంట్‌గా మారితో ఎలా ఉంటాడో అలా చూపించాం. సినిమాలో ఛేంజెస్‌ అనేది చాలా సెటిల్డ్‌గా వుంటుంది. నా క్యారెక్టర్‌లో హెవీ వేరియేషన్స్‌ వుంటాయి. కునాల్‌ నాతో 7 సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతున్నాడు. అతను నా జిమ్‌ ట్రైనర్‌. నా బాడీని ఎలా మౌల్డ్‌ చెయ్యమంటే అలా సెట్‌ చేసి చేస్తాడు. ఫిట్‌నెస్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకుని చేశా.

interview gallery

సక్సెస్‌లో లేని తేజతో ఈ సినిమా చేయడానికి రీజన్‌?
- ఓ పర్సన్‌ ప్రీవియస్‌ ట్రాక్‌ రికార్డ్‌ మీద నాకు అలాంటి పట్టింపులు వుండవు. దీనికి ముందు బిగ్‌ డైరెక్టర్‌ రాజమౌళితో 'బాహుబలి' చేశాను. ఓ కొత్త డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డితో 'ఘాజీ' చేశాను. దర్శకుడు చెప్పే కథ విని అది నచ్చితే సినిమా చేస్తాను. తేజగారి పర్సనల్‌ లైఫ్‌లో పెద్ద జర్నీ వుంది. ఈ సినిమా జోగేంద్ర జీవిత కథ. పర్సనల్‌గా ఆ వ్యక్తికి ఎక్స్‌పీరియన్స్‌ వుంటేనే బిగ్‌ స్పాన్‌ వున్న కథ రాయగలుగుతారు. ఈ క్యారెక్టర్‌ నచ్చి తేజగారితో సినిమా చేశాను.

కాజల్‌తో మీ వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?
- తేజగారు ఫస్ట్‌ ఈ కథ రాసినప్పుడే కాజల్‌ని అనుకున్నారు. నా హైట్‌కి తగ్గట్లుగా సెలెక్ట్‌ చేశారు. ఇది ఒక యంగ్‌ కపుల్‌ లవ్‌స్టోరి. రాధ క్యారెక్టర్‌ చాలా ఇంపార్టెంట్‌. ఈ కథ రాధ క్యారెక్టర్‌ చుట్టూ జరుగుతుంది. జోగేంద్ర వేసే ప్రతి అడుగు రాధ మీద వున్న ప్రేమ వల్లే. కాజల్‌ మంచి నటి. తనకున్న స్టార్‌డమ్‌ ఈ సినిమాకి బాగా హెల్ప్‌ అయింది.

ఈ టైటిల్‌ కథకి ఎంతవరకు యాప్ట్‌ అవుతుంది?
- యాటిట్యూడ్‌ బేస్డ్‌ టైటిల్‌ పెడదామని ఫస్ట్‌ నుండి అనుకున్నాం. రకరకాల టైటిల్స్‌ పరిశీలించాక ఇది రైట్‌ టైటిల్‌ అని డిసైడ్‌ చేశాం. కథకి చాలా యాప్ట్‌ అయ్యే టైటిల్‌ ఇది. హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్‌ చేసేవిధంగా వుంటుంది.

ఆగస్ట్‌ 11 ఇంకో రెండు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. కాంపిటీషన్‌గా ఫీలవుతున్నారా?
- బేసిగ్గా నేను ఏదీ పట్టించుకోను. ప్రతి సినిమా డిఫరెంట్‌ జోనర్‌లో వస్తుంది. ఇది మంచి పరిణామం. ఎవరికీ పోటీల్‌ లేవు. ఇది బిగ్‌ వీకెండ్‌ అని నా ఫీలింగ్‌. నా చిన్నప్పుడు ఒకే వారం నాలుగైదు సినిమాలు వచ్చేవి. అప్పుడే సినిమా మూడ్‌ అనేది వస్తుంది. ఆగస్ట్‌ వీకెండ్‌ అనేది ఒక సంక్రాంతి వీకెండ్‌లా అయిపోవాలని నమ్మకంతో వున్నాను.

డ్యాన్స్‌లకి, డ్యూయెట్స్‌కి మీరు విరుద్ధమా?
- విరుద్ధం అని కాదు గానీ ఆ కైండ్‌ ఆఫ్‌ స్టోరీస్‌ని ప్రపోజ్‌ చేయను. ఎందుకంటే కథని నమ్ముకుని చేస్తాను. ఆ కథలో జరిగే సీన్స్‌ని నేను బాగా ఎంజాయ్‌ చేస్తాను. పాట వచ్చేటప్పుడు సీన్స్‌ నుండి డిస్‌కనెక్ట్‌ అయిపోయి మళ్ళీ ఆ కథలోకి వెళ్లటానికి చాలా టైమ్‌ పట్టుద్ది నాకు. అందుకే రెగ్యులర్‌గా చేయకుండా డిఫరెంట్‌గా కథలను ఎంపిక చేసుకుని చేస్తున్నాను.

హాలీవుడ్‌కి వెళ్తున్నారని తెల్సింది?
- డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్‌ కాలేదు. బిగ్‌ ప్రొడక్షన్‌ బేనర్‌లో ఒక సినిమా చేయబోతున్నాను అంటూ.. ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో రానా దగ్గుబాటి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved