pizza
Rashmika Mandanna interview (Telugu) about Geetha Govindam
నా కోసం అలాంటి స్క్రిప్ట్ రాయ‌మ‌ని చెప్పా - ర‌ష్మిక మండ‌న్నా
You are at idlebrain.com > news today >
Follow Us

16 August 2018
Hyderabad

క‌న్న‌డ‌లో హిట్ నాయిక‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక తెలుగులోనూ చేసిన రెండు సినిమాల‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నాయిక‌గా న‌టించిన `గీత గోవిందం` సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోన్న `గీత గోవిందం`లోని త‌న పాత్ర గురించి ర‌ష్మిక గురువారం విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు...

* సినిమా చూశారా? మీకెలా అనిపించింది?
- మోనిట‌ర్‌లో సినిమాను చూసుకునే అల‌వాటు నాకు లేదు. న‌న్ను నేను తొలిసారి నిన్న‌నే అంద‌రితోపాటూ తెర‌మీద చూసుకున్నా. స్క్రీన్ మీద నేను ఉన్నాన‌నే ధ్యాసే లేదు. అంత బాగా ఎంజాయ్ చేశాను సినిమాను.

* రెండో సినిమాకే ఇలాంటి పాత్ర‌ను ఎంపిక చేసుకోవాల‌ని ఎందుకనిపించింది?
- నిజ‌మే. కాస్త పొగ‌రుగా ఉన్న అమ్మాయిగా క‌నిపించాను. నేను బేసిగ్గా చాలా స‌ర‌దాగా ఉంటాను. అస‌లు కోప్ప‌డ‌ను. ఎంత కోపం ఉన్నా లోప‌ల దాచుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తా. అలాంటిది ఈ సినిమా కోసం ఏడు నెల‌లు కోపంగానే న‌టించా. సినిమా చివ‌రి 15 రోజులు మాత్రం స‌ర‌దాగా ఉన్నా. సెట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ `మేడ‌మ్ మేడ‌మ్‌` అంటూ ఉంటే చాలా న‌వ్వు వ‌చ్చేసేది.

* ఆర్టిస్టుగా విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి చెప్పండి?
- చాలా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. త‌న‌తో డియ‌ర్ కామ్రేడ్‌లోనూ న‌టిస్తున్నా. మ‌రోవైపు `దేవ‌దాస్‌`ఓ త‌ర‌హా పాత్ర‌లో చేస్తున్నా. ఇలాంటి పాత్ర‌ల్ని భ‌విష్య‌త్తులోనూ చేస్తాను. ఆ పాత్ర చూసి బావుందంటే నాకు అదే చాలు.

* డియ‌ర్ కామ్రేడ్ కోసం క్రికెట్ నేర్చుకుంటున్న‌ట్టున్నారు?
- నిజ‌మే. నేర్చుకుంటున్నా. నాకు బాస్కెట్ బాల్‌, ఫుట్ బాల్‌, త్రో బాల్‌.. అన్నీ ఇష్ట‌మే. కానీ ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం ఉండ‌దు. అస‌లు ఆ గేమ్ అర్థం కూడా కాదు. అయినా ఇప్పుడు క్రికెట‌ర్‌గానే న‌టించాల్సి వ‌చ్చింది. క్రికెట్ నేర్చుకుంటూ ఉంటే ఫోక‌స్ పెరిగిన‌ట్టు అనిపిస్తోంది.

* గీత గోవిందం సినిమాను మీ ముందు ముగ్గురు హీరోయిన్లు కాద‌న్నార‌నే విష‌యం మీకు తెలుసా?
- విన్నాను. వాళ్ల కార‌ణాలేంటో.. ఎందుకు కాద‌న్నారో.. నేను మాత్రం డేట్లు ఎంత టైట్‌గా ఉన్నా స‌రే, అడ్జ‌స్ట్ చేసుకుని ఈ సినిమా చేశాను. సూప‌ర్ హ్యాపీగా ఉన్నా. నాకు వ‌చ్చే ప్ర‌తి సినిమా గురించి మా ఇంట్లో వాళ్ల‌తో, నా ఫ్రెండ్స్ తో డిస్క‌స్ చేస్తుంటా.

* మ‌రి విమ‌ర్శ‌ల గురించి మాట్లాడుతారా?
- చాలా బాగా మాట్లాడుతాను. అయితే అవ‌న్నీ ఉప‌యోగ‌ప‌డేవే అయి ఉండాలి. ఎక్క‌డో ఎవ‌రో కూర్చుని న‌న్ను ఒక మాట అనేసి వెళ్లిపోతే.. దాన్ని ప‌ట్టుకుని కూర్చుని నా స‌మ‌యాన్ని వృథా చేసుకోను.

* మీ పెళ్లి జ‌ర‌గ‌ద‌నే న్యూస్ కూడా చ‌దివాను.
- చ‌దివి న‌వ్వుకున్నా. ఎందుకంటే నాకూ, ర‌క్షిత్‌కి మేమేంటో బాగా తెలుసు.

interview gallery



* ఇంత‌కీ పెళ్లెప్పుడు?
- నిశ్చితార్థం అప్పుడు రెండున్న‌రేళ్ల‌లో చేసుకుందామ‌ని అనుకున్నాం. ఇప్పుడు ఇద్ద‌రం వృత్తిప‌రంగా బిజీగా ఉన్నాం. అందుకే ఇంకా తేదీలు అనుకోలేదు.

* క‌న్న‌డ‌లో సినిమాలు త‌గ్గిస్తున్నారా?
- లేదండీ. ఇప్పుడు ఒక‌టి చేస్తున్నాను. ఇంకా రెండు సంత‌కాలు జ‌రుగుతున్నాయి. న‌న్ను తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది క‌న్న‌డ ప్ర‌జ‌లే. అందుకే అక్క‌డ సినిమాలు త‌గ్గించాల‌ని అనుకోవ‌డం లేదు. అయితే క‌థ బాగా అనిపిస్తే ఏ భాష‌లో సినిమా చేయ‌డానికైనా నేను సిద్ధ‌మే.

* గ్లామ‌ర్‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నారా?
- అస‌లు గ్లామ‌ర్ అంటే ఏంటి? స‌కుటుంబంగా కూర్చుని చూడ‌ద‌గ్గ సినిమాల్లో నేను ఉండాల‌ని కోరుకుంటున్నానంతే.

* డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
- విల్లీగా న‌టించాల‌ని ఉంది. ప‌ర‌శురామ్‌ని న‌న్ను దృష్టిలో పెట్టుకుని ఓ నెగ‌టివ్ పాత్ర రాయ‌మ‌ని చెప్పా. పీరియాడిక‌ల్ సినిమాల్లోనూ న‌టించాల‌ని ఉంది.

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved