pizza
Ravikanth Perepu interview about Kshanam
‘క్షణం’ సినిమాను స్వార్ధంతో చేశాను – రవికాంత్ పేరెపు
You are at idlebrain.com > news today >
Follow Us

18 February 2016
Hyderaba
d

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం’. అడివిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. రవికాంత్ పేరెపు దర్శకుడు. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రవికాంత్ పేరెపుతో ఇంటర్వ్యూ..

ఆ సినిమా చూసి దర్శకుడు కావాలనుకున్నా...
నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్ లోనే. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మణిరత్నం గారి సఖి సినిమా చూసి ఆయన ఇన్ స్పిరేషన్ తో నేను కూడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. అలానే త్రివిక్రమ్ గారి సినిమాలు, పూరి గారి హీరోల క్యారెక్టరైజేషన్స్, రాజమౌళి గారి బిగ్ కాన్వాస్ అన్ని నచ్చుతాయి. మంచి సినిమా ఏది వస్తే అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. సినిమాలపై ఆసక్తిని చూసి ఇంట్లో వాళ్ళు మొదట డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పారు. వైజాగ్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ తరువాత సినిమాలపై ఫ్యాషన్ తో హైదరాబాద్ వచ్చాను.

అడివి శేష్ అలా పరిచయం....
సినిమా చేయాలనుందని శేష్ తో చెప్పినప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తరువాత రా అని చెప్పాడు. అడివి శేష్, సాయి కిరణ్ అడవి నాకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్. తనతో కిస్ సినిమాకు పనిచేయాల్సింది. సినిమాఅంతా ఫారిన్ లో జరగడంతో వీసా సమస్యతో ఆ సినిమాలో పార్ట్ కాలేకపోయాను. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పార్ట్ అయ్యాను. నాకు సినిమా గురించి థియరీ తప్ప సెట్స్ లో సినిమా ఎలా చేయాలో తెలియదు. మొదట నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. తరువాత నుండి ఇంక అలావాటు అయిపోయింది. కాన్ఫిడెన్స్ తో సినిమా షూట్ చేశాను.

Ravikanth Perepu interview Gallery

ఊహించలేదు...
సినిమా ట్రైలర్ కు మేము అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది బావుందని చెప్పారు. నితిన్, నిఖిల్, రానా, మహేష్ ఇలా చాలా మందికి నచ్చింది.

ఈ జోనర్ మూవీ చేయడానికి స్వార్ధమే కారణం....
తొలి సినిమాగా లవ్ స్టోరీ చేయవచ్చు కదా అనుకోవచ్చు. అయితే ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. నా కెరీర్ కు మొదటి సినిమా కాబట్టి ఏదైనా డిఫరెంట్ గా చేయాలనపించింది. ఓ రకంగా చెప్పాలంటే స్వార్ధంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమా ఎంచుకున్నాను. హర్రర్ సినిమాలు తప్ప అన్నీ జోనర్స్ మూవీస్ చేయాలనుకుంటున్నాను.

క్షణం...రియల్ ఇన్సిడెంట్....
అడవి శేష్ కు జరిగిన ఓ ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకొని ఈ కథను డెవలప్ చేశాం. కిడ్నాప్ చుట్టూ తిరిగే ఓ సస్పెన్స్ డ్రామా ఇది. చిన్నపిల్లను కిడ్నాప్ చేసిన తరువాత తనను వెతికే ప్రాసెస్ లో జరిగే కథ ఇది. గ్రిప్పింగ్ గా ఉంటుంది. శేష్ కూడా ఒక డైరెక్టర్ అయినా.. ఈ సినిమాకు చాలా ఫ్రీడం ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాత నా వర్క్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు.

సినిమా అవుట్ పుట్ బాగా రావడం వెనుక....
మొత్తం 65 నుండి 70 రోజులు చిత్రీకరణ జరిపాం. కథ విన్న తర్వాత పివిపిగారు మూడు రోజుల్లోనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మేకింగ్ లో ఫ్రీడమ్ ఇచ్చారు. స్క్రిప్ట్ కంటే 10 నుండి 15 శాతం సినిమా బావుండాలని చెప్పారు. అవుట్ పుట్ చూసిన తరువాత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లోనే తీశాం. స్క్రీన్ ప్లే కూడా టైటిల్ కు తగ్గట్లు గ్రిప్పింగ్ గా ఉంటుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఇప్పటివరకు ఏది ఫైనల్ కాలేదు. అయితే నెక్ట్స్ మూవీ చస్తే లవ్ స్టొరీ చేయాలనుకుంటున్నాను.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved