pizza

I observe everything around me since cinema is an amalgam of emotions: Cinematographer Richard Prasad
సినిమా అనేది ఎమోష‌న్స్ క‌ల‌యిక కాబ‌ట్టి నా చుట్టూ జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని గ‌మ‌నిస్తూ ఉంటాను - రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

You are at idlebrain.com > news today >
Follow Us

20 July 2019
Hyderabad

I observe everything around me since cinema is an amalgam of emotions: Cinematographer Richard Prasad

Richard Prasad is a well-known and critically-acclaimed technician, who has cranked the camera for such movies as 'Swamy Ra Ra', 'Kotha Janta', 'Babu Bangaram', and 'Dochey'. 'Oh Baby' is his most recent film. With the film becoming a big hit and his work getting well-deserved applause, Richard Prasad speaks his mind in his free-wheeling interview.

Background:
My father used to work as a Registrar, and my mother was a teacher. After a few years of professional life, she quit her job and took over all domestic responsibilities. She is no more now. My sister has been married to a friend of mine. My brother-in-law, too, is a cinematographer. I studied Visual Communications. Journalism, Photography, and Painting were part of it. After completing the course, I joined a TV channel as a part-time employee and launched its website. I used to be engaged in web designing as well. When I watched the Hollywood movie 'Sylvester', I was enthused to become a director. However, I slowly realized that cinematography is my biggest passion. I would always be curious to gain knowledge of all film making crafts. That's why I studied a cinematography course. By then, I had gained command over Editing. With this knowledge, I could get the scene division and sounding techniques right.

That's how I think for every film
Every time I work on a movie, I see myself as an assistant director rather than as a cinematographer. I observe the way directors bring out the emotions in scenes/actors. Many years ago, after completing my cinematography course, I did a few commercials. I happened to get in touch with lyricist Krishna Chaitanya in a theatre. Through him, I got to know director Sudheer Varma. I started out working on short films and eventually entered the film industry. 'Swamy Ra Ra', directed by Sudheer Varma, was my first movie. 'Kotha Janta', 'Dochey', 'Babu Bangaram' followed.

That's my bad luck:
After they liked my work on 'Dochey', NTR garu and Sukumar garu offered me 'Nannaku Prematho'. The film had to be shot in London. I applied for Visa twice. But it got rejected both the times. Had I been issued Visa, I would have got to work with a big star like NTR garu. Missing out on the project was my bad luck.

They are my inspiration
Steven Spielberg is one of my all-time favourites. Janusz Kaminski is such a talented cinematographer who has done many movies in partnership with Spielberg. Christopher Dial is another of my favourite. PS Vinod and Rathnavelu are also among those I like. I am a movie buff who watches films without linguistic barriers. I keep observing things around me.

We used the reverse technique
'Oh Baby' is a contemporary fantasy movie. That's why we had to be very careful with the selection of the colours. The tone of the frames depends on the dresses that the characters wear. Usually, costumes are selected on the basis of the tone. But, in the case of this film, we used the reverse technique. The style apes the movies made in Korea, Philippines and Thailand.

సినిమా అనేది ఎమోష‌న్స్ క‌ల‌యిక కాబ‌ట్టి నా చుట్టూ జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని గ‌మ‌నిస్తూ ఉంటాను - రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

`స్వామిరారా`, `కొత్త‌జంట‌, `బాబు బంగారం`, `దోచెయ్‌` సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను అందించిన సినిమాటోగ్రాఫ‌ర్ రిచ‌ర్డ్ ప్రసాద్‌. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ అందించిన చిత్రం `ఓ బేబీ`. జూలై 5న విడుద‌లైంది. స‌మంత అక్కినేని టైటిల్ పాత్ర‌లో న‌టించారు. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, తేజ స‌జ్జ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. సినిమా ఘన విజ‌యం సాధించిన నేప‌థ్యంలో రిచ‌ర్డ్ ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ ...

నేప‌థ్యం...
- నాన్న రిజిస్ట్రార్‌గా పని చేసేవారు. అమ్మ టీచ‌ర్‌. ఆమె త‌న జాబ్‌కి రిజైన్ చేసి ఇంటి వ్య‌వ‌హారాల‌ను చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ లేరు. చనిపోయారు. మా సిస్ట‌ర్‌ను నా స్నేహితుడే పెళ్లి చేసుకున్నాడు. మా బావ‌గారు కూడా సినిమాటోగ్రాఫ‌ర్‌. నేను విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్స్ చదివాను. అందులో జ‌ర్న‌లిజం, ఫోటోగ్ర‌ఫీ, పెయింటింగ్ అన్నీ ఉండేవి. చ‌దువు పూర్తి చేసుకున్న త‌ర్వాత జ‌య టీవీలో పార్ట్ టైమ‌ర్‌గా జాయిన్ అయ్యాను. జ‌య టీవీ వెబ్‌సైట్‌ను నేనే స్టార్ట్ చేశాను. వెబ్ డిజైనింగ్ చేసేవాడిని. ఓ సారి స్పీల్‌బ‌ర్గ్ `సిల్వ‌స్ట‌ర్ ` సినిమా చూశాను. అప్పుడు డైరెక్ట‌ర్ కావాల‌నుకున్నాను కానీ.. నాకు డైరెక్ష‌న్ కంటే ఫోటోగ్ర‌ఫీ అంటేనే ఆస‌క్తిఉంద‌ని గ్ర‌హించాను. అన్నిక్రాఫ్ట్స్ తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉండేది. అందువ‌ల్ల సినిమాటోగ్ర‌ఫీలో కోర్సు చేయాల‌నుకున్నాను. అంత కంటే ముందే నేను చదువుకునే రోజుల్లో ఎడిటింగ్‌పై ప‌ట్టు సాధించాను. ఎడిటింగ్ అవ‌గాహ‌న ఉంటే సీన్ డివిజ‌న్, సౌండింగ్ అన్ని తెలుస్తాయి.

నేను ప్ర‌తి సినిమాకు అలాగే అనుకుని ప‌నిచేస్తాను...

- నేను ప్ర‌తి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ అనే భావ‌న‌తో కాకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అనే భావ‌న‌తో పనిచేస్తాను. ఒక్కొక్క డైరెక్ట‌ర్ ఒక్కొక్క ఎమోష‌న్‌ను ఎలా క్యారీ చేస్తార‌నే దాన్ని అబ్జ‌ర్వ్ చేసేవాడిని. కానీ పూర్తి ఫోక‌స్ అంతా ఫోటోగ్ర‌ఫీపైనే ఉండేది. నేను కోర్సు పూర్తి చేయ‌గానే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. ఓసారి థియేట‌ర్‌లో పాట‌ల ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అక్క‌డ నుండి సుధీర్ వ‌ర్మ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక్క‌డ వారితో క‌లిసి షార్ట్ ఫిలింస్‌కు ప‌నిచేస్తూ వ‌చ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తొలిసారి `స్వామిరారా`తో సినిమాటోగ్రాప‌ర్‌గా మారాను. త‌ర్వాత కొత్త‌జంట‌, దోచెయ్‌, బాబుబంగారం సినిమాల‌కు ప‌నిచేశాను.

అది నా దుర‌దృష్టం..
- `దోచెయ్‌`లో నా వ‌ర్క్ చూసిన ఎన్టీఆర్‌గారు, సుకుమార్‌గారు ..`నాన్న‌కు ప్రేమ‌తో` సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. సినిమాలో లండ‌న్ షూట్ చేయాలి. నేను రెండు సార్లు వీసాకు అప్లై చేశాను. కానీ రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ వంటి స్టార్‌తో ప‌నిచేసే అవ‌కాశం దక్కి ఉండేది. మిస్ అవ‌డం నా దుర‌దృష్టం.

వారే ఇన్‌స్పిరేష‌న్‌
- డైరెక్ష‌న్ ప‌రంగా నాకు స్పీల్‌బ‌ర్గ్ అంటే చాలా ఇష్టం. సినిమాటోగ్ర‌ఫీ ప‌రంగా ఇద్ద‌రినీ బాగా ఇష్ట‌ప‌డ‌తాను. జాన్ క‌మిన్స్‌స్కి అనే హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. క్రిస్టోఫ‌ర్ డైల్‌గారంటే చాలా ఇష్టం. అలాగే పి.ఎస్‌.వినోద్‌గారు, ర‌త్న‌వేలుగారు కెమెరావర్క్ బాగా న‌చ్చుతాయి. నేను సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుంటాను. భాష‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తాను. అలాగే మ‌న చుట్టూ జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని బాగా అబ్జ‌ర్వ్ చేస్తుంటాను. ఎందుకంటే సినిమా అంటే అన్నింటి క‌ల‌యికే అని నా ఉద్దేశం.

రివ‌ర్స్‌గా వెళ్లాం...
- `ఓ బేబీ` సినిమా విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుత స‌మ‌యంంలో జ‌రిగే ఫాంట‌సీ మూవీ. కాబ‌ట్టి క‌ల‌ర్స్ ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. వారు వేసుకునే డ్రెస్‌ను బేస్ చేసుకుని టోన్ ఉండేలా కేర్ తీసుకున్నాను. సాధార‌ణంగా టోన్ ఆధారంగా డ్రెస్ సెల‌క్ట్ చేసుకుంటారు. కానీ మేం రివ‌ర్స్‌గా వెళ్లాం. మ‌న సినిమాల్లో కెమెరా స్టైల్ కొరియ‌న్‌, ఫిలిఫైన్, థాయ్ మూవీస్ స్టైల్లో ఉంటాయి.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved