pizza
Ritu Varma interview (Telugu) about Keshava
`కేశ‌వ‌` అంద‌రినీ మెప్పించే ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా - రీతూ వ‌ర్మ‌
You are at idlebrain.com > news today >
Follow Us

17 May 2017
Hyderabad

దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిఖిల్‌,రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కేశ‌వ‌`. సినిమా మే 19న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రీతూవ‌ర్మ‌తో ఇంట‌ర్వ్యూ విశేషాలు..

పాత్ర గురించి..
`కేశ‌వ` సినిమాలో లాయ‌ర్ స్టూడెంట్ పాత్ర చేశాను. సినిమాలో నా పాత్ర పేరు స‌త్య‌భామ‌. సినిమాలో ముందుగా కేశ‌వ‌ను క‌లిసిన త‌ర్వాత కేశ‌వ హ‌త్య‌లెందుకు చేస్తున్నాడో తెలియ‌దు. కానీ ఆ హ‌త్య‌లెందుకు జ‌రుగ‌తున్నాయ‌నే కార‌ణం తెలిసిన త‌ర్వాత కేశ‌వ‌కు స‌త్య‌భామ స‌పోర్ట్ చేస్తుంది. నేను, నిఖిల్‌, కౌశిక్ స‌హా కొంత మంది స్టూడెంట్స్‌లాగా సినిమాలో క‌నిపిస్తాం.

మంచి ఛాయిసే..
- ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ మూవీస్‌లో చేశాను. ఏదైనా కొత్త జోన‌ర్‌ల సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు కేశ‌వ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. కేశ‌వ మంచి ఛాయిస్ అని అనుకుంటున్నాను. టీజ‌ర్, ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Ritu Varma interview gallery

ఇంటెన్స్ సీన్స్ ఎమోష‌న‌ల్ మూవీ..
- స్వామిరారా, దోచెయ్ సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాను కూడా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాలో నేను యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు కానీ, క్లైమాక్స్‌లో కొన్ని చేజింగ్ సీన్స్ వంటి ఇంటెన్స్ సీన్స్‌లో న‌టించాను.

సినిమా కాన్సెప్ట్‌..
- క‌థ బాగా న‌చ్చింది. ఓ హార్ట్ డిజార్డ‌ర్ ఉన్న యువ‌కుడు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్న‌ప్పుడు ఏం చేశాడు. తన బ‌ల‌హీన‌త‌ను బ‌లంగా ఎలా మార్చుకుంటాడనే కాన్సెప్ట్ న‌చ్చింది. పాత్ర‌ల విష‌యంలో నేను ముందు నుండి సెల‌క్టివ్‌గా ఉంటున్నాను. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయాల‌ని ఉంది. కానీ కేవ‌లం పాట‌ల‌కే ప‌రిమిత‌మైయ్యే గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించ‌లేను.

డ్యాన్సులు చేయ‌లేదు..
- కేశ‌వ సినిమాలో డ్యాన్సులు చేయ‌లేదు. లిప్ సింకింగ్ సాంగ్స్ కూడా లేవు. అన్నీ సిచ్యువేష‌న‌ల్ సాంగ్స్ ఉంటాయి. ఇషా గోపీక‌ర్‌గారితో రెండు, మూడు సీన్స్‌లో క‌లిసి న‌టించాను. చాలా గ్యాప్ త‌ర్వాత ఆవిడ తెలుగులో న‌టించిన చిత్ర‌మిది.

త‌దుప‌రి చిత్రాలు...
- తెలుగులో కేశ‌వ త‌ర్వాత కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను. త‌మిళంలో ధృవ న‌క్షత్రంలో న‌టిస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved